త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Royal Dinner at Chowmahalla Palace | చౌమహల్లా ప్యాలెస్‌లో రాయల్ డిన్నర్.. నిజాంల రాజవిందు ధర, బుకింగ్ వివరాలు ఇవే

హైదరాబాద్‌లోని చారిత్రక చౌమహల్లా ప్యాలెస్‌లో కొత్తగా 'ది చౌమహల్లా ఎక్స్‌పీరియన్స్' పేరిట రాయల్ డిన్నర్ ప్రారంభమైంది. నిజాంల రాజభవనంలో 300 ఏళ్ల నాటి డైనింగ్ టేబుల్‌పై కూర్చుని విందును ఆస్వాదించాలనుకునే వారి కోసం ఆన్‌లైన్ బుకింగ్ విధానం, టికెట్ ధర, మెనూ, ప్యాలెస్ సందర్శన సమయాలు, రవాణా సౌకర్యాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇదే.

J

Tourism | Published On Apr 26, 2026, 9.30 pm IST

Royal Dinner at Chowmahalla Palace | చౌమహల్లా ప్యాలెస్‌లో రాయల్ డిన్నర్.. నిజాంల రాజవిందు ధర, బుకింగ్ వివరాలు ఇవే
Advertisement
  • నిజాంల రాజభవనంలో విందు
  • బుకింగ్, ధర, మెనూ పూర్తి వివరాలు

Royal Dinner at Chowmahalla Palace | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగర శోభను ఇనుమడింపజేసే చారిత్రక కట్టడాల్లో చౌమహల్లా ప్యాలెస్ ముందువరుసలో ఉంటుంది. ఉర్దూలో 'చౌ' అంటే నాలుగు అని, 'మహల్లా' అంటే భవనాలు అని అర్థం. నాలుగు ప్రధాన రాజభవనాల సముదాయం కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. ఒకప్పుడు హైదరాబాద్ నిజాంల అధికారిక నివాసంగా, పరిపాలనా కేంద్రంగా ఈ ప్యాలెస్ వెలుగొందింది. ఇది హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్‌కు కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న మోతీ గల్లీ, ఖిల్వత్ ప్రాంతంలో ఉంది.

చౌమహల్లా ప్యాలెస్ చరిత్ర ఏంటి?

చౌమహల్లా ప్యాలెస్ నిర్మాణాన్ని 1750వ సంవత్సరంలో నిజాం సలాబత్ జంగ్ ప్రారంభించారు. అయితే, దీని నిర్మాణం ఐదో నిజాం అఫ్జల్-ఉద్-దౌలా కాలంలో పూర్తిగా ముగిసింది. పర్షియన్, రాజస్థానీ, యూరోపియన్ నిర్మాణ శైలుల అద్భుత కలయికగా ఈ భవనాన్ని తీర్చిదిద్దారు. నిజాంల దర్బార్లు, అధికారిక సమావేశాలు, విదేశీ అతిథులకు ఇచ్చే భారీ విందులు ఇక్కడే జరిగేవి.

రాయల్ డిన్నర్ షురూ

సాధారణంగా పర్యాటకులను పగటిపూట మాత్రమే ఈ ప్యాలెస్ లోపలికి అనుమతిస్తారు. కానీ, రాత్రివేళల్లో దీపాల కాంతిలో ప్యాలెస్ అందాలను, నిజాంల కాలం నాటి రాజసపు విందును నేటి తరానికి రుచి చూపించాలనే ఉద్దేశంతో నిర్వాహకులు 'ది చౌమహల్లా ఎక్స్‌పీరియన్స్' పేరుతో ఒక ప్రత్యేకమైన రాయల్ డిన్నర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.

Curated royal dining experience at The Chowmahalla Palace in Hyderabad - The Hindu

ఈ ప్యాకేజీలో కేవలం భోజనం మాత్రమే కాకుండా, ఒక గంట పాటు రాత్రి పూట ప్యాలెస్ ప్రైవేట్ గైడెడ్ టూర్ ఉంటుంది. నిజాం కాలం నాటి గజల్స్, లైవ్ మ్యూజిక్ వింటూ.. భారీ స్ఫటిక షాండ్లియర్ల కింద 300 ఏళ్ల నాటి డైనింగ్ టేబుల్‌పై కూర్చుని భోజనం చేయడం ఒక మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది.

రాయల్ డిన్నర్‌కు ఎలా బుక్ చేసుకోవాలి? ధర ఎంత? మెనూ ఏంటి?

రాయల్ డిన్నర్‌లో పాల్గొనాలనుకునే వారు కనీసం 3-4 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం తప్పనిసరి. సీట్లు పరిమితంగా ఉంటాయి. ప్రస్తుతం దీని బుకింగ్స్ వారి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీ @thechowmahalla_experience ద్వారా జరుగుతున్నాయి. ఆ పేజీకి డైరెక్ట్ మెసేజ్ చేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఒక్కరు వెళ్లాలనుకున్నా బుక్ చేసుకోవచ్చు.

Curated royal dining experience at The Chowmahalla Palace in Hyderabad - The Hindu

ధరల విషయానికి వస్తే, శాకాహారులకు ఒక వ్యక్తికి సుమారు రూ.4,000 ఉంటుంది. మాంసాహారులకు రూ.4,500 నుండి రూ.4,800 వరకు ఉంటుంది (వీటికి పన్నులు అదనం). రాత్రి 7:00 గంటలకు ప్రారంభమయ్యే ఈ విందు 10:00 గంటల వరకు సాగుతుంది.

ఈ 5-కోర్సు మీల్ మెనూలో ప్రామాణికమైన నిజామీ రుచులు ఉంటాయి. ముఖ్యంగా దాల్ షోర్బా, ముర్గ్ తిక్కా, దమ్ బిర్యానీ, దమ్ కా ముర్గ్, ఖుబానీ కా హల్వా, ఆప్రికాట్ పుడ్డింగ్ వంటి నోరూరించే వంటకాలను వడ్డిస్తారు. ప్యాలెస్ వాతావరణానికి తగ్గట్టుగా ఎత్నిక్ లేదా ఫార్మల్ డ్రెస్ కోడ్ పాటించడం మంచిది.

ప్యాలెస్‌లో ముఖ్యంగా చూడాల్సినవి ఏంటి?

రాయల్ డిన్నర్‌తో పాటు లేదా సాధారణ పగటిపూట సందర్శనలో ఈ క్రింది ముఖ్యమైన ప్రదేశాలను చూడొచ్చు.

Curated royal dining experience at The Chowmahalla Palace in Hyderabad - The Hindu

ఖిల్వత్ ముబారక్: ప్యాలెస్ ప్రధాన ఆకర్షణ ఇదే. దర్బార్ నిర్వహించే ఈ హాల్‌లోని భారీ స్ఫటిక షాండ్లియర్లు ఎంతగానో ఆకట్టుకుంటాయి.

భవనాల సముదాయం: దక్షిణ ఆవరణలోని అఫ్జల్ మహల్, మహ్తాబ్ మహల్, తహనియత్ మహల్, అఫ్తాబ్ మహల్, ఉత్తర ఆవరణలోని బారా ఇమామ్ చూడదగినవి.

గడియార స్తంభం : వందల ఏళ్లుగా నిరంతరాయంగా పనిచేస్తున్న పురాతన గడియారం ఇక్కడ ఉంది.

వింటేజ్ కార్లు: నిజాంలు వాడిన అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ వంటి పురాతన కార్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ.

చౌమహల్లా ప్యాలెస్‌కు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా ఎలా వెళ్లాలి?

చౌమహల్లా ప్యాలెస్ నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యాలను కలిగి ఉంది.

RTC బస్సులు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఎంజీబీఎస్ నుంచి లోకల్ బస్సుల ద్వారా నేరుగా చార్మినార్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి ప్యాలెస్‌కు నడుచుకుంటూ లేదా ఆటోలో వెళ్లొచ్చు.

మెట్రో రైలు: గ్రీన్ లైన్ మెట్రోలో ఎంజీబీఎస్ స్టేషన్‌లో దిగి, అక్కడి నుంచి 3-4 కి.మీ దూరంలో ఉన్న ప్యాలెస్‌కు క్యాబ్ లేదా ఆటోలో చేరుకోవచ్చు.

ఎయిర్‌పోర్ట్ నుండి: శంషాబాద్ విమానాశ్రయం నుంచి పుష్పక్ బస్సుల్లో ఎంజీబీఎస్ వచ్చి ఆటో తీసుకోవచ్చు లేదా నేరుగా క్యాబ్ బుక్ చేసుకుంటే 45-50 నిమిషాల్లో చేరుకోవచ్చు.

ప్యాలెస్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? టైమింగ్స్, హాలిడేస్ వివరాలు

సాధారణ పర్యాటకుల కోసం చౌమహల్లా ప్యాలెస్ ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్యాలెస్ మొత్తం చూడటానికి సుమారు 2 నుండి 3 గంటల సమయం పడుతుంది.

Chowmahalla Palace | Tickets, Timings | Hyderabad Tourism

ప్రతి శుక్రవారం, ప్రభుత్వ సెలవు దినాల్లో ప్యాలెస్ మూసివేయబడుతుంది. ప్రవేశ రుసుము భారతీయులకు రూ.100, విదేశీయులకు రూ.400 గా నిర్ణయించారు (కెమెరాకు అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది). లోపలికి ఎలాంటి బయటి ఆహారం, పానీయాలు అనుమతించరు. క్యాబ్ సేవలు కూడా ఇక్కడికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. పాతబస్తీ ప్రాంతం కావడంతో సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

Advertisement
Advertisement