పశ్చిమ బెంగాల్‌లో ఎస్ఐఆర్.. 58 లక్షల ఓట్లు తొలగింపు.. కారణాలివే
ఈ డ్రాఫ్ట్ జాబితాపై అభ్యంతరాలు తెలపడానికి ఓటర్లకు, రాజకీయ పార్టీలకు జనవరి 15, 2026 వరకు ఎన్నికల కమిషన్ గడువు ఇచ్చింది. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 7 వ తేదీ వరకు అభ్యంతరాల పరిశీలన ఉంటుంది. తుది ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 14, 2026న విడుదల చేస్తారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఎన్నికల కమిషన్ చాలెంజింగ్‌గా తీసుకుంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ఆ రాష్ట్ర ప్రభుత్వమే మండిపడుతోంది. కావాలని రాష్ట్రంలో ఉన్న ఓటర్లను తీసేయడానికి కేంద్రం కుట్ర పన్నుతోందని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో శరణార్ధులుగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడే సెటిల్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. బెంగాల్‌లోనే అన్ని రకాల ఐడీ కార్డులు తీసుకొని ఓట్లు కూడా వేస్తున్నారు. కొందరు అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. వీళ్లందరినీ తిరిగి బంగ్లాదేశ్ పంపించేందుకు, వాళ్ల ఓట్లను తీసేందుకే కేంద్రం, ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్‌ను తీసుకొచ్చాయి. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఓటర్ల జాబితాతో కూడిన ముసాయిదాను తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసింది. అందులో ఓటర్ల జాబితా నుంచి 58 లక్షల మందికి పైగా పేర్లను తొలగించినట్లు ఈసీ ప్రకటించింది.
ఎందుకు తొలగించారు?
మొత్తం తొలగించిన ఓటర్లు 58,20,898. అందులో సుమారు 24 లక్షల మంది ఓటర్లు మరణించినట్లు ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. మరికొందరివి చిరునామాలు మారడం, కొందరివి నకిలీ నోట్లు ఉండటం, ఇంకొందరి ఆచూకీ లేకపోవడం వల్ల అన్నీ కలిపి 58,20,898 ఓట్లను ఎన్నికల సంఘం డిలీట్ చేసింది.
మరణించిన వారు: 24,16,852 మంది
శాశ్వతంగా వలస వెళ్లిన వారు: 19,88,076 మంది
ఆచూకీ లేని వారు: 12,20,038 మంది
డూప్లికేట్ (నకిలీ) ఓట్లు: 1,38,328 మంది
ఇతర కారణాలు: 57,604 మంది
అభ్యంతరాలకు జనవరి 15 వరకు గడువు
ఈ డ్రాఫ్ట్ జాబితాపై అభ్యంతరాలు తెలపడానికి ఓటర్లకు, రాజకీయ పార్టీలకు జనవరి 15, 2026 వరకు ఎన్నికల కమిషన్ గడువు ఇచ్చింది. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 7 వ తేదీ వరకు అభ్యంతరాల పరిశీలన ఉంటుంది. తుది ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 14, 2026న విడుదల చేస్తారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






