BJP | బెంగాల్‌లో కమలం పార్టీకి షాక్.. టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే
BJP | పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీకి (BJP) భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే బిష్ణు ప్రసాద్ శర్మ (Bishnu Prasad Sharma) ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో (TMC) చేరారు.
BJP | త్రినేత్ర.న్యూస్: పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీకి (BJP) భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే బిష్ణు ప్రసాద్ శర్మ (Bishnu Prasad Sharma) ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో (TMC) చేరారు. కేంద్రంలో తమ పార్టీ ప్రభుత్వం గూర్ఖాల్యాండ్ (Gorkhaland) రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేకపోవడంతో గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఆయన టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మరో రెండు నెలల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా ఓ ఎమ్మెల్యే పార్టీని వీడటం బీజేపీకి ఇబ్బందిగా మారనుంది.
2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కుర్సియాంగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై శర్మ విజయం సాధించారు. అయితే గూర్ఖాలాండ్ ఏర్పాటు విషయంలో పార్టీ వ్యవరిస్తున్న తీరుపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో డార్జిలింగ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే వెంట లేరని బీజేపీ నేత శంకర్ ఘోష్ అన్నారు. కాగా, కుర్సియాంగ్ ఓటర్ల మనోభీష్టానికి వ్యతిరేకంగా పనిచేయదల్చుకోలేదని, తాను ఇప్పుడు స్వేచ్ఛాజీవినని బిష్ణు ప్రసాద్ చెప్పారు. ఎవరేం అనుకున్నా భయపడేదే లేదని స్పష్టం చేశారు.
ఏప్రిల్-మేలో బెంగాల్ ఎన్నికలు
294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్ , మే నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మే 7తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుంది. 2021లో మార్చి-ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో 294 స్థానాలకుగాను సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 215 స్థానాతో తిరుగులేని విజయం దక్కించుకున్నది.
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



