Nadendla Bhaskara Rao | ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత
Nadendla Bhaskara Rao | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (Nadendla Bhaskara Rao) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయో సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
Nadendla Bhaskara Rao | త్రినేత్ర.న్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (Nadendla Bhaskara Rao) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయో సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు, మిత్రులు మరియు అభిమానులు అంతిమ నివాళులు అర్పించుకోవడానికి వీలుగా, ఆయన పార్థివ దేహాన్ని జూబిలీహిల్స్‌లోని స్వగృహానికి తరలించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
1935 జూన్ 23న గుంటూరు జిల్లా, మద్రాస్ ప్రెసిడెన్సీ (బ్రిటిష్ ఇండియా)లో నాదెండ్ల భాస్కర్‌రావు జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో లా డిగ్రీ పూర్తిచేశారు. 1978లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తొలిసారి ఎన్నికయ్యారు. చెన్నారెడ్డి హయాంలో మంత్రిగా పని చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాకుల్లో ఒకరు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కేబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే 1984లో ఎన్టీఆర్ అమెరికాలో చికిత్స పొందుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో తిరుగుబాటు చేసి.. ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవడంతో.. ఆంధ్రప్రదేశ్ 11వ సీఎంగా 31 రోజులపాటే పని చేశారు. అనంతరం టీడీపీ నుంచి బహిష్కరించడంతో కాంగ్రెస్‌లో చేరారు. 12వ లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా విజయం సాధించారు. 2019లో బీజేపీ కండువా కప్పుకున్నారు.
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



