త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Fire | ఘోర అగ్నిప్ర‌మాదం.. భార్య‌భ‌ర్త‌లు స‌హా రెండేళ్ల చిన్నారి మృతి

Delhi Fire | దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్ర‌మాదం (Delhi Fire) చోటు చేసుకుంది. రోహిణి (Rohini) సెక్టార్‌లోని బుద్ధవిహార్‌ (Budh Vihar) పరిధిలో స్లమ్ ఏరియాలో మంగ‌ళ‌వారం రాత్రి దాటిన త‌ర్వాత‌ పెద్ద ఎత్తున‌ మంటలు చెల‌రేగాయి.

D

National | Published On Apr 15, 2026, 11.31 am IST

Delhi Fire | ఘోర అగ్నిప్ర‌మాదం.. భార్య‌భ‌ర్త‌లు స‌హా రెండేళ్ల చిన్నారి మృతి
Advertisement

Delhi Fire | దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్ర‌మాదం (Delhi Fire) చోటు చేసుకుంది. రోహిణి (Rohini) సెక్టార్‌లోని బుద్ధవిహార్‌ (Budh Vihar) పరిధిలో స్లమ్ ఏరియాలో మంగ‌ళ‌వారం రాత్రి దాటిన త‌ర్వాత‌ పెద్ద ఎత్తున‌ మంటలు చెల‌రేగాయి. ఈ మంట‌ల్లో గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఓ చిన్నారి స‌హా మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

అధికారుల కథనం ప్రకారం.. ప్లాస్టిక్ వ్యర్థాలను (plastic scrap) నిల్వ ఉంచిన 400 గజాల ప్లాట్‌లో ఈ అగ్నిప్రమాదం జ‌రిగింది. దాని చుట్టూ పలు గుడిసెలను నిర్మించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 1.25 గంటల ప్రాంతంలో స్క్రాప్‌‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు తేరుకునేలోపే అక్క‌డున్న గుడెసెల‌కు మంట‌లు అంటుకుని ద‌గ్ధ‌మ‌య్యాయి. ఈ ప్ర‌మాదంలో భార్యాభర్తలు సహా రెండేళ్ల‌ చిన్నారి అగ్నికి ఆహుత‌వ‌డం స్థానికుల‌ను క‌ల‌చివేస్తోంది. ప్ర‌మాద స‌మాచారం తెలియ‌గానే అధికారులు వెంట‌నే అక్క‌డికి చేరుకున్నారు. అయితే, ఆ ప్రాంతం చాలా ఇరుకైనది కావ‌డంతో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు వీలు ప‌డ‌లేదు. అగ్నిమాప‌క సిబ్బంది ఎలాగోలా శ్ర‌మించి మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Also Read..

బీహార్ ముఖ్య‌మంత్రిగా సామ్రాట్ చౌద‌రి ప్ర‌మాణం.. ఆ ప‌ద‌వి చేప‌ట్టిన తొలి నేత‌గా రికార్డు

అండ‌మాన్ స‌ముద్రంలో ప‌డ‌వ బోల్తా.. 250 మంది గ‌ల్లంతు

భారీ లాభాల్లో కొన‌సాగుతున్న స్టాక్ మార్కెట్లు.. అమెరికా-ఇరాన్ చ‌ర్చ‌ల‌పైనే ఆశ‌లు..

Advertisement
Advertisement