త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Isabgol | మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే ఔష‌ధం ఇది.. ఎలా తీసుకోవాలో చెబుతున్న వైద్య నిపుణులు..

Isabgol | నిత్యం మలబద్ధకం, పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఎదురైతే అవి రోజువారీ దిన‌చ‌ర్య‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అయితే ఈ సమస్యలకు ఇసబ్గోల్ (Psyllium Husk) చ‌క్క‌ని ప‌రిష్కారం ఇస్తుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

S

Health | Published On Jan 31, 2026, 8.55 am IST

Isabgol | మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే ఔష‌ధం ఇది.. ఎలా తీసుకోవాలో చెబుతున్న వైద్య నిపుణులు..
Advertisement

Isabgol | నిత్యం మలబద్ధకం, పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఎదురైతే అవి రోజువారీ దిన‌చ‌ర్య‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అయితే ఈ సమస్యలకు ఇసబ్గోల్ (Psyllium Husk) చ‌క్క‌ని ప‌రిష్కారం ఇస్తుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్లీనిగిల్స్ హాస్పిటల్‌ సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ జాన్వార్ ఇదే విష‌య‌మై మాట్లాడుతూ ఇసబ్గోల్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంద‌ని, మలం సాఫ్ట్‌గా మారి, మలవిసర్జన సులభంగా జరుగుతుంద‌ని అన్నారు. మలబద్ధకం త‌గ్గేందుకు ఇది చాలా మందికి ఉపయుక్తంగా ఉంటుంద‌ని తెలిపారు.

ఇసబ్గోల్ ఇలా ప‌నిచేస్తుంది..

ఇసబ్గోల్ పేగుల్లోకి వెళ్లిన తర్వాత నీటిని శోషించుకొని జెల్‌లా మారుతుంది. దీని వల్ల మలం పరిమాణం పెరిగి, సాఫ్ట్‌గా తయారవుతుంది. దీంతో ఒత్తిడి లేకుండా మలవిసర్జన జరుగుతుంది. పేగులకు ఎలాంటి ఇర్రిటేషన్ కలగకుండా సహజంగా మలవిసర్జనను ప్రోత్సహించడం దీని ప్రత్యేకత అని చెబుతున్నారు. అయితే మ‌ల‌బ‌ద్ద‌కానికి అనేక కార‌ణాలు ఉంటాయి. తగినంత ఫైబర్, నీరు తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడి, కొన్ని మందుల ప్రభావం, శారీరక చలనం లేకపోవడం, థైరాయిడ్‌, డ‌యాబెటిస్ వంటి దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌ల‌బ‌ద్ద‌కం వచ్చేందుకు కార‌ణం అవుతాయి. అయితే ఇసబ్గోల్ ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి మ‌ల‌బ‌ద్ద‌కం అయినా స‌రే త‌గ్గుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు.

ఎలా తీసుకోవాలి..?

ఇసబ్గోల్ ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే సహజంగా మలాన్ని సాఫ్ట్ గా మారుస్తుంది. దీంతో మ‌ల విస‌ర్జ‌న స‌మ‌యంలో నొప్పి, ఒత్తిడి తగ్గుతాయి. కాలక్రమేణా మలవిసర్జన స‌రిగ్గా ఉండేలా చేస్తుంది. గట్టి మలంతో వచ్చే పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. సరైన విధంగా తీసుకుంటే దీర్ఘకాలికంగా కూడా ఉపయోగించవచ్చ‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఒక గ్లాస్ నీరు లేదా పాలు తీసుకొని అందులో ఇసబ్గోల్ కలిపి వెంటనే తాగాలి. తరువాత మరో గ్లాస్ నీరు తాగడం మంచిది. సాధారణంగా రాత్రి సమయంలో, ఎక్కువ ద్రవాలతో తీసుకోవాలి. మోతాదు విషయంలో తప్పనిసరిగా వైద్యుడి సూచనలు పాటించాలి. స్వయంగా అధికంగా తీసుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వీరు తీసుకోకూడ‌దు..

అయితే ఇసబ్గోల్ లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది క‌నుక మింగడంలో ఇబ్బందిగా ఉన్నవారు, పేగుల్లో అడ్డంకులు ఉన్నవారు, తీవ్రమైన కడుపునొప్పి ఉన్నవారు, దీర్ఘకాలిక పేగుల సమస్యలు లేదా ఇతర మందులు వాడుతున్నవారు దీన్ని వైద్యుల స‌ల‌హా మేర‌కు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గేందుకు ఇసబ్గోల్ ను తీసుకోవ‌డంతోపాటు జీవ‌న‌శైలి ప‌రంగా ప‌లు మార్పులు కూడా చేసుకోవాలి. ముఖ్యంగా రోజుకు క‌నీసం 3 లీట‌ర్ల నీళ్ల‌ను తాగాల్సి ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. భోజన సమయాలు క్రమంగా పాటించాలి. రోజుకు కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఇలా జీవ‌న‌శైలిని పాటిస్తూ ఇసబ్గోల్ ను తీసుకుంటే మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌కు శాశ్వ‌తంగా చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement