Citrus Juice | ఖాళీ కడుపుతో సిట్రస్ జ్యూస్ తాగుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Citrus Juice | ఉదయం లేవగానే చాలామంది పండ్లను తినడం లేదా పండ్ల రసాలను తాగడం అలవాటుగా చేసుకుంటారు. కొందరు పండును పూర్తిగా తింటేనే ఎక్కువ ప్రయోజనం లభిస్తుందని భావిస్తారు. మరికొందరు జ్యూస్ రూపంలో తీసుకోవడాన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్ సమయంలో నారింజ, నిమ్మకాయ, మోసంబి వంటి సిట్రస్ పండ్లు లేదా వాటి జ్యూస్‌లు ఎక్కువగా తీసుకుంటుంటారు.
Citrus Juice | ఉదయం లేవగానే చాలామంది పండ్లను తినడం లేదా పండ్ల రసాలను తాగడం అలవాటుగా చేసుకుంటారు. కొందరు పండును పూర్తిగా తింటేనే ఎక్కువ ప్రయోజనం లభిస్తుందని భావిస్తారు. మరికొందరు జ్యూస్ రూపంలో తీసుకోవడాన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్ సమయంలో నారింజ, నిమ్మకాయ, మోసంబి వంటి సిట్రస్ పండ్లు లేదా వాటి జ్యూస్‌లు ఎక్కువగా తీసుకుంటుంటారు. సిట్రస్ పండ్లలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వాటిని ఎప్పుడు తీసుకుంటున్నామన్నది కూడా అంతే ముఖ్యమైన అంశం. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ కలిగినవారికి ఈ విషయం మరింత ప్రాధాన్యంగా మారుతుంది. దీంతో ఖాళీ కడుపుతో ఉదయం సిట్రస్ పండ్లు లేదా వాటి జ్యూస్‌లు తీసుకోవడం నిజంగా మంచిదేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయంపై గ్యాస్ట్రోఎంటరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ముకేష్ నందల్ వివరణ ఇచ్చారు. ఈ అలవాటు జీర్ణ సంబంధిత అసౌకర్యాలను కలిగిస్తుందా లేదా అనే అంశాన్ని ఆయన వివరించారు.
నేరుగా జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం..
పండ్లు ఆరోగ్యకరమైనవే కాబట్టి ఏ పరిస్థితిలోనైనా అవి మంచివేనని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి ఉదయం ఖాళీ కడుపుతో సిట్రస్ పండ్లు తీసుకున్న తర్వాత కొందరిలో జీర్ణ సంబంధిత సమస్యలు కనిపిస్తుంటాయి. డాక్టర్ ముకేష్ నందల్ ప్రకారం తన వద్దకు వచ్చే అనేక మంది రోగులు కడుపు ఉబ్బరం, ఛాతీలో మంట, పై పొత్తికడుపులో అసౌకర్యం వంటి సమస్యలను చెబుతుంటారు. ఈ లక్షణాలకు కారణం వారి ఉదయపు సిట్రస్ పండ్ల అలవాటే అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. నారింజ, నిమ్మకాయ, మోసంబి వంటి పండ్లు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ, వాటిలో సహజసిద్ధంగా ఆమ్లత్వం (ఆసిడిటీ) ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు ఈ సిట్రిక్ యాసిడ్ నేరుగా జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఆహారం కడుపులో లేకపోవడం వల్ల ఆమ్ల ప్రభావాన్ని తగ్గించే రక్షణ పొర ఉండదు. దీంతో జీర్ణాశయ గోడలు నేరుగా ఆమ్లంతో చర్యలోకి వచ్చి ఉబ్బరం, మంట, అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
కొందరికి మాత్రమే సమస్య..
అయితే అందరికీ ఈ సమస్య ఎదురు కాదు. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు సాధారణంగా సిట్రస్ పండ్లను బాగా తట్టుకోగలరు. అయితే ఇప్పటికే జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారిలో ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా తరచూ ఆసిడిటీ సమస్య ఉండేవారు, గ్యాస్ట్రిటిస్ నిర్ధారణ అయినవారు లేదా గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ)తో బాధపడేవారు ఉదయం మొదటగా సిట్రస్ పండ్లు తీసుకోవడాన్ని నివారించాలని డాక్టర్ సూచించారు. జీర్ణాశయ గోడల్లో ఇప్పటికే వాపు ఉన్నప్పుడు అధిక ఆమ్లత్వం కలిగిన సిట్రస్ పండ్లు ఆ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. దీంతో నొప్పి, అసౌకర్యం పెరిగే అవకాశం ఉంటుంది. కడుపులోని ఆమ్లం తిరిగి ఆహారనాళంలోకి రావడం వల్ల గుండెల్లో మంట, నోటిలో పుల్లటి రుచి వంటి లక్షణాలు కనిపిస్తాయి. సిట్రస్ పండ్లు ఈ సమస్యను మరింత పెంచుతాయి.
ఈ సూచనలు పాటించాలి..
సున్నితమైన జీర్ణవ్యవస్థ కలిగినవారిలో ఖాళీ కడుపుతో అధిక ఆమ్లత్వం కలిగిన పండ్లు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతిని ఉబ్బరం, అసహనం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డాక్టర్ ముకేష్ నందల్ సూచన ప్రకారం సిట్రస్ పండ్ల విషయంలో రెండు అంశాలు ముఖ్యంగా ఉంటాయి. సమయం, సందర్భం. వీటిని పరిమిత మోతాదులో, భోజనం చేసిన తర్వాత తీసుకోవడం మంచిదని ఆయన తెలిపారు. మధ్యాహ్న భోజనం తర్వాత లేదా సాయంత్రం స్నాక్‌గా తీసుకుంటే జీర్ణవ్యవస్థపై ఆమ్ల ప్రభావం తక్కువగా ఉంటుంది. జీర్ణాశయంలో అప్పటికే ఆహారం ఉండటం వల్ల అది ఒక రక్షణ పొరలా పనిచేసి ఆమ్లం నేరుగా పొట్ట గోడలను ప్రభావితం చేయకుండా కాపాడుతుంది. అయితే తరచూ ఆసిడిటీ, కడుపు ఉబ్బరం లేదా రిఫ్లక్స్ సమస్యలు ఎదురవుతున్నట్లయితే కొంతకాలం సిట్రస్ పండ్లు, సిట్రస్ జ్యూస్‌లను తగ్గించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం లేవగానే వాటిని తీసుకునే అలవాటు ఉంటే దానిని మార్చుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
సంబంధిత వార్తలు

Honey And Lemon Water | తేనె-నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని తాగితే ఏమవుతుంది ? నిజంగా ప్రయోజనాలున్నాయా ?
జూన్ 30, 2026

Lemon And Honey Water | నెల రోజుల పాటు నిమ్మరసం, తేనె నీళ్లను తాగితే శరీరంలో మార్పులు కనిపిస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
మే 25, 2026

Orange Juice | నారింజ పండ్ల జ్యూస్‌ను రోజూ తాగవచ్చా..? న్యూట్రిషనిస్టు సమాధానం..!
ఫిబ్రవరి 24, 2026
తాజావార్తలు
- ●Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది
- ●Auto Driver Monthly Income 75000 | ఆటోడ్రైవర్ నెల సంపాదన రూ.75 వేలు.. కూతురి చదువు కోసం భారీ ఖర్చు.. చివరకు మిగిలింది ఇదే..!
- ●National Awards | అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక - పురస్కారాలు స్వీకరించిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే!
- ●Open Top Double Decker Buses | హైదరాబాద్ రోడ్లపైకి ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు
- ●Capital Gains Tax Agricultural Land | భూమి అమ్మిన డబ్బును అన్నకు బహుమతిగా ఇచ్చిన చెల్లి.. దీని ట్యాక్స్ ఎవరు చెల్లించాలి?
- ●Bullet Train Technology | భూకంపం వస్తే బుల్లెట్ రైలు ఆటోమేటిక్ ఆగిపోతుంది!

Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది

Auto Driver Monthly Income 75000 | ఆటోడ్రైవర్ నెల సంపాదన రూ.75 వేలు.. కూతురి చదువు కోసం భారీ ఖర్చు.. చివరకు మిగిలింది ఇదే..!

National Awards | అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక - పురస్కారాలు స్వీకరించిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే!

Open Top Double Decker Buses | హైదరాబాద్ రోడ్లపైకి ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు



