Threat | చంపేస్తాం.. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి రణ్ వీర్ సింగ్, రోహిత్ శెట్టికి బెదిరింపులు
Threat | గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ గ్యాంగ్ (Bishnoi gang) నుంచి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు బెదిరింపులు (Threat) వచ్చాయి.
Threat | గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ గ్యాంగ్ (Bishnoi gang) నుంచి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు బెదిరింపులు (Threat) వచ్చాయి. బాలీవుడ్ స్టార్ నటుడు రణ్ వీర్ సింగ్ (Ranveer Singh), ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి (Rohit Shetty)ని చంపేస్తామంటూ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించింది. వారి దగ్గర ఉన్న స్టాఫ్‌ను కూడా చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు హరి బాక్సర్ అనే వ్యక్తి ఓ ఆడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు. వెనక్కి తగ్గండి.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ బెదిరించాడు.
"రణ్వీర్ సింగ్.. మీ తర్వాతి ఏడు తరాలు గుర్తించుకునేలా నీకు బుద్ధి చెబుతాం. సలహాలు ఇవ్వడం, వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని ప్రజలకు సూచించడం నీకు బాగా అలవాటుగా మారింది. సరే అయితే, నువ్వు కూడా ఫిర్యాదు చేశావు. ఇబ్బందేమీ లేదు. ఇది మాత్రం జాగ్రత్తగా విను. నీ దగ్గర పనిచేసే ప్రతి మేనేజర్, ప్రతి వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నాయి. వారు ఎక్కడ నివసిస్తున్నారు, ఎప్పుడు ఆఫీస్‌కు వస్తారు, ఎప్పుడు వెళ్లిపోతారు, వారి కుటుంబ సభ్యులు ఎవరు.. ఇలా ప్రతీ సమాచారం మా దగ్గర ఉంది. మేము నేరుగా నిన్ను ఏమీ చెయ్యం. నీ కింద పనిచేసే వాళ్ల నుంచి మొదలు పెడతాం. వారందరినీ చంపేస్తాం. అప్పుడు నీకు బుద్ధివస్తుంది. మేం పని మొదలు పెట్టేలోపే మేలుకో" అంటూ అందులో హెచ్చరించాడు. ఇవే బెదిరింపులు రోహిత్ శెట్టికి కూడా వర్తిస్తాయని హెచ్చరించాడు. తమ బెదిరింపులను తేలిగ్గా తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అందులో హెచ్చరించాడు. ఈ బెదిరింపులు బీటౌన్‌లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
కాగా, ఇటీవలే రోహిత్ శెట్టి (Rohit Shetty) ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1వ తేదీన ముంబైలోని జుహులోని ఆయన నివాసంపై కొందరు దుండగులు కాల్పులు (Gun Fire) జరిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మొత్తం నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పుడు మరోసారి ఆయనకు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






