Weight Loss In Winter | చలికాలంలో వ్యాయామం చేయకుండానే అధిక బరువును తగ్గించుకోవాలని చూస్తున్నారా..? అయితే ఈ టిప్స్ పాటించండి..!
desrfhyuerurt
Weight Loss In Winter | అధిక బరువును తగ్గించుకోవడం చాలా కష్టంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. చాలా మంది సులభంగా బరువు పెరుగుతారు. కానీ దాన్ని తగ్గించుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అధికంగా బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటాయి. అతిగా భోజనం చేయడం, ఆలస్యంగా తినడం, నిద్రించడం, మరీ అతిగా నిద్రపోవడం, జంక్ ఫుడ్, స్వీట్లు, నూనె పదార్థాలను అతిగా తినడం, మద్యం అధికంగా సేవించడం, వ్యాయామం చేయకపోవడం వంటివన్నీ అధికంగా బరువు పెరిగేందుకు కారణం అవుతాయి. అయితే అధిక బరువును తగ్గించుకోవాలంటే డైట్‌ను పాటించడంతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండాలి. ఈ క్రమంలోనే రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా సరే వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అయితే చలికాలంలో ఉదయాన్నే లేవడం, వ్యాయామం చేయడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. పైగా ప్రస్తుతం ఉన్న చలి వాతావరణం కారణంగా బయట తిరిగే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అధిక బరువును తగ్గించుకోవాలంటే ఏం చేయాలి..? వ్యాయామం చేయకుండా బరువు తగ్గడం వీలవుతుందా..? వంటి ప్రశ్నలు అందరికీ ఉద్భవిస్తుంటాయి. అయితే ఇందుకు పోషకాహార నిపుణులు, వైద్యులు సమాధానాలు చెబుతున్నారు.
తక్కువ ఆహారం, ఎక్కువ నీళ్లు..
చలికాలంలో అధిక బరువు తగ్గించుకోవాలంటే వ్యాయామం చేయడం కుదరదని భావించే వారు కొన్ని టిప్స్‌ను పాటించాల్సి ఉంటుంది. చలికాలంలో మన జీర్ణ వ్యవస్థ పనితీరు కాస్తంత మందగిస్తుంది. ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. కనుక త్వరగా ఆకలి వేయదు. కాబట్టి ఆహారాన్ని అధికంగా తినాల్సిన అవసరం ఉండదు. తక్కువ ఆహారం తిన్నా సరిపోతుంది. కనుక ఈ సీజన్‌లో మరీ అతిగా ఆహారం తినకూడదు. కాస్తంత తింటే చాలు. దీని వల్ల శరీరంలో అధిక క్యాలరీలు చేరవు. కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే చలికాలంలో చాలా మంది నీళ్లను సరిగ్గా తాగరు. కానీ మన శరీర మెటబాలిజం సరిగ్గా ఉండాలన్నా, కొవ్వు కరిగి క్యాలరీలు ఖర్చు కావాలన్నా నీళ్లను తగిన మోతాదులో తాగాలి. అయితే గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీళ్లు చల్లగా ఉంటాయి కనుక నీళ్లను వేడి చేసి తాగితే మంచిది. దీని వల్ల నీళ్లను తగిన మోతాదులో తాగవచ్చు. పైగా గోరు వెచ్చని నీళ్లను తాగడం వల్ల మెటబాలిజం మెరుగు పడుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అందువల్ల చలికాలంలో కచ్చితంగా గోరు వెచ్చని నీళ్లను నిరంతరం తాగుతూనే ఉండాలి.
పీచు పదార్థం అధికంగా ఉండేవి బెస్ట్
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గడం తేలికవుతుంది. పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, తృణ ధాన్యాలు, బీన్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆహారం తక్కువగా తింటారు. దీని వల్ల శరీరంలో క్యాలరీలు అధికంగా చేరకుండా చూసుకోవచ్చు. అలాగే కొవ్వు చేరకుండా ఉంటుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. ఇక ఈ సీజన్‌లో వ్యాయామం చేయకుండా బరువు తగ్గాలని చూసేవారు ప్రాసెస్ చేయబడిన ఆహారాలను అసలు తీసుకోకపోవడమే మంచిది. లేదంటే వీటి వల్ల శరీరంలో అనవసర చక్కెరలు, కొవ్వులు చేరుతాయి. ఇవి బరువు పెరిగేలా చేస్తాయి. దీంతో బరువు నియంత్రణలో ఉండదు. కనుక ఇలాంటి ఆహారాలను పూర్తిగా మానేయాల్సి ఉంటుంది.
ఆరోగ్యకరమైన స్నాక్స్..
ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి రెండు విధాలుగా మేలు జరుగుతుంది. వీటి వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు, శక్తి లభిస్తాయి. అలాగే రుచిగా కూడా ఉంటాయి. కనుక సాయంత్రం సమయంలో జంక్ ఫుడ్‌కు బదులుగా ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను తినాలి. ఇవి బరువు తగ్గేందుకు కూడా సహాయం చేస్తాయి. బాదంపప్పు. జీడిపప్పు, వాల్ నట్స్, పిస్తా, గుమ్మడి, పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా సీడ్స్, అవిసె గింజలు వంటి వాటిని సాయంత్రం సమయంలో స్నాక్స్ లాగా తింటే ఎంతో మేలు జరుగుతుంది. వీటి వల్ల వ్యాయామం లేకుండానే బరువు తగ్గడం తేలికవుతుంది. వీటిల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలో అదనంగా ఉండే కొవ్వును కరిగిస్తాయి. బరువు తగ్గడంలో సహాయం చేస్తాయి. ఇక బయటి ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారాన్నే తినాలి. అలాగే మద్యం సేవించడం, పొగ తాగడం మానేయాలి. వేళకు నిద్రించాలి. ఈ సూచనలను పాటిస్తే మీ శరీరంలో కొద్ది రోజుల్లోనే గణనీయమైన మార్పు వస్తుంది. వ్యాయామం చేయకుండానే బరువు తగ్గాలన్న మీ లక్ష్యం కూడా నెరవేరుతుంది.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



