త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyclone Threat | బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఇస్రో శాటిలైట్‌ చిత్రాల్లో స్పష్టంగా గుర్తింపు..

Cyclone Threat | బంగాళాఖాతంలో మరో వాతావరణ వ్యవస్థ బలపడుతోంది. అర్నబ్‌ తుపాను ప్రభావం నుంచి కోలుకోకముందే ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్తగా వాయుగుండం ఏర్పడింది. ఇస్రోకు చెందిన ఇన్‌శాట్‌-3డీఎస్‌ ఉపగ్రహం శనివారం ఉదయం తీసిన చిత్రాల్లో ఈ వ్యవస్థ స్పష్టంగా కనిపించింది.

P

National | Published On Oct 31, 2026, 8.30 pm IST

Cyclone Threat | బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఇస్రో శాటిలైట్‌ చిత్రాల్లో స్పష్టంగా గుర్తింపు..
Advertisement

Cyclone Threat | బంగాళాఖాతంలో మరో వాతావరణ వ్యవస్థ బలపడుతోంది. అర్నబ్‌ తుపాను ప్రభావం నుంచి కోలుకోకముందే ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్తగా వాయుగుండం ఏర్పడింది. ఇస్రోకు చెందిన ఇన్‌శాట్‌-3డీఎస్‌ ఉపగ్రహం శనివారం ఉదయం తీసిన చిత్రాల్లో ఈ వ్యవస్థ స్పష్టంగా కనిపించింది. ఇది ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు కదులుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. అక్టోబర్‌ 29న దక్షిణ అండమాన్‌ సముద్రం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా ప్రారంభమైన ఈ వ్యవస్థ క్రమంగా బలపడింది. పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ అక్టోబర్‌ 31 సాయంత్రానికి వాయుగుండంగా మారింది.

తాజా ఉపగ్రహ చిత్రాల్లో వాయుగుండం సుడిగుండం ఆకారంలో కనిపిస్తోంది. రానున్న రెండు రోజుల్లో ఇది ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతం వైపు కదిలే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ వాయుగుండం ప్రభావంతో దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవులతో పాటు ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతాల‌తో పాటు ప‌లుచోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి పోర్టు హెచ్చరికలు జారీ చేయలేదు. వాయుగుండం కదలిక, తీవ్రతలో వచ్చే మార్పులపై అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

 

ట్యాగ్స్:

Andhra PradeshBay Of BengalCycloneIMD IndiaINSAT 3DS SatelliteTelanganaTelugu NewsWeather Update
Advertisement
Advertisement