Vivaah Pattu | ఈ చీర ఖరీదు అక్షరాలా రూ. 40 లక్షలు..! ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
Saree | మగువలకు ఎంతో అందాన్ని ఇచ్చే చీరకు భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యత ఉంది. పండుగలు, శుభకార్యాల్లో పడుచు పిల్లలు చీరల్లో మెరిసిపోతుంటారు. కుర్రకారు మనసును లాగేస్తుంటారు. కొందరు ఖరీదైన చీరలు ధరించి.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. అలాంటి ఖరీదైన చీరల సరసన ఈ చీర కూడా నిలిచింది. ఈ చీర ఖరీదు అక్షరాలా రూ. 40 లక్షలు. దీని ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
Vivaah Pattu | ప్రపంచ వస్త్రధారణలో చీర (Saree) స్థానం ఎప్పటికీ పై మెట్టే. ప్రపంచానికి చీర అందం పరిచయం చేసిన ఘనత మన దేశానికే దక్కుతుంది. అందంగా కనిపించేందుకు రకరకాల దుస్తులు ధరిస్తుంటాం. ఎన్ని రకాల దుస్తులు ధరించినా.. చీర ఇచ్చే అందం మరేవీ ఇవ్వలేవు. ఈవెంట్ ఏదైనా భారతీయ మహిళలు చీర కట్టులో మెరవాల్సిందే. పెళ్లిళ్లు, శుభకార్యాలు వచ్చాయంటే చాలు.. వేలల్లో, లక్షల్లో ఖర్చు పెట్టి పట్టుచీరలు కొంటుంటారు. మన చీరలకు గిన్నిస్ వరల్డ్ రికార్డులు కూడా ఉన్నాయి. చీర గొప్పతనం గురించి ఎన్నో పాటలు కూడా వచ్చాయి. అంత ప్రత్యేకత ఉంది మన చీరకు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను.. అని అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నా..
సాధారణంగా చీర ధరలు రూ.100 నుంచి కూడా ఉన్నాయి. మార్కెట్‌లో రూ.వేలు, రూ.లక్షల్లో చీరలు లభిస్తున్నాయి. అయితే, ఓ చీర మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చెన్నై సిల్క్ (Chennai Silks) కంజీవరం వారు ఓ పట్టు చీరను తయారు చేశారు. ఆ చీర ధరే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆ చీర ఖరీదుతో మధ్యతరగతి వాళ్లు సొంతింటి కళను నెరవేర్చుకోవచ్చు మరి. మరో విశేషం ఏంటంటే.. ఈ వివాహ్ పట్టు(Vivaah Pattu ) చీరకు గిన్నిస్ వరల్డ్ రికార్డు (Guinness World Records)లో కూడా చోటు దక్కింది. ఇంతకీ ఈ చీర ఖరీదు ఎంత అనుకుంటున్నారు..? అక్షరాలా రూ.40 లక్షలు. ప్రపంచంలో ఇప్పటి వరకూ అమ్ముడైన అత్యంత ఖరీదైన పట్టుచీరగా నిలిచింది.

కేవలం పట్టుదారాలే కాదు.. బంగారం, వెండి, వజ్రాలు కూడా..
బంగారు, వెండి, కెంపు ఈ చీరను చాలా ప్రత్యేకంగా రూపొందించారు. దీని తయారీలో వాడిన ముడిసరుకు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. దీని నేత కోసం కేవలం పట్టు దారాలు మాత్రమే కాకుండా బంగారం, వజ్రం, ప్లాటినం, వెండి, కెంపు, పచ్చ, నీలమణి, ముత్యాలు వంటి విలువైన రాళ్లను పొందుపరిచారు. 59.7 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని వాడారు. అలాగే 3 కిలోల వెండి, ప్లాటినం తీగలను కూడా ఉపయోగించారు. ఇక ఈ చీర మెరుపును పెంచడానికి వజ్రాలు, కెంపులు, పచ్చలు, ముత్యాలు, పగడాలు , నీలమణి వంటి నవరత్నాలను చీర అంతటా పొదిగారు.
4 వేల గంటలు.. 36 మంది కార్మికుల కృషి..
ఈ చీర తయారీ వెనుక 36 మంది కార్మికుల కృషి ఉంది. దాదాపు 4 వేలు గంటలు కష్టపడి దీన్ని తయారు చేశారు. ఇందులో 64 రంగుల షేడ్స్, పది ప్రత్యేకమైన డిజైన్లు ఉంటాయి. ఈ చీర బరువు వచ్చేసి దగ్గర దగ్గరగా ఎనిమిది కిలోగ్రాములు ఉంటుంది.
మరో విశేషం ఏంటంటే..
భారతీయ చేనేత కళాకారుల నైపుణ్యానికి ఈ ‘వివాహ పట్టు’ ఒక నిదర్శనం. ఇందులో ప్రఖ్యాత భారతీయ కళాకారుడు రాజా రవి వర్మ కళాఖండాలను పట్టు దారాలతో, నవరత్నాలతో మేళవించి రూపొందించారు. ఇందులో ప్రతి స్త్రీ ఒక ప్రాంతం లేదా కమ్యూనిటికి సంబంధించిన విభిన్న దుస్తులను ధరించి కనిపించడం మరింత విశేషం. నేటి ఫ్యాషన్ ప్రపంచంలో ఈ చీర ఓ అద్భుతంగా మిగిలిపోయింది. చెన్నై సిల్క్స్ నవంబర్ 26, 2007న ఈ చీరను తయారు చేసింది. దీన్ని తొలుత బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యకు గిఫ్ట్‌గా తీసుకున్నాడు. అయితే, త్వరలో వివాహ సీజన్ మొదలవుతుండటంతో ఇప్పుడు మరోసారి ఈ చీర తెరపైకి వచ్చింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





