త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Peddi | పెద్ది విడుద‌ల‌పై క్లారిటీ.. రామ్‌చ‌ర‌ణ్‌ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

Peddi | రామ్‌చ‌ర‌ణ్ (Ramcharan) ప్రెస్టీజియ‌స్ మూవీ పెద్ది (Peddi) విడుద‌ల‌పై సందిగ్ధం నెల‌కొన్న‌ది. జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ మూవీ రిలీజ్ (Peddi Relese Date) ఇప్ప‌టికే రెండు సార్లు వాయిదాప‌డింది.

G

Movies | Published On Apr 27, 2026, 8.30 am IST

Peddi | పెద్ది విడుద‌ల‌పై క్లారిటీ.. రామ్‌చ‌ర‌ణ్‌ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Advertisement

Peddi | త్రినేత్ర‌.న్యూస్‌: రామ్‌చ‌ర‌ణ్ (Ramcharan) ప్రెస్టీజియ‌స్ మూవీ పెద్ది (Peddi) విడుద‌ల‌పై సందిగ్ధం నెల‌కొన్న‌ది. జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ మూవీ రిలీజ్ (Peddi Relese Date) ఇప్ప‌టికే రెండు సార్లు వాయిదాప‌డింది. తొలుత మార్చి 26న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని అనుకున్నారు. కానీ షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో ఏప్రిల్ 30కి పోస్ట్‌పోన్ అయ్యింది. షూటింగ్‌లో అవాంత‌రాలు త‌దిత‌ర కార‌ణాల‌తో ఏప్రిల్ 30 నుంచి జూన్‌కు పెద్ది రిలీజ్ డేట్ మారిన‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. జూన్ 25న రామ్‌చ‌ర‌ణ్ మూవీ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో టాక్ వినిపించింది. అయితే పెద్ది మూవీ విడుద‌ల వాయిదా ప‌డుతుండ‌టంతో చెర్రీ ఫ్యాన్స్‌లో గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. అప్పుడు, ఇప్పుడు అంటూ ఊరిస్తున్నార‌ని, అస‌లు ఆ సినిమా విడుద‌ల‌య్యేది ఎప్పుడంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో మూవీ డైరెక్ట‌ర్ బుచ్చిబాబు (Buchi Babu) మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ అందించారు. జూన్ 25న ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంద‌ని చెప్పారు. దీంతో పెద్ది రిలీజ్ తేదీపై లొల్లి పోయింది. ప్ర‌స్తుతం ఐటెమ్ సాంగ్ షూటింగ్ జ‌రుగుతున్న‌ద‌ని తెలిపారు. ఈ స్పెష‌ల్ సాంగ్‌లో శృతి హాస‌న్ న‌టిస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది. తొలుత ఈ పాట‌ కోసం మృణాల్ ఠాకూర్‌, సంయుక్త మీన‌న్‌తో పాటు మ‌రికొంద‌రు హీరోయిన్ల‌ను అనుకున్నారు.

Read Also.. 

సుర్రుమంటున్న ఎండ‌లు.. గిర్రున తిరుగుతున్న మీట‌ర్లు.. గృహ‌జ్యోతి ల‌బ్ధిదారుల‌కు స‌మ్మ‌ర్ షాక్‌!

జోధ్‌పూర్: 'బ్లూ సిటీ' వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈ నగరం తన రంగును ఎందుకు కోల్పోతోంది?

చౌమహల్లా ప్యాలెస్‌లో రాయల్ డిన్నర్.. నిజాంల రాజవిందు ధర, బుకింగ్ వివరాలు ఇవే

Advertisement

తాజావార్తలు

Advertisement