CM Pinarayi Vijayan | బడ్జెట్ విషయంలో కేరళపై మరోమారు వివక్ష: సీఎం పినరయి విజయన్
CM Pinarayi Vijayan | కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విషయంలో మరోసారి కేరళకు అన్యాయం చేసిందని, తమ రాష్ట్రం పట్ల పూర్తి నిర్లక్ష్యపూరిత వైఖరిని ప్రదర్శిస్తుందని, తమ పట్ల వివక్ష చూపిస్తోందని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు.
CM Pinarayi Vijayan | కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విషయంలో మరోసారి కేరళకు అన్యాయం చేసిందని, తమ రాష్ట్రం పట్ల పూర్తి నిర్లక్ష్యపూరిత వైఖరిని ప్రదర్శిస్తుందని, తమ పట్ల వివక్ష చూపిస్తోందని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ద్వారా కేరళను మరోమారు నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టమైందని అన్నారు. రాష్ట్రానికి ఎయిమ్స్ కావాలని, 7 హై స్పీడ్ రైల్ కారిడార్లను నిర్మించాలని, విజింజం పోర్టును అభివృద్ధి చేయాలని కేంద్రానికి విజ్ఞప్తులు చేశామని, కానీ వాటిని పూర్తిగా పట్టించుకోలేదని ఆరోపించారు. అలాగే ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రాలకు ఇచ్చే వాటాను పెంచడానికి కేంద్రం నిరాకరించిందని, 41 శాతం కేటాయింపునే కొనసాగించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విజయన్ అన్నారు. కేరళ నుంచి ఉన్న కేంద్ర మంత్రులు ఈ నిర్లక్ష్యానికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కార్పొరేట్లను ఇంకా సంపన్నులుగా మార్చే బడ్జెట్: విజయన్
బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ వర్గాలను సంపన్నులుగా మార్చి, సామాన్య ప్రజలను మరింత పేదరికంలోకి నెట్టే విధాన పత్రంగా మారిందని సీఎం విమర్శించారు. రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్లను నిలిపివేయడం రాష్ట్ర ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రమాదకర నిర్ణయమని ఆయన అన్నారు. 2021లో కేరళకు మొత్తం గ్రాంట్లు రూ.2.2 లక్షల కోట్లు ఉంటే, ప్రస్తుత బడ్జెట్‌లో అవి రూ.1.4 లక్షల కోట్లకు తగ్గాయి. ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయం.. అని విజయన్ స్పష్టం చేశారు. జనాభా నియంత్రణ, దేశీయ ఆదాయ వృద్ధిలో కేరళ సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకుంటే, స్వల్పంగా పెరిగిన పన్నుల వాటా రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిందేనని, కానీ గ్రాంట్లు తగ్గిపోవడంతో మొత్తం కేంద్ర వాటాలో వాస్తవ పెరుగుదల లేదని అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్ర చర్యలు: సీఎం
బడ్జెట్‌లోని కొన్ని నిబంధనలు రాష్ట్ర ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలకు ముప్పుగా మారుతున్నాయని విజయన్ హెచ్చరించారు. కేరళ ఖనిజ వనరులను ప్రైవేట్, కార్పొరేట్లకు అప్పగించే విధానానికి కేంద్రం బాటలు వేసిందని, పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన కఠిన నిబంధనలను సడలిస్తూ పర్యావరణ అనుమతులను వేగంగా మంజూరు చేయడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. విజింజం-చవారా-కొచ్చి మధ్య ఖనిజ కారిడార్‌ను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేస్తామని కేరళ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని, దీనికి విరుద్ధంగా కేంద్ర చర్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రెండూ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సహా అనేక అంశాల్లో కేరళను మోసం చేశాయనే విషయాన్ని మరోసారి రుజువు చేస్తోందని అన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | తెలంగాణకు అదనంగా రూ. 5 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయం చేయండి..
మే 20, 2026

Kerala | 10 గంటలకు కేరళ సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం.. 20 మంది మంత్రులు కూడా..
మే 18, 2026

Southwest Monsoon | వాతావరణ శాఖ చల్లటి కబురు.. మే 26 నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
మే 15, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



