Lemon And Honey Water | నెల రోజుల పాటు నిమ్మరసం, తేనె నీళ్లను తాగితే శరీరంలో మార్పులు కనిపిస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
Lemon And Honey Water | ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొద్దిగా తేనె కలిపి తాగడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. పెద్దగా ఖర్చు లేకుండా, ప్రత్యేకంగా సిద్ధం చేయాల్సిన అవసరం లేకుండా ఈ చిన్న ఆరోగ్య దినచర్య చాలామంది రోజువారీ జీవితంలో భాగమైపోయింది.
Lemon And Honey Water | ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొద్దిగా తేనె కలిపి తాగడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. పెద్దగా ఖర్చు లేకుండా, ప్రత్యేకంగా సిద్ధం చేయాల్సిన అవసరం లేకుండా ఈ చిన్న ఆరోగ్య దినచర్య చాలామంది రోజువారీ జీవితంలో భాగమైపోయింది. అయితే దీన్ని ప్రతిరోజూ నెలరోజుల పాటు కొనసాగిస్తే నిజంగా శరీరంలో ఏమైనా మార్పులు కనిపిస్తాయా? అంటే.. అందుకు నిపుణులు అవుననే సమాధానాలు చెబుతున్నారు. భారీ మార్పులు రావు, కానీ మార్పులు స్థిరంగా ఉంటాయని చెప్పారు. సాధారణ నీటితో పోలిస్తే నిమ్మరసం, తేనె కలిపిన నీరు రుచిగా ఉండటంతో ఎక్కువగా తాగాలనిపిస్తుంది. దీని వల్ల శరీరానికి అవసరమైన ఫ్లూయిడ్స్ అందే అవకాశాలు పెరుగుతాయి. సరైన హైడ్రేషన్ శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, ఎనర్జీ లెవల్స్, రోజువారీ శరీర కార్యకలాపాలకు కీలకమని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా సాధారణ నీరు తాగడం తగ్గించే వారికి ఇది ఉపయోగకరమైన మార్పుగా మారుతుంది.
ఇమ్యూనిటీ పెరుగుదలకు..
నిమ్మకాయలో సహజసిద్ధంగా విటమిన్ సి ఉంటుంది. ఇది ఇమ్యూనిటీకి మద్దతు ఇవ్వడంతో పాటు శరీర కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. అలాగే తేనెలో కూడా కొన్ని ప్లాంట్ కంపౌండ్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ప్రతిరోజూ ఈ డ్రింక్ తీసుకోవడం ద్వారా శరీరానికి చిన్న మోతాదులో అయినా నిరంతరంగా పోషకాలు అందే అవకాశం ఉంటుంది. చర్మ ఆరోగ్యానికీ ఇది కొంత మేలు చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ జీర్ణక్రియకు సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో తాగితే జీర్ణవ్యవస్థ కొంత యాక్టివ్‌గా మారే అవకాశం ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలకు పూర్తి పరిష్కారం కాకపోయినా, కొంతమందిలో భోజనం తర్వాత భారంగా అనిపించడం లేదా బ్లోటింగ్ తగ్గినట్లు అనిపిస్తుంది.
బరువు వెంటనే తగ్గకపోయినా..
నిమ్మ-తేనె నీరు తాగితే వెంటనే బరువు తగ్గిపోతారని చెప్పడం సరైంది కాదు. కానీ ఇది మంచి ఆహార అలవాట్లకు సహకరిస్తుంది. భోజనం ముందు నీరు తాగడం వల్ల కడుపు నిండిన భావన కలిగి తక్కువ కాలరీలు తీసుకునే అవకాశం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే సాఫ్ట్ డ్రింక్స్ లేదా హై-కాలరీ బేవరేజెస్ స్థానంలో దీనిని తీసుకుంటే అదనపు షుగర్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. తేనెలో సహజంగా ఉండే కొన్ని పదార్థాలు మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇవి ప్రీబయోటిక్‌లా పనిచేసే అవకాశం ఉంటుంది. ప్రభావం చాలా ఎక్కువగా కాకపోయినా, సంతులిత ఆహారంతోపాటు ఈ అలవాటు కొనసాగితే జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి కొంత మద్దతు ఇస్తుంది.
గొంతు సమస్యలకు చెక్..
గోరువెచ్చని నిమ్మ-తేనె నీరు చాలామందికి కంఫర్ట్ ఫీలింగ్ ఇస్తుంది. ముఖ్యంగా గొంతు ఇర్రిటేషన్ తగ్గించడంలో తేనె ఉపశమనాన్ని ఇస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం ఇదే రొటీన్ కొనసాగించడం వల్ల మానసికంగా కూడా ప్రశాంతత కలిగించే చిన్న వెల్నెస్ అలవాటుగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. నిమ్మ-తేనె నీరు తాగడం వల్ల ఒక్కసారిగా భారీ మార్పులు రావు. కానీ సరైన ఆహారం, వ్యాయామం, మంచి జీవనశైలితో కలిసి ఈ అలవాటు కొనసాగితే చిన్నచిన్న ఆరోగ్య ప్రయోజనాలు క్రమంగా కనిపించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Honey And Lemon Water | తేనె-నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని తాగితే ఏమవుతుంది ? నిజంగా ప్రయోజనాలున్నాయా ?
జూన్ 30, 2026

Citrus Juice | ఖాళీ కడుపుతో సిట్రస్ జ్యూస్ తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
జూన్ 6, 2026

Detox Drink | వేసవిలో బెస్ట్ డిటాక్స్ డ్రింక్ ఏది? బార్లీ వాటర్ లేదా చెరకు రసం..?
జూన్ 3, 2026
తాజావార్తలు
- ●Phone Screen Protectors | నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే.. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కీలక నిర్ణయం
- ●ఒక్క ఆదేశంతో యుద్ధం.. ఒక్క మాటతో విరమణ! అమెరికా అధ్యక్షుడి చేతిలో నిజంగా అంత పవర్ ఉందా?
- ●Namma Metro Daily Commute Cost | మెట్రో ఎక్కాలంటే రూ.70,000 జీతం ఉండాల్సిందేనా? పబ్లిక్ ఇన్ఫ్రాపై వైరల్ అవుతున్న చర్చ
- ●Chiranjeevi | 48 ఏళ్ల క్రితం ఇదే రోజు చిరంజీవిగా పేరు మార్చుకున్నా - మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
- ●DGP Anand | ఇలాగే ముందుకు సాగండి.. అవార్డు పొందిన ఈగల్ ఫోర్స్ టీమ్‌కు డీజీపీ అభినందనలు
- ●Special Trains | చర్లపల్లి నుంచి ప్రయాగ్‌రాజ్, సెంగోట్టైకి ప్రత్యేక ట్రైన్స్‌ను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Phone Screen Protectors | నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే.. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కీలక నిర్ణయం

ఒక్క ఆదేశంతో యుద్ధం.. ఒక్క మాటతో విరమణ! అమెరికా అధ్యక్షుడి చేతిలో నిజంగా అంత పవర్ ఉందా?

Namma Metro Daily Commute Cost | మెట్రో ఎక్కాలంటే రూ.70,000 జీతం ఉండాల్సిందేనా? పబ్లిక్ ఇన్ఫ్రాపై వైరల్ అవుతున్న చర్చ

Chiranjeevi | 48 ఏళ్ల క్రితం ఇదే రోజు చిరంజీవిగా పేరు మార్చుకున్నా - మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్



