Delhi Bomb Threat | మళ్లీ బాంబు బెదిరింపు కలకలం!
Delhi Bomb Threat | ఢిల్లీ నగరంలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. ఢిల్లీ అసెంబ్లీ, సెక్రటేరియట్, ఎర్రకోట, ధౌలా కువాల్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, లోధి రోడ్‌లోని ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూల్‌కు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దాంతో పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు.
- ఎర్రకోట, ఢిల్లీ అసెంబ్లీ, స్కూల్‌కు బెదిరింపులు
- తనిఖీలు చేసిన భద్రతా సంస్థలు
Delhi Bomb Threat | ఢిల్లీ నగరంలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. ఢిల్లీ అసెంబ్లీ, సెక్రటేరియట్, ఎర్రకోట, ధౌలా కువాల్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, లోధి రోడ్‌లోని ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూల్‌కు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దాంతో పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
సమాచారం మేరకు.. పాఠశాల పరిపాలనకు పాఠశాలపై బాంబులతో దాడి చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్స్‌ను చూసిన యాజమాన్యం వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని పాఠశాలలను ఖాళీ చేయించి తనిఖీలు నిర్వహించారు. అలాగే, ఢిల్లీ అసెంబ్లీ, ఎర్రకోటపై సైతం దాడులు చేస్తామని హెచ్చరించారు. ఆర్మీ పబ్లిక్ స్కూల్, లోధి రోడ్‌లోని ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూల్ అనే రెండు పాఠశాలలకు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయని, ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించి తనిఖీలు నిర్వహించామన్నారు. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని పోలీసులు తెలిపారు.
ఢిల్లీ సెక్రటేరియట్, ఢిల్లీ అసెంబ్లీ, ఎర్రకోట, దేశ రాజధానిలోని రెండు పాఠశాలలు సహా అనేక సంస్థలకు సోమవారం ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు. హెచ్చరికల తర్వాత పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని, అవన్నీ ఫేక్ బెదిరింపులుగా పేర్కొన్నారు. అలాగే, గురుగ్రామ్ ఎయిర్‌ఫోర్స్ స్కూల్‌కు బెదిరింపులు ఇదిలా ఉండగా.. ఇటీవల ఎయిర్‌పోర్టులు, విమానాలు, పాఠశాలలతో పాటు పార్లమెంట్‌కు సైతం బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. మరో వైపు పోలీసులు హెచ్చరిక మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
https://x.com/ANI/status/2025782946800849045
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






