CP Sajjanar | నకిలీ వైద్యులతో తస్మాత్ జాగ్రత్త.. హెచ్చరించిన హైదరాబాద్ పోలీసులు..!
CP Sajjanar | వైద్యం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు సూచించారు. నగరంలో నకిలీ వైద్యులపై ప్రత్యేక నిఘా పెట్టి ఇప్పటివరకు 12 మందిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
CP Sajjanar | వైద్యం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు సూచించారు. నగరంలో నకిలీ వైద్యులపై ప్రత్యేక నిఘా పెట్టి ఇప్పటివరకు 12 మందిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎలాంటి విద్యార్హతలు, కనీస వైద్య పరిజ్ఞానం లేని కొందరు నకిలీ వైద్యులు అసలైన వైద్యుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. రోగులకు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, బీపీ, మధుమేహం మందులతో పాటు విచక్షణారహితంగా ఇంజెక్షన్లు, సెలైన్లు ఎక్కిస్తూ ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెడుతున్నారని తెలిపారు. అవగాహన లేకుండా రోజుల తరబడి మందులు వాడాలని సూచించడంతో ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా కల్తీ ఆహారంపై ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టామని, అదే తరహాలో నకిలీ వైద్యులపైనా నిఘా, చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
రిజిస్ట్రేషన్ ఉందో చూడాలి
చికిత్స కోసం క్లినిక్, ఆసుపత్రికి వెళ్లే ముందు అక్కడ జిల్లా వైద్యారోగ్య శాఖ (డీఎంహెచ్ఓ) జారీ చేసిన అధికారిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను రిసెప్షన్ వద్ద ప్రముఖంగా ప్రదర్శించారో లేదో పరిశీలించాలని సూచించారు. వైద్యుల బోర్డులపై వారి పేరు, విద్యార్హతలతో పాటు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) కేటాయించిన రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. వైద్యుల అర్హతలపై అనుమానం ఉంటే onlinetsmc.in వెబ్‌సైట్‌లోని ‘Doctor Search’లో వైద్యుడి పేరు, రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి వివరాలను నిర్ధారించుకోవచ్చన్నారు. అక్కడ వివరాలు కనిపించకపోతే వారు నకిలీ వైద్యులుగా భావించి అప్రమత్తం కావాలని సూచించారు. చికిత్స విధానం, సిబ్బంది ప్రవర్తనపై అనుమానం కలిగితే అర్హత కలిగిన మరో వైద్యుడిని సంప్రదించి రెండో అభిప్రాయం తీసుకోవాలని సజ్జనార్ సూచించారు. ఎక్కడైనా నకిలీ వైద్యులు చలామణిలో ఉన్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 112కి లేదంటే సమీప పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు. ప్రజల సహకారంతో అమాయకుల ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●SplashBI GCC Launch | జీసీసీలను సంప్రదాయ సేవలకే పరిమితం కానివ్వం.. ఆవిష్కరణ కేంద్రాలుగా తయారు చేస్తం
- ●MakeMyTrip IPO | మేక్మైట్రిప్ ఐపీఓకు సెబీ గ్రీన్‌సిగ్నల్.. త్వరలో మార్కెట్లోకి..
- ●Senegal Migrant Boat Sinking | సెనెగల్ తీరంలో విషాదం: యూరప్‌నకు వలస వెళ్తూ పడవ బోల్తా.. 34 మంది మృతి
- ●Hyderabad | హైదరాబాద్‌లో పేకాట శిబిరాలపై మెరుపుదాడి.. 16 మంది అరెస్టు
- ●Lifestyle Inflation | వేతనం పెరుగుతున్నా పొదుపు పెరగడం లేదా? మీ ఖర్చులే కారణమా..?
- ●Commercial Tax | రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం.. ఒక్క నెలలోనే రూ.7,735 కోట్ల ఆదాయం!

SplashBI GCC Launch | జీసీసీలను సంప్రదాయ సేవలకే పరిమితం కానివ్వం.. ఆవిష్కరణ కేంద్రాలుగా తయారు చేస్తం

MakeMyTrip IPO | మేక్మైట్రిప్ ఐపీఓకు సెబీ గ్రీన్‌సిగ్నల్.. త్వరలో మార్కెట్లోకి..

Senegal Migrant Boat Sinking | సెనెగల్ తీరంలో విషాదం: యూరప్‌నకు వలస వెళ్తూ పడవ బోల్తా.. 34 మంది మృతి

Hyderabad | హైదరాబాద్‌లో పేకాట శిబిరాలపై మెరుపుదాడి.. 16 మంది అరెస్టు




