Coffee | కాఫీని అసలు ఎవరు తాగవచ్చు, ఎవరు తాగకూడదు..?
Coffee | ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో కాఫీ కూడా ఒకటి. ఇది కేవలం శక్తిని అందించే డ్రింక్ మాత్రమే కాదు, మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కాఫీలో ఉండే కేఫీన్ అనే పదార్థం కొంతమందిలో తాత్కాలికంగా రక్తపోటు పెరగడానికి కారణమవుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
Coffee | ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో కాఫీ కూడా ఒకటి. ఇది కేవలం శక్తిని అందించే డ్రింక్ మాత్రమే కాదు, మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కాఫీలో ఉండే కేఫీన్ అనే పదార్థం కొంతమందిలో తాత్కాలికంగా రక్తపోటు పెరగడానికి కారణమవుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే, నిపుణుల మాటల్లో చెప్పాలంటే, మితంగా, క్రమంగా కాఫీ తాగేవారిలో రక్తపోటుపై ప్రతికూల ప్రభావం ఉండదని స్పష్టం చేస్తున్నారు. కాఫీ రక్తపోటుపై చూపే ప్రభావం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే కాఫీ పరిమాణం, వ్యక్తి జీవనశైలి కీలక పాత్ర పోషిస్తాయి. కాఫీని అరుదుగా తాగే వారిలో రక్తపోటు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అలాగే హైబీపీ వచ్చే ప్రమాదం కూడా అధికంగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే రోజుకు ఒకటి నుంచి మూడు కప్పుల వరకు కాఫీ తాగితే, ముఖ్యంగా మహిళలు, పొగతాగని వారిలో రక్తపోటుపై ప్రతికూల ప్రభావం ఉండదని అధ్యయనాలు చెబుతున్నాయి.
రోజుకు 400 మిల్లీగ్రాముల వరకు..
మితంగా కాఫీని తీసుకుంటే రక్తపోటుకు ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా FDA సూచనల ప్రకారం, రోజుకు 400 మిల్లీగ్రాముల వరకు కెఫీన్‌ను తీసుకోవడం సురక్షితమే. ఇది సుమారు మూడు కప్పుల కాఫీకి సమానం. అయితే వైద్యుల మాటల్లో చెప్పాలంటే, వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి రోజుకు నాలుగు లేదా ఐదు కప్పుల కాఫీ కూడా కొంతమందికి సురక్షితంగా ఉండొచ్చని చెబుతున్నారు. మితంగా తీసుకుంటే కెఫీన్ హానికరం కాకపోయినా, మోతాదు మించితే పలు దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది. గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన, నాడులు ఉత్తేజం చెందడం, నిద్రలేమి, వికారం, వాంతులు, చేతులు, శరీరం వణకడం, అధికంగా మూత్రం రావడం, చిరాకు వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఎవరు తీసుకోవద్దు..?
సాధారణంగా కాఫీలో ఉండే కెఫీన్ సురక్షితమైనదే అయినా, కొన్ని వర్గాల వారు పరిమితంగా తీసుకోవడం లేదా పూర్తిగా దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గర్భిణీలు రోజుకు 200 మిల్లీగ్రాముల కంటే తక్కువగా, అంటే ఒకటి నుంచి రెండు చిన్న కప్పుల మోతాదులోనే కాఫీని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే గుండె కొట్టుకునే వేగంలో సమస్యలు ఉన్నవారు, అల్సర్లు, గ్యాస్ సమస్య ఉన్నవారు, హైబీపీ ఉన్నవారు, ఆస్తమా, గుండె జబ్బులకు మెడిసిన్లను వాడేవారు, యాంటీ బయోటిక్స్‌ను ఉపయోగించేవారు కాఫీని చాలా తక్కువగా ఒక కప్పు మోతాదులో తాగాలి. లేదా పూర్తిగా మానేస్తే మంచిదని చెబుతున్నారు.
రక్తపోటు అదుపులో ఉండాలంటే..?
వైద్య శాస్త్రం ఆధారంగా సూచించిన కొన్ని అలవాట్లు రక్తపోటును అదుపులో ఉంచేందుకు సహాయపడతాయి. సరిపడా నిద్రించడం, చక్కెర, పాలు కలపకుండా బ్లాక్ కాఫీ తాగడం, కెఫీన్ లేని గ్రీన్ టీ తీసుకోవడం, యోగా, ధ్యానం, శ్వాసాభ్యాసాలతో ఒత్తిడిని తగ్గించుకోవడం, పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలతో సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవడం, పొటాషియం ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవడం, పొగతాగడం మానేయడం, మద్యం పరిమితం చేయడం లేదా మానేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి అలవాట్లను పాటించడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



