Vinesh Phogat | వినేశ్ ఫొగాట్ పిటిషన్.. భారత రెజ్లింగ్ సమాఖ్యకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..
Vinesh Phogat | భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు భారత రెజ్లింగ్ సమాఖ్యకు నోటీసులు జారీ చేసింది. ఆమెపై విధించిన నిషేధం, షోకాజ్ నోటీసు అంశంపై వివరణ ఇవ్వాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణను జూలై 6కు వాయిదా వేసింది.
Vinesh Phogat | భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు భారత రెజ్లింగ్ సమాఖ్యకు నోటీసులు జారీ చేసింది. ఆమెపై విధించిన నిషేధం, షోకాజ్ నోటీసు అంశంపై వివరణ ఇవ్వాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణను జూలై 6కు వాయిదా వేసింది. ఇటీవల డబ్ల్యుఎఫ్‌ఐ వినేశ్ ఫోగట్‌కు షోకాజ్ నోటీసు జారీ చేస్తూ జూన్ వరకు దేశీయ టోర్నమెంట్లలో పాల్గొనకుండా అర్హత రద్దు చేసింది. క్రమశిక్షణ ఉల్లంఘన, యాంటీ డోపింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నట్లు సమాఖ్య తెలిపింది. తిరిగి రిటైర్మెంట్ నుంచి రీఎంట్రీ తీసుకున్న తర్వాత అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య నిబంధనల ప్రకారం ఆరు నెలల ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉండగా.. అది పాటించలేదని డబ్ల్యుఎఫ్‌ఐ పేర్కొంది.
దీంతో ఆమెను దేశీయ పోటీలకు అర్హురాలిగా పరిగణించలేమని స్పష్టం చేసింది. యూడబ్ల్యూడబ్ల్యూ కూడా తన లేఖలో.. రీఎంట్రీ కావాలంటే ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, సంబంధిత అంతర్జాతీయ సమాఖ్యకు కనీసం ఆరు నెలల ముందే సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని, ఆ కాలంలో యాంటీ డోపింగ్ పరీక్షలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నట్లు సమాచారం. డబ్ల్యూఎఫ్‌ఐ 15 పేజీల నోటీసులో వినేశ్ ప్రవర్తన దేశ ప్రతిష్టకు నష్టం కలిగించిందని, భారత రెజ్లింగ్ ప్రతిష్టను దెబ్బ తీసిందని ఆరోపించింది. గోండాలో మే 10–12 మధ్య జరిగిన నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ సహా జూన్ 26 వరకు ఏ దేశీయ పోటీల్లోనూ పాల్గొనరాదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వినేశ్ ఫోగట్, షోకాజ్ నోటీసును అలాగే ట్రయల్స్ నుంచి తన పేరును తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తక్షణ ఉపశమనం ఇవ్వకపోయినా, కేసును తదుపరి విచారణకు జూలై 6కు వాయిదా వేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Brij Bhushan Sharan Singh | రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. బ్రిజ్ భూషణ్‌కు ఢిల్లీ హైకోర్టు భారీ ఊరట
ఆగస్టు 3, 2026

Viral News | కవిత సోషల్ మీడియా సెల్లో వేధింపులు..! ఫిర్యాదు చేసిన వారినే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణలు!!
ఆగస్టు 2, 2026

Bonalu | మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బోనాల వేడుక.. హాజరైన సీఎం రేవంత్
ఆగస్టు 2, 2026
తాజావార్తలు
- ●KTR | వేణు కుమార్ రాసింది సూసైడ్ నోట్ కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఛార్జ్‌షీట్
- ●Etala Rajendar | కార్మికులు కంపెనీలకు వ్యతిరేకం కాదు.. వారి సంక్షేమాన్ని కంపెనీలు మరవొద్దు
- ●Sama Ramnohan Reddy | రాష్ట్రం సర్వనాశనం కావాలని కోరుతున్నారు.. హరీశ్ రావుపై సామ రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం
- ●Ram Mandir Donations Row | రామ్‌లల్లా ఊయల కోసం 150 కిలోల వెండి వస్తే.. 85 కిలోలతోనే దాన్ని తయారు చేశారు
- ●Nani - Nithiin | నాని నిర్మాత...నితిన్ హీరో - అలియాస్ రుక్మిణి టైటిల్ గ్లింప్స్ రిలీజ్
- ●JioTag 2 | జియో కొత్త ట్రాకింగ్ డివైస్.. కేవలం రూ.1249 మాత్రమే..

KTR | వేణు కుమార్ రాసింది సూసైడ్ నోట్ కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఛార్జ్‌షీట్

Etala Rajendar | కార్మికులు కంపెనీలకు వ్యతిరేకం కాదు.. వారి సంక్షేమాన్ని కంపెనీలు మరవొద్దు

Sama Ramnohan Reddy | రాష్ట్రం సర్వనాశనం కావాలని కోరుతున్నారు.. హరీశ్ రావుపై సామ రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం

Ram Mandir Donations Row | రామ్‌లల్లా ఊయల కోసం 150 కిలోల వెండి వస్తే.. 85 కిలోలతోనే దాన్ని తయారు చేశారు



