త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vande Bharat | వందే భార‌త్ రైలులో ఫుడ్ తిన్న మ‌హిళ‌కు అల‌ర్జీ.. పూర్తి వివ‌రాలు కోరిన ఐఆర్‌సీటీసీ..!

Vande Bharat | భార‌తీయ రైల్వే ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన ప్రీమియం రైళ్లు వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్‌లో భోజ‌నం నాణ్య‌త‌పై గ‌త కొంత‌కాలంగా ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ప్ర‌యాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వ‌స్తుండ‌డం స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది.

P

National | Published On Apr 1, 2026, 5.33 pm IST

Vande Bharat | వందే భార‌త్ రైలులో ఫుడ్ తిన్న మ‌హిళ‌కు అల‌ర్జీ.. పూర్తి వివ‌రాలు కోరిన ఐఆర్‌సీటీసీ..!
Advertisement

Vande Bharat | భార‌తీయ రైల్వే ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన ప్రీమియం రైళ్లు వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్‌లో భోజ‌నం నాణ్య‌త‌పై గ‌త కొంత‌కాలంగా ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ప్ర‌యాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వ‌స్తుండ‌డం స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. తాజాగా రైల్లో అందించిన భోజ‌నం తిన్న త‌ర్వాత ఓ మ‌హిళ‌కు తీవ్ర‌మైన అల‌ర్జీ రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ఘ‌ట‌న మార్చి 27న చోటు చేసుకుంది. రాంచీకి చెందిన ఆయుషి సింగ్ అనే మ‌హిళ వార‌ణాసి నుంచి దేవ‌ఘ‌ర్‌కు 22500 నంబ‌రు గ‌ల వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్‌లో ప్ర‌యాణించింది. ఆమె ఈ1 కోచ్‌లో త‌న రెండేళ్ల కుమారుడితో క‌లిసి ప్ర‌యాణం చేసింది. రైలులో ఐఆర్‌సీటీసీ అందించిన భోజ‌నం తిన్న కొద్దిసేప‌టికి ఆమె పై పెద‌వి వాపురావ‌డం మొద‌లైంది. అనంత‌రం శ‌రీర‌మంతా అల‌ర్జీ ల‌క్ష‌ణాలు క‌నిపించాయ‌ని ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపింది. ప‌రిస్థితి విష‌మించ‌డంతో త‌క్ష‌ణ వైద్య స‌హాయం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని పేర్కొంది.

భోజ‌నం తిన్న రెండేళ్ల కుమారుడికి విరేచ‌నాలు సైతం వ‌చ్చిన‌ట్లు స‌ద‌రు మ‌హిళా ప్ర‌యాణికురాలు వాపోయింది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన ఫొటోలు, మెడిక‌ల్ రిపోర్టుల‌ను ఆమె ‘ఎక్స్’లో షేర్ చేసింది. వందే భారత్ రైలులో చేసిన భోజ‌నం కార‌ణంగా త‌న‌కు ఈ ప‌రిస్థితి ఎదురైంద‌ని తెలిపింది. మెడిక‌ల్ రిపోర్టులోనూ భోజనం కార‌ణంగా అల‌ర్జీకి కార‌ణంగా తెలిసింది. అయితే, ఈ వ్యవహారంపై ఐఆర్‌సీటీసీ స్పందించింది. ఆ రోజు 22500 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని ఈ1 కోచ్‌లో అందించిన భోజనాన్ని పరిశీలించినట్లు తెలిపింది. పరిశీలనలో ఆహార నాణ్యత సంతృప్తికరంగానే ఉందని పేర్కొంది. ఇతర ప్రయాణికుల నుంచి ఇలాంటి ఫిర్యాదులు ఏవీ రాలేదని వెల్లడించింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఐఆర్‌సీటీసీ, సంబంధిత మహిళను డైరెక్ట్ మెసేజ్ ద్వారా పూర్తి వివరాలు అందించాలని కోరింది. ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చింది.

Advertisement
Advertisement