Priyanka Chopra | ఆస్కార్ విన్నింగ్ యాక్టర్‌తో గ్లోబల్ స్టార్ రొమాన్స్ – హాలీవుడ్‌లో జాక్‌పాట్
హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా ఓ బంపరాఫర్ అందుకుంది. ఆస్కార్ విన్నింగ్ హీరో రసెల్ క్రోతో ఓ సినిమా చేయబోతుంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బ్లూఫ్లై అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రియాంక చోప్రా హాలీవుడ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది.
Entertainment | Published On Aug 7, 2026, 3.12 pm IST
Priyanka Chopra | గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో ఓ క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. ఆస్కార్ విన్నర్‌తో కలిసి సినిమా చేయబోతుంది. ఈ సినిమా టైటిల్‌తో పాటు డైరెక్టర్ ఎవరన్నది రివీలైంది. ప్రస్తుతం మహేష్‌బాబుతో వారణాసి సినిమా చేస్తోంది. అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. వారణాసి షూటింగ్‌లో బిజీగా ఉంటూనే హాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన ప్రియాంక జాక్‌పాట్ అందుకుంది.
సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్...
ఆస్కార్ విన్నింగ్ యాక్టర్ రసెల్ క్రో హీరోగా బ్లూఫ్లై పేరుతో ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ప్రెడెటర్ ఫేమ్ నిమ్రోద్ అంటల్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లూ ఫ్లై సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా గ్లోబల్ స్టార్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
హయ్యెస్ట్ బడ్జెట్...
ప్రియాంక చోప్రా హాలీవుడ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో గ్లోబల్ స్టార్ పాత్ర యాక్షన్ ప్రధానంగా సాగబోతున్నట్లు సమాచారం. స్పెషల్ కమాండోగా ప్రియాంక చోప్రాపై వచ్చే యాక్షన్ సీన్లు సినిమాకు హైలైట్‌గా ఉంటాయని అంటున్నారు. బీస్ట్, అండర్‌వాటర్ లాంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్లు బ్లూఫ్లై సినిమాలో భాగమయ్యారు.
సీక్రెట్ మిషన్...
కాంగోలో కూలిపోయిన విమానం జాడ కనిపెట్టే సీక్రెట్ మిషన్‌లో అనుకోకుండా ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసే వ్యక్తి భాగమవుతాడు. టెర్రరిస్ట్‌ల ఆధీనంలో ఉన్న దట్టమైన అడవిలో ఆ విమానం కూలిపోయిందని కనిపెడతారు. అక్కడికి చేరుకునే క్రమంలో స్పెషల్ టీమ్‌కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ మిషన్ లక్ష్యమేమిటి అనే అంశాలతో బ్లూఫ్లై మూవీ తెరకెక్కుతోంది.
గ్లాడియేటర్...
2000 ఏడాదిలో రిలీజైన గ్లాడియేటర్ సినిమాకుగాను బెస్ట్ యాక్టర్‌గా ఆస్కార్ అవార్డును అందుకున్నారు రసెల్ క్రో. ఏ బ్యూటీఫుల్ మైండ్, ది ఇన్‌సైడర్, ఎల్ఏ కాన్ఫిడెన్షియల్ సినిమాలకుగాను ఆస్కార్‌కు నామినేట్ అయ్యాడు.
వారణాసిలో...
మహేష్‌బాబు వారణాసితో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇండియన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది ప్రియాంక చోప్రా. ఇందులో మందాకిని అనే పాత్రలో కనిపించబోతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వారణాసి షూటింగ్ జరుగుతోంది. ప్రియాంక చోప్రాపై ఓ సోలో సాంగ్‌ను డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తోన్నట్లు సమాచారం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Shruthi Haasan | హాలీవుడ్ సినిమాలో శృతి హసన్ – సమంత ఛాన్స్ కొట్టేసిన కమల్ తనయ
సెప్టెంబర్ 19, 2026

Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?
ఆగస్టు 25, 2026

Varanasi Movie | యాభై భాషల్లో మహేష్‌బాబు వారణాసి రిలీజ్ – రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్
ఆగస్టు 23, 2026
తాజావార్తలు
- ●Brahmotsavam 2026 | సూర్యప్రభ నుంచి చంద్రప్రభ దాకా.. తిరుమలలో వెల్లివిరిసిన భక్తి వైభవం
- ●TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంతకీ ఏం చెప్పిందో తెలుసా.?
- ●Brahmotsavam 2026 | చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడిగా మలయప్పస్వామి
- ●Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు
- ●Preity Mukhundhan | హిట్ డైరెక్టర్‌తో కోలీవుడ్ హీరోయిన్ తెలుగు రొమాంటిక్ మూవీ - రిలీజ్ డేట్ కన్ఫామ్
- ●Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Brahmotsavam 2026 | సూర్యప్రభ నుంచి చంద్రప్రభ దాకా.. తిరుమలలో వెల్లివిరిసిన భక్తి వైభవం

TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంతకీ ఏం చెప్పిందో తెలుసా.?

Brahmotsavam 2026 | చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడిగా మలయప్పస్వామి

Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు



