త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Municipal Elections | బాన్సువాడ‌లో కాంగ్రెస్‌కు కానిస్టేబుల్ ప్ర‌చారం.. మోత్కూర్‌లో ఓటేసిన‌ వందేండ్ల వృద్ధురాలు

Municipal Elections | స్వ‌ల్ప ఉద్రిక్త‌త‌ల న‌డుమ మున్సిప‌ల్ ఎన్నిక‌ల (Municipal Elections) పోలింగ్ కొన‌సాగుతున్న‌ది. ప‌లుచోట్ల కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, బీజేపీ, ఎంఐఎం కార్య‌క‌ర్త‌లు వాగ్వాదానికి దిగారు.

G

Telangana | Published On Feb 11, 2026, 12.05 pm IST

Municipal Elections | బాన్సువాడ‌లో కాంగ్రెస్‌కు కానిస్టేబుల్ ప్ర‌చారం.. మోత్కూర్‌లో ఓటేసిన‌ వందేండ్ల వృద్ధురాలు
Advertisement

Municipal Elections | త్రినేత్ర‌.న్యూస్‌: స్వ‌ల్ప ఉద్రిక్త‌త‌ల న‌డుమ మున్సిప‌ల్ ఎన్నిక‌ల (Municipal Elections) పోలింగ్ కొన‌సాగుతున్న‌ది. ప‌లుచోట్ల కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, బీజేపీ, ఎంఐఎం కార్య‌క‌ర్త‌లు వాగ్వాదానికి దిగారు. మ‌హ‌బూబాబాద్ 14వ వార్డులో కాంగ్రెస్ అభ్య‌ర్థిపై బీఆర్ఎస్ క్యాండిడేట్ చేయిచేసుకోగా, మెద‌క్ జిల్లా న‌ర్సాపూర్‌లో బీఆర్ఎస్‌, బీజేపీ కార్యాక‌ర్త‌లు అంగీలు చినిగేలా కొట్టుకున్నారు.

మ‌రోవైపు బాన్సువాడ‌లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓ కానిస్టేబుల్ ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్‌, బీజేపీ కార్య‌క్త‌ర‌లు అభ్య‌ర్థులు ఆందోళ‌న‌కు దిగారు. దీంతో మున్సిపాలిటీలోని 9 వార్డు పోలింగ్ కేంద్రం వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొన్న‌ది. కానిస్టేబుల్‌ను ఇరు పార్టీల అభ్య‌ర్థులు నిల‌య‌డంతో వాగ్వాదం చోటుచేసుకున్న‌ది. పోలీసుల జోక్యంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది.

ఇక యాదాద్రి జిల్లా మోత్కూర్‌లో వందేండ్ల వృద్ధురాలు ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. మోత్కూరు 9వ వార్డు 20వ పోలింగ్ కేంద్రంలో రంగ‌మ్మ అనే 100 ఏండ్ల వ‌య‌స్సు ఉన్న మ‌హిళ ఓటు వేశారు. దీంతో ఆమె యువత‌కు ఆద‌ర్శంగా నిలిచారు. కాగా, కొడంగల్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేశారు.

Advertisement
Advertisement