త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్ ఇళ్లకు న‌వంబ‌ర్ 3, 4 తేదీల్లో లాట‌రీ : హౌసింగ్ బోర్డు చైర్మ‌న్

Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్‌ ఇళ్ల కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్‌ 3, 4 తేదీల్లో ఆన్‌లైన్‌ ఈ-లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. ఈ విషయాన్ని హౌసింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్ వీపీ గౌతమ్ వెల్లడించారు. కేటాయింపుల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

P

Hyderabad | Published On Oct 31, 2026, 7.35 pm IST

Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్ ఇళ్లకు న‌వంబ‌ర్ 3, 4 తేదీల్లో లాట‌రీ : హౌసింగ్ బోర్డు చైర్మ‌న్
Advertisement

Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్‌ ఇళ్ల కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్‌ 3, 4 తేదీల్లో ఆన్‌లైన్‌ ఈ-లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. ఈ విషయాన్ని హౌసింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్ వీపీ గౌతమ్ వెల్లడించారు. కేటాయింపుల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు వీక్షించేందుకు హౌసింగ్‌ శాఖ యూట్యూబ్‌ ఛానెల్‌తో పాటు ఇతర సోషల్‌ మీడియా వేదికల్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పేర్కొన్నారు. ముషీరాబాద్‌, ఎల్‌బీనగర్‌, చాంద్రాయణగుట్ట, గోషామహల్‌ నియోజకవర్గాల్లో ప్రతిపాదించిన ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్లకు ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, ప్రాథమిక పరిశీలన పూర్తయింది. అర్హులైన దరఖాస్తుదారులను ఎంపిక చేసేందుకు నవంబర్‌ 3న ఈ-లాటరీ చేపట్టనున్నారు.

4న మాప్‌అప్‌ లాటరీ

ఇందిరమ్మ ఇళ్ల పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 480 ఇళ్ల చొప్పున నిర్మాణాలు చేపట్టారు. తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేశారు. అయితే క్షేత్రస్థాయి పరిశీలనలో కొందరు లబ్ధిదారులు స్థానికంగా నివసించకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో చెల్లింపులకు ముందుకు రాకపోవడం, ఇప్పటికే సొంత ఇళ్లు ఉండటం వంటి కారణాలతో కేటాయింపులు రద్దయ్యాయి. ఇలా మిగిలిన ఇళ్లను ఇతర అర్హులకు కేటాయించేందుకు నవంబర్‌ 4న మాప్‌అప్‌ ఈ-లాటరీ నిర్వహించనున్నారు.

చిరునామాల ఆధారంగా నియోజకవర్గాల గుర్తింపు

గతంలో కొందరు దరఖాస్తుదారులు తాము నివసించే నియోజకవర్గానికి కాకుండా ఇతర ప్రాంతాల్లో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వారి పేర్లు గత లాటరీలో చోటు దక్కించుకోలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు దరఖాస్తుల్లో పేర్కొన్న చిరునామాలను పరిశీలించి, జియోకోడ్స్‌ ఆధారంగా గూగుల్‌ మ్యాప్స్‌ సాయంతో అసలు నివాస నియోజకవర్గాన్ని గుర్తించారు. అర్హులైన వారి పేర్లను మాప్‌అప్‌ లాటరీలో సుమోటోగా చేర్చనున్నారు. నియోజకవర్గాల మార్పు కోసం వచ్చిన విజ్ఞప్తులనూ పరిష్కరించినట్లు గౌత‌మ్‌ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఏ నియోజకవర్గంలో నివసించే వారికి అక్కడే సొంత ఇంటి వసతి కల్పించేలా కేటాయింపులు చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్:

ChandrayanguttaE LotteryGoshamahalHyderabadIndiramma HousesIndiramma Houses AllotmentIndiramma Housing SchemeIndiramma TowersLB NagarMushirabadNovember 3November 4 Mop Up LotteryTelanganaTelangana Housing BoardTelugu NewsVP Gautham
Advertisement
Advertisement