త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Proteins Deficiency Symptoms | ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా..? మీకు ప్రోటీన్లు స‌రిగ్గా ల‌భించ‌డం లేద‌ని అర్థం..!

Proteins Deficiency Symptoms | మ‌న శ‌రీరానికి శ‌క్తిని అందించ‌డంలో ప్రోటీన్లు ఉపయోగ‌ప‌డతాయి. కండ‌రాల ప‌నితీరుకు, కండ‌రాల నిర్మాణానికి కూడా మ‌న‌కు ప్రోటీన్లు అవ‌స‌రం. ప్రోటీన్ల‌ను స్థూల పోష‌కాలు అంటారు. ఇవి మ‌న‌కు రోజూ అధిక మొత్తంలో కావ‌ల్సి ఉంటుంది. కానీ ప్ర‌స్తుతం చాలా మంది ప్రోటీన్లను స‌రిగ్గా తీసుకోవ‌డం లేదు.

S

Health | Published On Jan 13, 2026, 8.47 am IST

Proteins Deficiency Symptoms | ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా..? మీకు ప్రోటీన్లు స‌రిగ్గా ల‌భించ‌డం లేద‌ని అర్థం..!
Advertisement

Proteins Deficiency Symptoms | మ‌న శ‌రీరానికి శ‌క్తిని అందించ‌డంలో ప్రోటీన్లు ఉపయోగ‌ప‌డతాయి. కండ‌రాల ప‌నితీరుకు, కండ‌రాల నిర్మాణానికి కూడా మ‌న‌కు ప్రోటీన్లు అవ‌స‌రం. ప్రోటీన్ల‌ను స్థూల పోష‌కాలు అంటారు. ఇవి మ‌న‌కు రోజూ అధిక మొత్తంలో కావ‌ల్సి ఉంటుంది. కానీ ప్ర‌స్తుతం చాలా మంది ప్రోటీన్లను స‌రిగ్గా తీసుకోవ‌డం లేదు. దీని వ‌ల్ల శ‌రీరంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతోంది. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ప్రోటీన్ల‌ను స‌రిగ్గా తీసుకోక‌పోతే మ‌న శ‌రీరం మ‌న‌కు త‌ర‌చూ ప‌లు ల‌క్ష‌ణాలు, సంకేతాల‌ను తెలియజేస్తుంది. వాటిని గ‌మనించ‌డం ద్వారా మ‌న‌కు ప్రోటీన్లు స‌రిగ్గా ల‌భించ‌డం లేద‌న్న విష‌యాన్ని సుల‌భంగా అర్థం చేసుకోవచ్చు. ఈ క్ర‌మంలో ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను రోజూ తీసుకుంటే ఆయా ల‌క్షణాలు తగ్గిపోతాయి. అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు.

తీవ్ర‌మైన ఆక‌లి..

ప్రోటీన్ల‌ను స‌రిగ్గా తీసుకోక‌పోతే తిన్న వెంట‌నే మ‌ళ్లీ ఆక‌లి అవుతుంది. ఎంత ఆహారం తిన్నా కూడా మళ్లీ వెంట‌నే ఆక‌లి అవుతుంది అంటే డ‌యాబెటిస్ అయి ఉండాలి, లేదా ప్రోటీన్ల‌ను స‌రిగ్గా తిన‌క‌పోవ‌డం అన్నా అయి ఉండాలి. మీకు షుగర్ లేక‌పోతే తిన్న వెంట‌నే ఆక‌లి అవుతుందంటే దాన్ని క‌చ్చితంగా ప్రోటీన్ల లోపంగానే భావించాలి. ఈ క్ర‌మంలోనే ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను తింటే ఆ స‌మ‌స్య త‌గ్గుతుంది. అలాగే రోజూ చేసే చిన్న చిన్న ప‌నుల‌ను కూడా స‌రిగ్గా చేయ‌లేక‌పోతుంటే మీలో ప్రోటీన్ల లోపం ఉంద‌ని లేదా ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను స‌రిగ్గా తీసుకోవడం లేద‌ని అర్థం. ప్రోటీన్లు స‌రిగ్గా ల‌భించ‌క‌పోతే మ‌న‌కు రోజువారి ప‌నుల‌కు కావ‌ల్సిన శ‌క్తి ల‌భించ‌దు. దీంతో నీర‌సంగా మారుతారు. అల‌స‌టగా ఉంటుంది. ఏ ప‌నుల‌ను కూడా చేయ‌లేక‌పోతారు. క‌నుక ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నా ప్రోటీన్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాల్సి ఉంటుంది.

ఆల‌స్యంగా మాన‌డం..

వ్యాయామం లేదా శారీర‌క శ్ర‌మ చేస్తే కండ‌రాలు విచ్ఛిన్నం అవుతాయి. ఆ త‌రువాత వాటి స్థానంలో కొత్త కండ‌రాలు నిర్మాణ‌మ‌వుతాయి. అయితే ఆయా ప‌నుల‌ను చేసిన త‌రువాత కూడా చాలా సేప‌టి వ‌ర‌కు నొప్పులు అధికంగా ఉంటుంటే మీకు ప్రోటీన్లు స‌రిగ్గా ల‌భించ‌డం లేద‌ని అర్థం. అలాంటి స‌మ‌యంలో కూడా ప్రోటీన్ల‌ను అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా గాయాలు అయిన‌ప్పుడు లేదా దెబ్బ‌లు త‌గిలిన‌ప్పుడు చాలా నెమ్మ‌దిగా మానుతున్నా కూడా మీకు ప్రోటీన్లు స‌రిగ్గా ల‌భించ‌డం లేద‌ని గుర్తించాలి.

జుట్టు రాల‌డం..

ప్రోటీన్ల లోపం ఉన్న‌వారు లేదా ప్రోటీన్ల‌ను స‌రిగ్గా తీసుకోని వారు జుట్టు రాల‌డాన్ని ఎదుర్కొంటుంటారు. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు ప్రోటీన్లు ఎంతో దోహ‌దం చేస్తాయి. అవి స‌రిగ్గా ల‌భించ‌క‌పోతే జుట్టు బాగా రాలుతుంది. క‌నుక ఈ స‌మస్య ఉన్నవారు కూడా ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే త‌ర‌చూ గోర్లు చిట్లిపోయి బ‌ల‌హీనంగా మార‌డం, త‌ర‌చూ ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డం, తీవ్ర‌మైన దాహం ఉండ‌డం, నోటి దుర్వాస‌న అధికంగా రావ‌డం వంటివ‌న్నీ ప్రోటీన్ల లోపాన్ని తెలియజేస్తాయి. అలాంటి వారు ప్రోటీన్ల‌ను రోజూ త‌గిన మోతాదులో ల‌భించేలా చూసుకోవాలి. దీంతో ఆయా స‌మ‌స్య‌ల నుంచి సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

Advertisement

తాజావార్తలు

Advertisement