TN Polls | మేనిఫెస్టో విడుదల చేసి అన్నాడీఎంకే.. పురుషులకు బస్ ఫ్రీ, మహిళలకు స్కూటర్లు..!
TN Polls | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష అన్నాడీఎంకే (AIADMK) పార్టీ మంగళవారం మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా మహిళలు, మధ్యతరగతి వర్గం, పేద ప్రజలపై వరాలు కురిపించింది. ఉచిత ఫ్రిజ్, ఆర్థిక సాయం, రేషన్ సహా పలు హామీలు ఇచ్చింది.
TN Polls | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష అన్నాడీఎంకే (AIADMK) పార్టీ మంగళవారం మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా మహిళలు, మధ్యతరగతి వర్గం, పేద ప్రజలపై వరాలు కురిపించింది. ఉచిత ఫ్రిజ్, ఆర్థిక సాయం, రేషన్ సహా పలు హామీలు ఇచ్చింది. ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ ఎడప్పాడి పళనిస్వామి మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 297 హామీలు ఉన్నాయని, ప్రతివర్గం సూచనలను పరిగణలోకి తీసుకొని మేనిఫెస్టోను రూపొందించామన్నారు.
ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలకు ఉపశమనం కల్పించడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రతి కుటుంబానికి పన్నులు, ధరల పెరుగుదల భారాన్ని తగ్గించేందుకు రూ.10వేల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో అన్నా డీఎంకే మహిళలపై వరాలు కురిపించింది. ఫ్రిజ్‌లు అందించడంతో పాటు ఆర్థిక సాయం, సబ్సిడీపై స్కూటర్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దాంతో పాటు నెలనెలా ఇచ్చే రేషన్ సరుకుల్లో పప్పు, నూనెను అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వృద్ధులకు పెన్షన్ తదితర హామీలు ఇచ్చి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నం చేసింది.
అన్నా డీఎంకే కీలక హామీలు
- ప్రతి కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సహాయం
- మహిళలకు నెలకు రూ.2వేల ఆర్థిక సాయం
- ప్రతి సంవత్సరం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు
- రేషన్ కార్డు ఉన్న ఇంటిపెద్ద అయిన మహిళకు ఉచితంగా రిఫ్రిజిరేటర్
- బియ్యంతో పాటు నెలకు కేజీ పప్పు, లీటర్ వంటనూనె ఫ్రీ
- వర్కింగ్ వుమెన్స్‌కు రూ.25వేల సబ్సిడీతో అమ్మ స్కూటర్
- నగరాల్లో పురుషులకు ఉచిత బస్ ప్రయాణం
- వృద్ధుల పెన్షన్ రూ.2వేలకు పెంపు
- ఇండ్లులేని పేద కుటుంబాలకు పక్కా ఇండ్లు
- నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ.2వేల భత్యం
- యువత వ్యాపారాలు చేసేందుకు రూ.25లక్షల వరకు రుణ సహాయం
- ఉద్యోగాల్లో తమిళులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు చట్టం
- గ్రామీణ ఉపాధి పథకాన్ని 150 రోజులుగా పొడగించేందుకు హామీ
- పదేళ్లుగా పని చేస్తున్న నర్స్‌లను క్రమబద్దీకరించడం
- మద్యం షాపులను క్రమంగా మూసివేయడం
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






