త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mandula Samel | మీ అమ‌రావ‌తిలో ఏడ‌వండి.. హైద‌రాబాద్‌లో ఇంకా ఎందుకు.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఎమ్మెల్యే మందుల సామేలు ఫైర్‌.. వీడియో

Mandula Samuel | ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్‌పై (Professor Nageshwar) కేసు విష‌యంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై (Pawan Kalyan) తుంగుతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు (Mandula Samuel ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

G

Telangana | Published On May 28, 2026, 8.36 am IST

Mandula Samel | మీ అమ‌రావ‌తిలో ఏడ‌వండి.. హైద‌రాబాద్‌లో ఇంకా ఎందుకు.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఎమ్మెల్యే మందుల సామేలు ఫైర్‌.. వీడియో
Advertisement

Mandula Samuel Mandula Samuel| త్రినేత్ర‌.న్యూస్‌: ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్‌పై (Professor Nageshwar) కేసు విష‌యంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై (Pawan Kalyan) తుంగుతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు (Mandula Samuel) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. `ఆడెవ‌డో.. వానిపేరేంది.. పవన్ కల్యాణో.. భొవన్ కల్యాణో.. ఆడొచ్చి ప్ర‌పంచ మేధావి అయిన ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ మీద కేసులు పెడ్త‌డు. ఆంధ్ర పోలీసులు వ‌చ్చి ఆయ‌న‌ను ప‌ట్టుకుపోత‌ర‌ట‌. తొక్కుడు తొక్కుత‌రు ఆంధ్ర‌ని. ఇంకెక్క‌డిది ఆంధ్ర‌.. చంద్ర‌బాబు వ‌చ్చి ఇక్క‌డ స్థావ‌రం పెడుత‌డు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ స్థావ‌రం పెడుత‌డు. ఆడ మీ అమ‌రావ‌తిలో పోయి ఏడ్వండి. హైద‌రాబాద్‌ల‌, జూబ్లీహిల్స్‌ల మీ అయ్య జాగీర్ ఉన్న‌దా ఇంకా. సిగ్గూ ష‌రం ఉంటే ఎల్లిపోవాలే. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యమకారుల మీద మీరు చేస్తున్న అరాచ‌క పాల‌న న‌డ‌వ‌దు` అని హెచ్చ‌రించారు.

పెత్త‌నం చేస్తామంటే ఊరుకునేది లే..

చంద్రబాబు నాయుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఏం ప‌ని అని నిల‌దీశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క తెలంగాణ వ్యక్తి కూడా వెళ్లడం లేదు. కానీ తెలంగాణ‌కు మాత్రం ఆంధ్ర నేతలు వ‌స్తూనే ఉన్నారు. బ‌త‌క‌డానికి తెలంగాణకు వ‌చ్చిన‌వాళ్లు బ‌త‌కడానికి వ‌చ్చిన‌ట్టు ఉండాల‌ని.. కానీ పెత్తనం చేస్తాం అంటే మాత్రం తాము చూస్తూ ఊరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. 60 ఏండ్ల‌పాటు పోరాటం చేసి, కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చ‌కుంటే మ‌ళ్లీ హైద‌రాబాద్ వ‌చ్చి ఆగం చేయాల‌ని చూస్తున్నారా?.. అవ‌స‌రం అయితే ఆంధ్రా నేతలకు వ్యతిరేకంగా మ‌ళ్లీ తిరుగుబాటు త‌ప్పదని హెచ్చ‌రించారు.

అస‌లేం జ‌రిగిందంటే..

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వద్దకు పవన్ కల్యాణ్ వెళ్లారంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై జనసేనతోపాటు ఏపీ డిప్యూటీ సీఎం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్‌పై ఏపీలో కేసులు న‌మోద‌య్యాయి. ఆయ‌న‌ను అరెస్ట్ చేసేందుకు ఆంధ్ర పోలీసులు హైద‌రాబాద్ వ‌చ్చారంటూ వార్త‌లు వెలువ‌డ్డాయి. దీనిపై ఎమ్మెల్యే మందుల సామేలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement