Air India | తనిఖీల పేరుతో మహిళను బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి గబ్బుపని..!
Air India | బెంగళూరులో కెంపెగౌడ విమానాశ్రయంలో దక్షిణ కొరియా మహిళను వేధించిన కేసులో ఎయిర్ ఇండియా గ్రౌండ్ స్టాఫ్ సభ్యుడిని అరెస్టు చేశారు. 32 సంవత్సరాల దక్షిణకొరియా వ్యాపారవేత్త నిందితుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.
- దక్షిణ కొరియా మహిళను వేధించిన ఎయిర్ ఇండియా ఉద్యోగి అరెస్ట్..!
Air India | బెంగళూరులో కెంపెగౌడ విమానాశ్రయంలో దక్షిణ కొరియా మహిళను వేధించిన కేసులో ఎయిర్ ఇండియా గ్రౌండ్ స్టాఫ్ సభ్యుడిని అరెస్టు చేశారు. 32 సంవత్సరాల దక్షిణకొరియా వ్యాపారవేత్త నిందితుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. నిందితుడు తనను అనుచితంగా తాకాడని, తనిఖీ పేరుతో తనను కౌగిలించుకున్నాడని మహిళ ఫిర్యాదులో ఆరోపించింది. తాను గతేడాది నవంబర్‌లో టూరిస్ట్ వీసాపూ భారత్‌కు వచ్చానని.. సోమవారం తిరిగి వెళ్తున్నట్లు బాధితురాలు పేర్కొంది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 2 వద్ద సీఐఎస్ఎఫ్ తనిఖీలు, ఇమ్మిగ్రేషన్ అయ్యాక ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చాడని.. తాను ఎయిర్‌పోర్ట్ ఉద్యోగిగా పని చేసుకొని బోర్డింగ్ పాస్‌ను పరిశీలించాడని తెలిపింది.
చెక్ ఇన్ బ్యాగేజీలో సమస్య ఉందని.. మళ్లీ తనిఖీ చేయాల్సి ఉంటుందని ఆమెకు చెప్పాడు. బాధితురాలిని తనిఖీ చేసేందుకు తనను పురుషుల వాష్‌రూమ్ వద్దకు తీసుకెళ్లాడని.. మాన్యువల్ తనిఖీ ముగుసులో చాలాసార్లు అనుచితంగా తాకాడని, ప్రైవేటు భాగాలని తాకాడని ఆరోపించింది. ఇదేంటని ప్రశ్నిస్తే కౌగిలించుకొని కృతజ్ఞతలు చెప్పి వదిలేశాడని తెలిపింది. దీనిపై విమానాశ్రయం అధికారులకు ఫిర్యాదు చేయగా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఎయిర్ ఇండియా గ్రౌండ్ స్టాఫ్ సభ్యుడు అహ్మద్ అఫాన్ అహ్మద్ (25)ను అరెస్టు చేశాడు. వాస్తవానికి నిందితుడికి తనిఖీలు చేసే అధికారం లేదని.. అనుమానం ఉంటే ఇమ్మిగ్రేషన్, సీఐఎస్ఎఫ్ సిబ్బందికి మాత్రమే సమాచారం ఇచ్చి ఉండొవచ్చని, లేదంటే మహిళా సిబ్బందితో తనిఖీలు చేయించవచ్చని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. సదరు మహిళ ఆరోపణలను నిజమేనని తేలింది. దాంతో నిందితుడిని అరెస్టు చేశారు.
తాజావార్తలు
- ●Harish Rao | రేవంత్.. పాలిటెక్నిక్ పిల్లలను కలిస్తే నీకేం నొప్పి.. వాళ్లేమైనా టెర్రరిస్టులా?
- ●Sara Arjun | మౌనరాగం సీరియల్ డైరెక్టర్‌తో ధురంధర్ హీరోయిన్ తెలుగు మూవీ
- ●Crime News | భర్త సిగరెట్ తాగొస్తానని వెళ్లాడు.. ఎంతకీ తిరిగి రాకపోయేసరికి భార్య!
- ●Sai Pallavi | సాయిపల్లవి రిజెక్ట్ చేసిన మలయాళ సినిమాతో హిట్టు కొట్టిన మమితా బైజు
- ●Niranjan Reddy | కాంగ్రెస్ మోసాలతో అన్ని వర్గాలూ నష్టపోయాయి
- ●Mallikarjun Kharge | డీలిమిటేషన్‌పై చర్చించేందుకు ఆల్‌పార్టీ మీటింగ్ పెట్టండి.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ

Harish Rao | రేవంత్.. పాలిటెక్నిక్ పిల్లలను కలిస్తే నీకేం నొప్పి.. వాళ్లేమైనా టెర్రరిస్టులా?

Sara Arjun | మౌనరాగం సీరియల్ డైరెక్టర్‌తో ధురంధర్ హీరోయిన్ తెలుగు మూవీ

Crime News | భర్త సిగరెట్ తాగొస్తానని వెళ్లాడు.. ఎంతకీ తిరిగి రాకపోయేసరికి భార్య!

Sai Pallavi | సాయిపల్లవి రిజెక్ట్ చేసిన మలయాళ సినిమాతో హిట్టు కొట్టిన మమితా బైజు




