త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jal Jeevan Mission | జ‌ల్‌జీవ‌న్ మిష‌న్‌కు ఆర్థిక స‌హాయం నిలిపేసిన కేంద్రం

Jal Jeevan Mission | దేశ‌వ్యాప్తంగా గ్రామీణ ప్ర‌జ‌ల‌కు న‌ల్లాల ద్వారా తాగునీటి సౌక‌ర్యం క‌ల్పించేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం ప్రారంభించిన జ‌ల్‌జీవ‌న్ మిష‌న్‌ (Jal Jeevan Mission) కు ఆర్థిక స‌హాయాన్ని నిలిపివేసిన‌ట్లు కేంద్ర‌ప్ర‌భుత్వం తెలిపింది.

A

National | Published On Feb 3, 2026, 4.26 pm IST

Jal Jeevan Mission | జ‌ల్‌జీవ‌న్ మిష‌న్‌కు ఆర్థిక స‌హాయం నిలిపేసిన కేంద్రం
Advertisement

రాష్ట్రాలే భ‌రించాల‌ని సూచ‌న‌
రాజ్య‌స‌భ‌లో అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌భుత్వం లిఖిత పూర్వ‌క స‌మాధానం

Jal Jeevan Mission | దేశ‌వ్యాప్తంగా గ్రామీణ ప్ర‌జ‌ల‌కు న‌ల్లాల ద్వారా తాగునీటి సౌక‌ర్యం క‌ల్పించేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం ప్రారంభించిన జ‌ల్‌జీవ‌న్ మిష‌న్‌ (Jal Jeevan Mission) కు ఆర్థిక స‌హాయాన్ని నిలిపివేసిన‌ట్లు కేంద్ర‌ప్ర‌భుత్వం తెలిపింది. మిగిలిన ప‌నుల‌కు రాష్ట్రాలు త‌మ సొంత వ‌న‌రుల‌ను వినియోగించుకోవాల‌ని సూచించింది. ఈ మేర‌కు రాజ్య‌స‌భ‌లో ఒక స‌భ్యుడు అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర‌ప్ర‌భుత్వం లిఖిత పూర్వ‌క స‌మాధానం ఇచ్చింది. మొద‌ట ఆమోదించిన రూ.2.08 ల‌క్ష‌ల కోట్ల మొత్తాన్ని 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రం వ‌ర‌కు ఉప‌యోగించేయ‌డంతో మిగిలిన ప‌నుల ఆర్థిక భారాన్ని రాష్ట్రాలే భ‌రించాల‌ని స్ప‌ష్టం చేసింది.

2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ఇళ్ల‌కు మంచినీటి స‌ర‌ఫ‌రా కోసం న‌ల్లా క‌నెక్ష‌న్లు ఏర్పాటు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా 2019లో అట్టాహాసంగా జ‌ల్‌జీవ‌న్ మిష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 81.5 శాతం (15.79 కోట్ల గృహాలు) ప‌నులు పూర్తికాగా, మిగిలిన 3.56 కోట్ల ఇళ్ల‌కు ప‌నులు జ‌రుగుతున్నాయి. ల‌క్ష్యాన్ని 2028కి పూర్తిచేయాల‌ని నిర్దేశించుకున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం మొద‌ట కేటాయించిన నిధులు పూర్త‌వ‌డంతో పాటు చాలా రాష్ట్రాల్లో అవినీతి, నాణ్య‌తా లోపాలు, అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు ప్ర‌భుత్వం గుర్తించింది. దీంతో దీనిపై కేంద్రం పున‌రాలోచ‌న‌లో ప‌డింది. 2026-27 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను నిధులను కేంద్రం కేటాయించిన‌ప్ప‌టికీ, ఆ నిధులు కేవ‌లం ప‌థ‌కం నిర్వ‌హ‌ణ‌కు మాత్ర‌మే వినియోగించ‌నున్నారు.

Advertisement
Advertisement