Digestive Health | తిన్న వెంటనే మల విసర్జన చేయాల్సి వస్తుందా..? కారణాలు చెప్పిన వైద్య నిపుణుడు..
Digestive Health | రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే అందరూ కాలకృత్యాలు తీర్చుకుంటారు. కానీ మలబద్దకం సమస్య ఉన్నవారికి మాత్రం మల విసర్జన అవదు. అయితే కొందరికి భోజనం చేసిన వెంటనే మల విసర్జన చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. పొట్టలో అసౌకర్యం కలిగి అలా జరుగుతుంది.
Digestive Health | రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే అందరూ కాలకృత్యాలు తీర్చుకుంటారు. కానీ మలబద్దకం సమస్య ఉన్నవారికి మాత్రం మల విసర్జన అవదు. అయితే కొందరికి భోజనం చేసిన వెంటనే మల విసర్జన చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. పొట్టలో అసౌకర్యం కలిగి అలా జరుగుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఇలా అయితే ఓకే. కానీ బయటకు వెళ్లినప్పుడు ఇలా జరిగితే తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక ఈ సమస్య కొందరికి తరచూ తలెత్తుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందనే విషయం చాలా మందికి అర్థం కాదు. కానీ దీని వెనుక ఉన్న పలు కారణాలు ఉంటాయని అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ జోసెఫ్ సల్హబ్ తెలిపారు. భోజనం చేసిన వెంటనే మల విసర్జన చేయాల్సి రావడం కొందరికి ఎదురయ్యే సమస్య అని, ఇది ఎందుకు వస్తుంది, దీన్ని తగ్గించుకునేందుకు ఏం చేయాలి.. అనే విషయాలను ఆయన తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో వివరించారు.
కారణాలు ఇవే..
భోజనం చేసిన వెంటనే మల విసర్జన చేయాల్సి రావడం వెనుక పలు కారణాలు ఉంటాయి. ఆహారాన్ని అతిగా తిన్నప్పుడు, కొవ్వు ఉండే ఆహారాలను ఎక్కువగా తిన్నా, టీ, కాఫీలను అధికంగా తాగినా, మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండే పానీయాలను సేవించినా, ఫుడ్ అలర్జీలు ఉన్నవారు, కారం, మసాలాలు అధికంగా తిన్నప్పుడు, ఆందోళన, ఒత్తిడి తీవ్రంగా ఉన్నవారు, పొగ తాగేవారు, పలు రకాల మెడిసిన్లను వాడేవారు తిన్న వెంటనే మల విసర్జన చేయాల్సి వస్తుందని, అయితే ఇది కేవలం కొన్ని సార్లు మాత్రమే జరుగుతుందని, అన్ని సార్లు జరగదని తెలిపారు. అలాగే జీర్ణాశయ సంబంధిత సమస్యలు ఉన్నవారిలోనూ ఇలా జరుగుతుందని డాక్టర్ జోసెఫ్ చెప్పారు. ముఖ్యంగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే సమస్య ఉంటే తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు.
ఇలా చేయాలి..
ఈ సమస్యను తగ్గించుకునేందుకు పలు సూచనలు పాటించాలని డాక్టర్ జోసెఫ్ తెలిపారు. ఆహారాన్ని తక్కువగా తినాలి. ఎప్పుడు తిన్నా పొట్టలో కొద్దిగా ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ ఆహారాన్ని ఒకేసారి తినడం కన్నా తక్కువ ఆహారాన్ని కొద్ది కొద్దిగా తినాలి. భోజనాన్ని ఎల్లప్పుడూ నెమ్మదిగా పూర్తి చేయాలి. ఆదరబాదరగా తినకూడదు. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారాలనే తినాలి. బయటి ఫుడ్‌ను తగ్గించాలి. రోజూ తినే ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఏయే ఆహారాలను తింటే అలా జరుగుతుందో గమనించాలి. వాటిని తినడం మానేయాలి. ఇక ఈ సూచనలు పాటించినా సమస్య తగ్గకపోతే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుందని చెప్పారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



