Seeds For Weight Loss | అధిక బరువును తగ్గించే సూపర్ సీడ్స్.. వెల్లడించిన న్యూట్రిషనిస్టు..
Seeds For Weight Loss | అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాయామం చేయడం, డైట్ పాటించడం, యోగా వంటివి చేస్తారు. అయితే బరువు తగ్గే ప్రణాళికలో సరైన ఆహారాన్ని తీసుకోవడం కూడా ముఖ్యమే. పౌష్టికాహారాన్ని తీసుకోకపోతే బరువు తగ్గడం కష్టమవుతుంది.
Seeds For Weight Loss | అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాయామం చేయడం, డైట్ పాటించడం, యోగా వంటివి చేస్తారు. అయితే బరువు తగ్గే ప్రణాళికలో సరైన ఆహారాన్ని తీసుకోవడం కూడా ముఖ్యమే. పౌష్టికాహారాన్ని తీసుకోకపోతే బరువు తగ్గడం కష్టమవుతుంది. శరీర బరువును తగ్గించడంలో పలు రకాల పోషకాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రోజూ లభించేలా చూసుకోవాలి. ఇవి శరీర బరువును తగ్గిస్తాయి. బరువును నియంత్రణలో ఉంచుతాయి. ఈ క్రమంలోనే బరువు తగ్గేందుకు రోజూ పలు రకాల విత్తనాలను తినాలని న్యూట్రిషనిస్టు అమన్‌రావు సూచించారు. ఆయా విత్తనాలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.
చియా విత్తనాలు..
చియా విత్తనాలను రోజూ ఉదయం పరగడుపున లేదా బ్రేక్‌ఫాస్ట్‌లో తినవచ్చు. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె, మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ విత్తనాల్లో ఉండే ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు బీపీని తగ్గిస్తాయి. హృదయ సంబంధిత వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. చియా విత్తనాల్లో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. పొట్ట నిండుగా ఉన్న భావనను కలగజేస్తుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తుంది. దీని వల్ల ఆహారం తక్కువగా తింటారు. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. అలాగే షుగర్ లెవల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి. చియా విత్తనాలను ఒక రాత్రంతా లేదా కనీసం 30 నిమిషాల పాటు అయినా నీటిలో నానబెట్టి తినాల్సి ఉంటుంది.
గుమ్మడి విత్తనాలు..
బరువును తగ్గించడంలో గుమ్మడి విత్తనాలు కూడా మేలు చేస్తాయి. వీటిల్లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ విత్తనాల్లో ఉండే మెగ్నిషియం ఒత్తిడిని తగ్గించి నిద్ర నాణ్యతను పెంచుతుంది. గుమ్మడి విత్తనాలు పురుషులకు మేలు చేస్తాయి. ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. గుండె పోటు బారి నుంచి రక్షిస్తాయి. గుమ్మడి విత్తనాలను ఉదయం లేదా సాయంత్రం తినవచ్చు. రోజూ 1 లేదా 2 టేబుల్ స్పూన్ల మోతాదులో ఈ విత్తనాలను తినాల్సి ఉంటుంది. అలాగే అధిక బరువును తగ్గించేందుకు అవిసె గింజలు కూడా పనిచేస్తాయి. ఇవి హార్మోన్లను సమతుల్యంలో ఉంచుతాయి. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. అవిసె గింజల్లో ఉండే ఫైబర్ మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది. ఈ గింజలను కూడా ఉదయం లేదా సాయంత్రం తినవచ్చు. రోజుకు 1 టేబుల్ స్పూన్ మోతాదులో తినాలి.
పొద్దు తిరుగుడు విత్తనాలు..
పొద్దు తిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు సహాయం చేస్తాయి. చర్మం కాంతివంతంగా మారేలా దోహదపడతాయి. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. దీంతో ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. ఈ విత్తనాల్లో ఉండే సెలీనియం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని వాపులను తగ్గిస్తుంది. పొద్దు తిరుగుడు విత్తనాలను మధ్యాహ్నం సమయంలో తింటే మంచిది. రోజుకు ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తినవచ్చు. పెనంపై కాస్త వేయించి తింటే మేలు చేస్తాయి. ఆయా విత్తనాలను రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటే అధిక బరువు త్వరగా తగ్గుతారని న్యూట్రిషనిస్టు అమన్‌రావు తెలిపారు. ఈ విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అయితే నేరుగా తింటే కొందరికి వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి సమస్యలు రావచ్చు. అలాంటి వారు వీటిని పెనంపై వేయించి లేదా నీటిలో నానబెట్టి తినాలని సూచించారు.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



