త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Census 2027 Dates | జనగణన 2027: ఇంట్లో కూర్చొని జనాభా లెక్కల నమోదు మీరే స్వయంగా చేసుకోవచ్చు.. తెలంగాణలో ఎప్పుడంటే?

దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'జనగణన 2027' (Census 2027) ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ 'సెల్ఫ్-ఎన్యూమరేషన్' సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇంట్లో కూర్చొని మొబైల్ ద్వారానే జనాభా లెక్కల వివరాలను నమోదు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నమోదు తేదీలను కూడా అధికారులు ప్రకటించారు.

J

Telangana | Published On Apr 4, 2026, 5.37 pm IST

Telangana Census 2027 Dates | జనగణన 2027: ఇంట్లో కూర్చొని జనాభా లెక్కల నమోదు మీరే స్వయంగా చేసుకోవచ్చు.. తెలంగాణలో ఎప్పుడంటే?
Advertisement

Telangana Census 2027 Dates | త్రినేత్ర.న్యూస్ : దేశంలో అత్యంత కీలకమైన 'జనగణన 2027' (Census 2027) ప్రక్రియ ఊపందుకుంది. ఈసారి జనాభా లెక్కల సేకరణను మరింత సులభతరం చేస్తూ, పౌరులు తమ వివరాలను ఆన్‌లైన్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే (Self-Enumeration) అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దీని కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను ప్రారంభించింది. అధికారులు లేదా ఎన్యుమరేటర్ల కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా, మీ కంఫర్ట్‌ను బట్టి ఇంటి నుంచే వివరాలు సమర్పించవచ్చు.

తొలిదశ ఎక్కడ ప్రారంభమైందంటే..

మొదటి దశ అయిన 'ఇళ్ల జాబితా, గృహ గణన' (Houselisting and Housing Census - HLO) కోసం 15 రోజుల సెల్ఫ్-ఎన్యూమరేషన్ సదుపాయం ప్రస్తుతం అండమాన్ అండ్ నికోబార్ దీవులు, గోవా, కర్ణాటక, లక్షద్వీప్, మిజోరాం, ఒడిశా, సిక్కిం, NDMC ప్రాంతం, ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అందుబాటులో ఉంది. ఈ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏప్రిల్ 16 నుంచి మే 15, 2026 వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తారు. ఆలోపే ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

తెలంగాణలో ఎప్పటినుంచంటే?

తెలంగాణలో 'స్వయం-గణన' (Self-Enumeration) ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ 26 ఏప్రిల్ 2026 న ప్రారంభమై, 10 మే 2026 వరకు అందుబాటులో ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే తెలంగాణ వాసులు పోర్టల్‌ను సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు లాగిన్ అయితే 'ఇంకా ప్రారంభం కాలేదు' అని చూపిస్తుంది.

Census 2027 Complete Self-Enumeration From Home Check Telangana Dates and Steps

ఆన్‌లైన్‌లో వివరాలు ఎలా నమోదు చేయాలి? (సింపుల్ స్టెప్స్)

ఆన్‌లైన్ ద్వారా జనాభా లెక్కల నమోదు ప్రక్రియ చాలా సులభం. కేవలం ఈ కింది స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది:

అధికారిక పోర్టల్ ఓపెన్ చేయండి: ముందుగా కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ http://se.census.gov.in ను సందర్శించండి.

లాగిన్ (Login): మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి.

లొకేషన్ మార్కింగ్: మ్యాప్‌లో మీ ఇంటి కచ్చితమైన లొకేషన్‌ను మార్క్ చేయండి.

కుటుంబ వివరాలు (Details): మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయండి.

సబ్మిట్ (Submit): వివరాలన్నీ ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ బటన్ నొక్కండి.

ఐడీ రాక (SE ID): ప్రక్రియ పూర్తి కాగానే మీకు ఒక యూనిక్ సెల్ఫ్-ఎన్యూమరేషన్ ఐడీ (SE ID) వస్తుంది.

ఎన్యుమరేటర్‌కు చెప్పండి: భవిష్యత్తులో సర్వే కోసం మీ ఇంటికి ఎన్యుమరేటర్ వచ్చినప్పుడు, మీరు ఆన్‌లైన్‌లో పొందిన ఈ SE ID ని వారితో పంచుకుంటే సరిపోతుంది. మళ్లీ వివరాలు చెప్పాల్సిన పనిలేదు.

మీ సమాచార భద్రత కోసం కేవలం ప్రభుత్వం సూచించిన http://se.census.gov.in అనే అధికారిక లింక్‌ను మాత్రమే ఉపయోగించండి. నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోకండి. దేశ నిర్మాణంలో జరిగే ఈ అతిపెద్ద ప్రక్రియలో భాగస్వాములు కండి.

Advertisement
Advertisement