త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Upasana | క‌వ‌ల‌ల రాక‌.. డెలివరీ జర్నీకి సంబంధించిన ఎమోష‌న‌ల్ వీడియో షేర్ చేసిన మెగా కోడ‌లు

Upasana | స్టార్ హీరో రామ్‌చ‌ర‌ణ్ (RamCharan), ఉపాస‌న (Upasana) దంప‌తుల‌కు ఇటీవ‌లే క‌వ‌ల పిల్ల‌లు (Twins ) జ‌న్మించిన విష‌యం తెలిసిందే. తన డెలివరీ జర్నీ (Deliver Journey)కి సంబంధించిన ఓ ఎమెష‌న‌ల్ వీడియోని మెగా కోడ‌లు తాజాగా అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు.

D

Movies | Published On Feb 10, 2026, 11.09 am IST

Upasana | క‌వ‌ల‌ల రాక‌.. డెలివరీ జర్నీకి సంబంధించిన ఎమోష‌న‌ల్ వీడియో షేర్ చేసిన మెగా కోడ‌లు
Advertisement

Upasana | స్టార్ హీరో రామ్‌చ‌ర‌ణ్ (RamCharan), ఉపాస‌న (Upasana) దంప‌తుల‌కు ఇటీవ‌లే క‌వ‌ల పిల్ల‌లు (Twins ) జ‌న్మించిన విష‌యం తెలిసిందే. జన‌వ‌రి 31న ఉప్సీ ఓ ఆడపిల్ల‌, ఒక మగ‌ పిల్లాడికి జ‌న్మ‌నిచ్చింది. మొద‌టి కాన్పులో పాప పుట్ట‌గా.. ఇప్పుడు రెండో కాన్పులో మాత్రం ఒక బాబు, ఒక పాప జ‌న్మించారు. దీంతో మెగా ఫ్యామిలీలో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప్ర‌స్తుతం ఉపాస‌న‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఇటీవ‌లే ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. ఈ నేప‌థ్యంలో తన డెలివరీ జర్నీ (Deliver Journey)కి సంబంధించిన ఓ ఎమెష‌న‌ల్ వీడియోని మెగా కోడ‌లు తాజాగా అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు.

డెలివ‌రీకి ముందు అపోలో హాస్పిటల్‌లో ఏర్పాట్లు, వైద్యుల స్పంద‌న‌, చ‌ర‌ణ్‌-ఉపాసన‌ ఆసుప‌త్రికి వెళ్లిన దృశ్యాలు, ట్విన్స్ రాక‌తో కుటుంబ స‌భ్యుల సంతోషం, చిరు ముఖంలో ఆనందం, ఆసుప‌త్రి బ‌య‌ట అభిమానుల సంద‌డి, స్వీట్లు పంచిపెట్టుకోవ‌డం వంటి భావోద్వేగ క్ష‌ణాలకు సంబంధించిన స్పెష‌ల్ ఈడియోను షేర్ చేశారు. ఈ సంద‌ర్భంగా త‌ను, త‌న పిల్ల‌ల కోసం ప్రార్థించిన‌ అపోలో వైద్యులు, మెగా అభిమానుల‌కు ఉప్సీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

చ‌ర‌ణ్‌-ఉప్సీ గురించి వైద్యుల మాట‌లు

ఈ వీడియోలో ఉపాస‌న‌కు డెలివ‌రీ చేసిన వైద్యులు మాట్లాడారు. చ‌ర‌ణ్‌-ఉపాస‌న గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేశారు. తొలి కాన్పు కోసం అడ్మిట్ అయిన గ‌దిలోనే ఈ సారి కూడా ఉపాస‌న అడ్మిట్ అయిన‌ట్లు తెలిపారు. దాన్ని ఓ సెంటిమెంట్‌గా ఫీల్ అయిన‌ట్లు చెప్పుకొచ్చారు. త‌ల్లి, బిడ్డ‌ల ఆరోగ్యం దృష్ట్యా రెండు ప్ర‌త్యేక మెడిక‌ల్ టీమ్స్ ప‌నిచేసిన‌ట్లు వివ‌రించారు. అందులో ఓ టీమ్ హైద‌రాబాద్ అపోలో నుంచి కాగా, మ‌రో టీమ్ చెన్నై అపోలో చిల్ట్ర‌న్స్ హాస్పిట‌ల్ నుంచి వ‌చ్చిన‌ట్లు తెలిపారు. అంతేకాదు, ఉపాస‌న‌పై రామ్ చ‌ర‌ణ్ ఎంతో ప్రేమ‌గా ఉంటాడ‌ని చెప్పారు. ఈ జంట త‌మ పిల్ల‌ల‌తో సంతోషంగా ఉండాల‌ని వైద్యులు ఆకాంక్షించారు.

ఈ వీడియోలో ఓ జ్యోతిష్యుడు కూడా మాట్లాడ‌టం విశేషం. డెలివ‌రీకి అనుకూల‌మైన డేట్, టైమ్ ఆయ‌న చెప్పిన ప్ర‌కార‌మే ఫాలో అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు చ‌ర‌ణ్‌-ఉప్సీ దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. వార‌సుడొచ్చాడు అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

https://x.com/upasanakonidela/status/2020867185166684320

Advertisement

తాజావార్తలు

Advertisement