దేశవ్యాప్తంగా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న విషయం ఏంటి అని అడిగితే ఇండిగో విమానాల రద్దు అనే చెప్తారు. ఇవాళ కాదు నిన్న కాదు గత మూడు నాలుగు రోజుల నుంచి ఇండిగో విమానాల పరిస్థితి ఇదే. అయితే రద్దు చేయడం లేదంటే గంటలకు గంటలు విమానాలు ఆలస్యం కావడం. ఒక్క హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కాదు.. దేశంలో ఉన్న అన్ని ఎయిర్ పోర్టులలో ఇదే పరిస్థితి. కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా ఇండిగో విమానాలు ఆలస్యం కావడంతో కేరళలోని శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప స్వాములు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. “మేము 41 రోజులు కఠిన దీక్ష చేశాం. రాత్రి, పగలు అని తేడా లేకుండా దీక్ష చేస్తే ఇండిగో స్టాఫ్ మాకు కనీసం వాటర్ కూడా ఇవ్వడం లేదు. మాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి. అసలు సమస్య ఏంటో? విమానాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో? ఎందుకు రద్దు అవుతున్నాయో? చెప్పే నాథుడే లేడు ఇక్కడ. హైదరాబాద్ నుంచి కొచ్చికి టికెట్ తీసుకుంటే.. మధ్యలో బెంగళూరులో వదిలేశారు. కనెక్టింగ్ ఫ్లయిట్ అని చెప్పారు. తీరా చూస్తే విమానం ఆలస్యం అంటున్నారు. ఇంకా ఎన్ని గంటలు వెయిట్ చేయాలి.. విమానం గురించి అడిగితే చెప్పే నాథుడే లేడు..” అంటూ ఓ అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తుడు వాపోయాడు. #WATCH | Bengaluru, Karnataka: A large number of passengers are inconvenienced across the country, as IndiGo flights are facing delays and cancellations. A passenger says, "...The IndiGo staff did not provide any dinner, water bottles, or any facilities. As per the Ayyappa… pic.twitter.com/m0lhFX46Wa — ANI (@ANI) December 5, 2025