Honey And Lemon Water | తేనె-నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని తాగితే ఏమవుతుంది ? నిజంగా ప్రయోజనాలున్నాయా ?
Honey And Lemon Water | ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది విశ్వసిస్తుంటారు. సోషల్ మీడియాలోనూ ఈ ఆరోగ్య చిట్కా ఎక్కువగా ప్రచారంలో ఉంది.
Honey And Lemon Water | ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది విశ్వసిస్తుంటారు. సోషల్ మీడియాలోనూ ఈ ఆరోగ్య చిట్కా ఎక్కువగా ప్రచారంలో ఉంది. అయితే ఇలా తాగితే నిజంగానే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయా, ఈ మిశ్రమం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి తదితర విషయాలను ప్రజలకు తెలియజేయడం కోసం క్లినికల్ బయోకెమిస్ట్రీ అండ్ న్యూట్రిషన్ అనే జర్నల్‌లో శాస్త్రవేత్తలు పలు అధ్యయనాల తాలూకు వివరాలను ప్రచురించారు. నిమ్మరసం, తేనె, గోరు వెచ్చని నీటి మిశ్రమం ఏ మేర ఫలితాలను ఇస్తుందనే వివరాలను వారు అధ్యయనం చేసి విశ్లేషించి ఆ జర్నల్‌లో తెలియజేశారు. వారు తెలిపిన ప్రకారం రోజూ పరగడుపునే గోరు వెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగితే లాభాలు కలిగే మాట వాస్తవమే అయినప్పటికీ ఈ మిశ్రమం అందరికీ సరిపోదని సూచిస్తున్నారు. దీన్ని తాగడం వల్ల కలిగే లాభాలు చాలా స్వల్ప మోతాదులో ఉంటాయని చెబుతున్నారు.
నీళ్లను సరిగ్గా తాగనివారికి..
ఈ పానీయం తాగడం వల్ల రోజు మొత్తం మీద ఎక్కువ నీరు తాగే అవకాశం ఉంటుంది. సాధారణ నీటితో పోలిస్తే నిమ్మరసం, తేనె కలిపిన నీరు రుచిగా ఉండటంతో రోజంతా తగినంత ద్రవాలను తీసుకునే అలవాటు పెరుగుతుంది. శరీరంలో తేమ స్థాయిలు సరిగా ఉండటానికి, శరీర ఉష్ణోగ్రత నియంత్రణకు, శక్తి స్థాయిలు నిలకడగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా తక్కువ నీరు తాగే వారికి ఈ అలవాటు ఉపయోగకరంగా మారుతుంది. నిమ్మకాయ ద్వారా శరీరానికి విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తికి మద్దతు ఇవ్వడమే కాకుండా కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తేనెలో కూడా సహజసిద్ధమైన మొక్కల సమ్మేళనాలు ఉండటంతో ఈ పానీయం ద్వారా శరీరానికి కొంతమేర యాంటీఆక్సిడెంట్ మద్దతు లభిస్తుంది. ప్రతిరోజూ తీసుకోవడం వల్ల పోషకాహారంలో స్థిరమైన మెరుగుదల కనిపించే అవకాశం ఉంటుంది.
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి..
జీర్ణక్రియ పరంగా కూడా కొంత ప్రయోజనం ఉంటుంది. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణ సమస్యలకు పూర్తి పరిష్కారం కాదు. అయినప్పటికీ ఈ మిశ్రమాన్ని రోజూ తీసుకుంటే కడుపు ఉబ్బరం, భోజనం తరువాత పొట్ట భారంగా అనిపించడం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. బరువు నియంత్రణలో కూడా ఈ మిశ్రమం పరోక్షంగా సహాయపడుతుంది. ఇది బరువు తగ్గించే అద్భుత పానీయం కాకపోయినా, ఉదయం తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో రోజు మొత్తం మీద ఆహారాన్ని తక్కువ తీసుకుంటారు. శరీరంలో చేరే క్యాలరీల పరిమాణం తగ్గుతుంది. ఇలా పరీక్షంగా బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అలాగే అధిక చక్కెర ఉండే శీతల పానీయాలకు బదులుగా నిమ్మ-తేనె నీటిని తీసుకోవడం వల్ల అనవసరమైన చక్కెర వినియోగం కూడా తగ్గుతుంది. దీని ద్వారా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఏర్పడటానికి దోహదపడుతుంది.
మ్యాజిక్ మిశ్రమం కాదు, కానీ..
పేగుల ఆరోగ్యానికి కూడా స్వల్ప మద్దతు లభిస్తుంది. తేనెలో ఉండే సహజ సమ్మేళనాలు మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించే ప్రీబయోటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. దీని ప్రభావం పెద్దగా కనిపించకపోయినా, సమతుల్య ఆహారంతోపాటు ఈ అలవాటు కొనసాగిస్తే జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి కొంత మేలు చేసే అవకాశం ఉంటుంది. గోరువెచ్చని నీరు, నిమ్మ-తేనె మిశ్రమం గొంతుకు ఉపశమనం కలిగించడంలోనూ సహాయపడుతుంది. స్వల్ప గొంతు చికాకు లేదా దగ్గు ఉన్న సందర్భాల్లో తేనె ఉపశమనం అందిస్తుంది. అయితే నెల రోజుల పాటు తేనె-నిమ్మ గోరువెచ్చని నీరు తాగినంత మాత్రాన అద్భుతమైన మార్పులు వస్తాయని భావించకూడదు. ఇది ఒక్కటే ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చదు. కానీ సమతుల్య ఆహారం, క్రమమైన వ్యాయామం, తగిన నిద్ర వంటి మంచి జీవనశైలితో కలిపి పాటిస్తే చిన్న చిన్న మార్పులే భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతాయి. అందువల్ల ఈ మిశ్రమం మ్యాజిక్ పానీయం కాదు. కానీ ఇతర విషయాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
సంబంధిత వార్తలు

Citrus Juice | ఖాళీ కడుపుతో సిట్రస్ జ్యూస్ తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
జూన్ 6, 2026

Lemon And Honey Water | నెల రోజుల పాటు నిమ్మరసం, తేనె నీళ్లను తాగితే శరీరంలో మార్పులు కనిపిస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
మే 25, 2026

Pineapple | ఈ సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితిలోనూ పైనాపిల్ పండ్లను తినకూడదు
ఫిబ్రవరి 14, 2026
తాజావార్తలు
- ●Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది
- ●Auto Driver Monthly Income 75000 | ఆటోడ్రైవర్ నెల సంపాదన రూ.75 వేలు.. కూతురి చదువు కోసం భారీ ఖర్చు.. చివరకు మిగిలింది ఇదే..!
- ●National Awards | అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక - పురస్కారాలు స్వీకరించిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే!
- ●Open Top Double Decker Buses | హైదరాబాద్ రోడ్లపైకి ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు
- ●Capital Gains Tax Agricultural Land | భూమి అమ్మిన డబ్బును అన్నకు బహుమతిగా ఇచ్చిన చెల్లి.. దీని ట్యాక్స్ ఎవరు చెల్లించాలి?
- ●Bullet Train Technology | భూకంపం వస్తే బుల్లెట్ రైలు ఆటోమేటిక్ ఆగిపోతుంది!

Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది

Auto Driver Monthly Income 75000 | ఆటోడ్రైవర్ నెల సంపాదన రూ.75 వేలు.. కూతురి చదువు కోసం భారీ ఖర్చు.. చివరకు మిగిలింది ఇదే..!

National Awards | అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక - పురస్కారాలు స్వీకరించిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే!

Open Top Double Decker Buses | హైదరాబాద్ రోడ్లపైకి ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు



