Kerala Fishermen | కేరళలో 469 మంది జాలర్లు మృతి
Kerala Fishermen | కేరళలో చోటు చేసుకున్న సముద్ర ప్రమాదాలు వందలాది మంది జాలర్ల కుటుంబాల్లో చీకట్లు నింపాయి. గత 11 ఏళ్లలో జరిగిన ప్రమాదాల కారణంగా 469 మంది జాలర్లు చనిపోయినట్లు కేరళ మత్స్యశాఖ మంత్రిత్వ కార్యాలయం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
Kerala Fishermen | త్రినేత్ర.న్యూస్ : కేరళలో చోటు చేసుకున్న సముద్ర ప్రమాదాలు వందలాది మంది జాలర్ల కుటుంబాల్లో చీకట్లు నింపాయి. గత 11 ఏళ్లలో జరిగిన ప్రమాదాల కారణంగా 469 మంది జాలర్లు చనిపోయినట్లు కేరళ మత్స్యశాఖ మంత్రిత్వ కార్యాలయం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇద్దరు మత్స్యకారులు ఇటీవల కాలంలో అదృశ్యం కావడంతో.. జాలర్ల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మత్స్య శాఖ జాలర్ల మృతులకు సంబంధించి కీలక ప్రకటన జారీ చేసింది.
11 ఏళ్లల్లో 469 మంది జాలర్లు మృతి చెందగా, మరో 160 మంది గల్లంతయ్యారని మత్స్యశాఖ మంత్రి వీఈ అబ్దుల్ గఫూర్ కార్యాలయం వెల్లడించింది. కేరళ సముద్ర మత్స్య నియంత్రణ (KMFR) చట్టం అమలులో భాగంగా 2015-16 నుండి 2025-26 వరకు 23,000 పెట్రోలింగ్ ఆపరేషన్లు, 5,072 సముద్ర రక్షణ కార్యకలాపాలు నిర్వహించినట్లు తెలిపింది. ఇక 11 ఏళ్లల్లో 47,773 జాలర్లను రక్షించామని వెల్లడించింది. 2017-18లో అత్యధికంగా 79 మంది జాలర్లు మరణించగా, 2025-26లో 55 మంది, 2023-24లో 54 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మత్స్యశాఖ స్పష్టం చేసింది.
తాజావార్తలు
- ●MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి
- ●Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి
- ●Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ
- ●Corpus | రూ.1 కోటి సంపాదించాలా.. అయితే ముందు రూ.10 లక్షలు దాటండి.. ఎందుకంటే..?
- ●Komatireddy Rajagopal Reddy | ఖర్చెక్కువవుతుంది.. ఇందిరమ్మ ఇళ్లకిచ్చే నిధులు పెంచాలి

MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి

Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి

Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ



