Bank Employee | బ్యాంకులో భారీ మోసం.. కస్టమర్లకు చెందిన 2 కిలోల బంగారాన్ని మాయం చేసిన ఉద్యోగి
Bank Employee | కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ బ్యాంకు మోసం (Bank Fraud) బయటపడింది. బ్యాంకులో పనిచేసే (Bank Employee) అసిస్టెంట్ మేనేజర్ ఖాతాదారులు బంగారాన్ని మాయం చేశాడు.
Bank Employee | కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ బ్యాంకు మోసం (Bank Fraud) బయటపడింది. బ్యాంకులో పనిచేసే (Bank Employee) అసిస్టెంట్ మేనేజర్ ఖాతాదారుల బంగారాన్ని మాయం చేశాడు. లాకర్లలో ఉన్న దాదాపు 2.7 కిలోల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. ఈ మోసం ఇండియన్ బ్యాంకులో బయటపడింది.
ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న 34 ఏళ్ల కిరణ్ కుమార్ గత కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్, జూదానికి (Gambling) బానిసయ్యాడు. వాటి కోసం డబ్బు అవసరమవడంతో ఏకంగా బ్యాంకుకే కన్నం వేశాడు. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారంపై కన్నేశాడు. లాకర్‌లోని సుమారు 2.7 కిలోల బంగారాన్ని మాయం చేసి (employee steals 2.7 kg of gold from locker).. వాటిని ఇతర బ్యాంకుల్లో తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు. దాదాపు రూ. 4 కోట్ల మేర మోసానికి పాల్పడ్డాడు.
ఈనెల 2న ఓ మహిళా కస్టమర్ డబ్బు చెల్లించి తన బంగారాన్ని విడిపించుకునేందుకు బ్యాంకుకు వచ్చింది. ప్రొసీజర్ మొత్తం పూర్తి చేసిన మహిళకు అధికారులు నగల ప్యాకెట్‌ను ఇచ్చారు. అది తెరిచి చూసిన ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. అందులో ఉండాల్సిన నగలు మాయమయ్యాయి. ఈ విషయంపై ఆమె బ్యాంకు అధికారులను నిలదీసింది. దీంతో ఈ బంగారం మాయం వ్యవహారం గుట్టురట్టైంది. అప్రమత్తమైన అధికారులు బ్యాంకులో అంతర్గత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు రూ. 4 కోట్ల విలువైన 2,783 గ్రాముల బంగారం మాయమైనట్లు తేలింది.
మొత్తం 24 ప్యాకెట్లలో బంగారం మాయమవ్వగా, అందులో 21 ప్యాకెట్లు పాక్షికంగా, 3 ప్యాకెట్లు పూర్తిగా ఖాళీ అయినట్లు తేలింది. దీంతో బ్యాంకు మేనేజర్ వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అధికారుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాంకులోని ఉద్యోగులందరినీ విచారించగా.. కిరణ్ కుమార్‌పై వారికి అనుమానం వచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని తమ స్టైల్‌లో విచారించగా.. అసలు విషయం బయటపడింది. విచారణలో కిరణ్ నేరాన్ని అంగీకరించాడు. ఇప్పటివరకు పోలీసులు సుమారు 1.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బంగారాన్ని రికవరీ చేసేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్





