త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Cabinet | కేంద్ర‌ మంత్రులు, విదేశీ అతిథుల కోసం రూ.1,102 కోట్లు..!

Union Cabinet | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి దేశ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇది ఆమె వరుసగా తొమ్మిదో బడ్జెట్ కావడం విశేషం. ఈ బడ్జెట్‌లో మంత్రుల జీతాలు, అతిథులకు ఆతిథ్యం, మాజీ గవర్నర్లకు సంబంధించిన ఖర్చుల కోసం మొత్తం రూ.1,102 కోట్లు కేటాయించారు. గత ఏడాది సవరించిన అంచనాలైన రూ.978.20 కోట్లతో పోలిస్తే ఎక్కువ‌.

P

National | Published On Feb 1, 2026, 4.02 pm IST

Union Cabinet | కేంద్ర‌ మంత్రులు, విదేశీ అతిథుల కోసం రూ.1,102 కోట్లు..!
Advertisement

Union Cabinet | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి దేశ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇది ఆమె వరుసగా తొమ్మిదో బడ్జెట్ కావడం విశేషం. ఈ బడ్జెట్‌లో మంత్రుల జీతాలు, అతిథులకు ఆతిథ్యం, మాజీ గవర్నర్లకు సంబంధించిన ఖర్చుల కోసం మొత్తం రూ.1,102 కోట్లు కేటాయించారు. గత ఏడాది సవరించిన అంచనాలైన రూ.978.20 కోట్లతో పోలిస్తే ఎక్కువ‌.

మంత్రుల జీతాలుభత్యాలు, ప్రయాణాలు, పరిపాలనా ఖర్చుల కోసం ఈసారి రూ.620 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఈ మొత్తం రూ.483.54 కోట్లుగా ఉన్న‌ది. ఇందులో కేంద్ర మంత్రులు, స్టేట్‌ మంత్రులు, అలాగే మాజీ ప్రధానమంత్రుల జీతాలు, ప్రయాణ వ్యయాలు కూడా ఉన్నాయి. అదనంగా, వీవీఐపీ ప్రయాణాల కోసం ప్రత్యేక విమానాల నిర్వహణకు కూడా నిధులు కేటాయించారు.

నేష‌న‌ల్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎన్‌ఎస్‌సీ) 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.256.19 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఇది రూ.279.74 కోట్లుగా ఉంది. ఈ నిధులను జాతీయ భద్రతా మండలి పరిపాలనా ఖర్చులు, అంతరిక్ష కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ప్రధాని కార్యాలయానికి (పీఎంఓ) ఈసారి రూ.73.52 కోట్లు కేటాయించారు. గత ఏడాది కేటాయించిన రూ.68 కోట్లతో పోలిస్తే ఈ సారి బ‌డ్జెట్ పెరిగింది. పీఎంఓ పరిపాలనా వ్యయాల కోసం ఈ నిధులు ఉపయోగించనున్నారు.

అతిథుల ఆతిథ్యం, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ కోసం 57.6 మిలియన్లు కేటాయించారు. ఇందులో రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమాలు, జాతీయ దినోత్సవ వేడుకలు, విదేశీ అతిథుల స్వాగ‌తం కోసం ఈ నిధుల‌ను వినియోగిస్తారు. గత ఏడాది కేటాయించిన 62 మిలియన్లతో పోలిస్తే.. ఈ సారి బ‌డ్జెట్ స్వ‌ల్పంగా త‌గ్గింది. మాజీ గవర్నర్లకు కార్యదర్శి సహాయం కోసం రూ.15.3 మిలియన్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.14 మిలియన్లుగా ఉంది.

కేబినెట్ సెక్రటేరియట్‌కు 2026–27లో 80 మిలియన్లు కేటాయించారు. గత ఏడాది ఇది 78 మిలియన్లు కేటాయించారు. ఈ నిధులను కేబినెట్ సెక్రటేరియట్ పరిపాలనా ఖర్చులు, రసాయన ఆయుధాల వ్యాప్తి నిరోధక కన్వెన్షన్ (NACWC)కు సంబంధించిన వ్యయాల కోసం వెచ్చించ‌నున్నారు.

Advertisement
Advertisement