త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

వైన్ అంటే కేవలం డ్రింక్ అనుకుంటివా… అదో వైబ్! వైన్ సీక్రెట్ హిస్టరీ ఇదే!

"వైన్ బాటిల్ ఓపెన్ చేయడం అంటే కేవలం పార్టీ స్టార్ట్ చేయడం కాదు... ఒక కొత్త ఎమోషన్‌ను అన్‌లాక్ చేయడం! కలర్ మారితే టేస్ట్ మారడమే కాదు, మీ మైండ్ సెట్ కూడా మారిపోతుంది. రంగును బట్టి, రుచిని బట్టి వైన్లలో ఉన్న ఆ ‘బిగ్ 5’ రకాలు ఏంటో మీకు తెలుసా?"

S

Lifestyle | Published On Jul 31, 2026, 8.14 pm IST

వైన్ అంటే కేవలం డ్రింక్ అనుకుంటివా… అదో వైబ్! వైన్ సీక్రెట్ హిస్టరీ ఇదే!

సంక్షిప్త సారాంశం

వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వైన్ తయారీ అవకాశాలు, 'వైన్ టూరిజం' అభివృద్ధిని పరిశీలిస్తున్నట్లు అబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇటీవల అమెరికాలోని 'స్టోన్ టవర్ వైనరీ'ని సందర్శించిన ఆయన, తెలంగాణలోనూ అలాంటి వైనరీలు ఏర్పాటు చేసే ప్లాన్స్ ఉన్నాయని ప్రాసెస్ అధ్యయనం చేశారు. త్వరలోనే మన వికారాబాద్‌లో వికసించే ద్రాక్ష తోటలు, వైన్ యార్డ్స్ మధ్య వీకెండ్ చిల్ అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నమాట!

Advertisement

                                                    చిప్స్ & చిల్ కాదు... వైన్ & వైబ్! మీకు తెలియని వైన్ వింతలు!

 

సిప్ చేయడం ఒక ఆర్ట్... దాని వెనుక ఉన్న హిస్టరీ ఒక అడ్వెంచర్! ఈ రోజుల్లో వైన్ అంటే కేవలం డిన్నర్ టేబుల్ మీద ఉండే ఒక డ్రింక్ మాత్రమే కాదు. అదొక మోడ్రన్ లైఫ్‌స్టైల్, కల్చర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ... ఒక పర్ఫెక్ట్ 'వైబ్'! ఈ గ్లోబల్ వైన్ వైబ్ ఇప్పుడు మన వద్దకూ రాబోతోంది. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వైన్ తయారీ అవకాశాలు, 'వైన్ టూరిజం' అభివృద్ధిని పరిశీలిస్తున్నట్లు అబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇటీవల అమెరికాలోని 'స్టోన్ టవర్ వైనరీ'ని సందర్శించిన ఆయన, తెలంగాణలోనూ అలాంటి వైనరీలు ఏర్పాటు చేసే ప్లాన్స్ ఉన్నాయని ప్రాసెస్ అధ్యయనం చేశారు. మరి మన దగ్గరకు వస్తున్న ఆ వైన్ కథేంటి? గ్లాసులో కనిపించే ద్రాక్ష రసం వెనుక ఉన్న శతాబ్దాల రహస్యాలేంటో ఒకసారి లుక్కేద్దాం!

క్రీ.పూ. 6000 నుంచే వైన్‌పై ఈ క్రేజ్!

 

వైన్ ట్రెండ్ ఇవాళ నిన్నటిది కాదు! పురావస్తు పరిశోధనల ప్రకారం ప్రపంచంలోనే మొట్టమొదటి వైన్ ఆనవాళ్లు జార్జియా (Georgia) దేశంలో క్రీస్తు పూర్వం 6000-5800 ప్రాంతంలోనే దొరికాయి. ఆ తర్వాత ఇరాన్, గ్రీస్, రోమన్ సామ్రాజ్యాల ద్వారా ప్రపంచమంతటా విస్తరించింది.

వైన్ తయారీ వెనుక అసలు సిసలు మ్యాజిక్

 

ఫర్మెంటేషన్ (Fermentation) అనేది ముఖ్యమైన ప్రక్రియ. ద్రాక్ష రసంలో ఉండే సహజమైన చక్కెరలను ఈస్ట్ (Yeast) సహాయంతో ఆల్కహాల్‌గా మారుస్తారు. ఆ తర్వాత ఓక్ బ్యారెల్‌లో నిల్వ అత్యంత ప్రధానమైనది. వైన్ టేస్ట్, కలర్, సువాసనలన్నీ ద్రాక్ష తొక్కలు, వాడే ద్రాక్ష వెరైటీతో పాటు నిల్వ చేసే ఓక్ బ్యారెల్స్ (Oak Barrels) పై ఆధారపడి ఉంటాయి. ఇక వైన్‌లో కీలకమైనది నిల్వ చేయడం. కొన్ని రకాల వైన్లు బాటిలింగ్ చేశాక ఎంత పాతబడితే అంత నాణ్యత, రుచి పెరుగుతాయి.

మీ వైబ్ ఏంటి? – వైన్లలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా?

 

రెడ్ వైన్ (Red Wine): డార్క్ కలర్ ద్రాక్షను తొక్కలతో సహా పులియబెడతారు. ఇందులో ఉండే 'టానిన్లు' నాలుకపై ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. ద్రాక్ష తొక్కల్లో ఉండే 'రెస్వెరాట్రోల్' అనే హెల్తీ యాంటీఆక్సిడెంట్ దీనిలోనే లభిస్తుంది.

వైట్ వైన్ (White Wine): గ్రీన్ ద్రాక్ష లేదా తొక్కలు తీసిన నల్ల ద్రాక్షతో చేస్తారు. ఇది రీఫ్రెషింగ్, అసిడిక్ ఫ్లేవర్‌తో చాలా లైట్‌గా ఉంటుంది.

రోజే వైన్ (Rosé Wine): నల్లటి ద్రాక్ష తొక్కలను కేవలం కొన్ని గంటల పాటు మాత్రమే రసంలో ఉంచడం వల్ల దీనికి లేత గులాబీ (Pink) రంగు వస్తుంది. చూడటానికి, తాగడానికి చాలా క్లాసీ!

స్పార్క్లింగ్ వైన్ (Sparkling Wine): సీసాలో రెండోసారి పులియబెట్టడం ద్వారా సహజంగా కార్బన్ డై ఆక్సైడ్ బుడగలు (Fizz) వస్తాయి. పార్టీ సెలబ్రేషన్స్‌కు ఇది పర్ఫెక్ట్!

ఫోర్టిఫైడ్ & డిజర్ట్ వైన్: బ్రాందీ వంటి డిస్టిల్డ్ ఆల్కహాల్ కలపడం వల్ల ఇందులో ఆల్కహాల్ (15%-22% ABV), తీపి శాతం కాస్త ఎక్కువగా ఉంటాయి (ఉదా: పోర్ట్ వైన్, షెర్రీ).

ప్రపంచవ్యాప్తంగా వైన్ ప్రియులను అలరిస్తున్న ప్రముఖ ద్రాక్ష రకాలు

 

 

వైన్ తయారీలో ద్రాక్ష రకం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి రకానికి దానికంటూ ఒక ప్రత్యేకమైన రుచి, వాసన మరియు రంగు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా సాగవుతున్న అనేక ద్రాక్ష రకాలలో, కొన్ని రకాలు అత్యంత ప్రజాదరణ పొందాయి మరియు గ్లోబల్ మార్కెట్‌లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. అటువంటి ఆరు ప్రముఖ ద్రాక్ష రకాల గురించి ఇక్కడ తెలుసుకుందాం:

కాబర్నె సోవిన్యాన్ (Cabernet Sauvignon): ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ రెడ్ వైన్ గ్రేప్. ఇది ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో విస్తారంగా సాగవుతుంది. దీనితో తయారు చేసిన వైన్ ఫుల్-బాడీ మరియు బోల్డ్ టేస్ట్‌తో ఉంటుంది. నల్లటి బెర్రీల రుచి మరియు గట్టి టానిన్లతో కూడిన ఈ వైన్ చాలా కాలం నిల్వ ఉంటుంది.

షార్డోనే (Chardonnay): ఇది వైట్ వైన్స్‌కి రాణి లాంటిది. ఇది ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చిలీ వంటి దేశాలలో సాగవుతుంది. బటర్, వెనిల్లా మరియు పండిన యాపిల్ రుచులతో చాలా స్మూత్‌గా ఉంటుంది. ఓక్ బ్యారెల్స్‌లో నిల్వ చేయడం (Aging) వల్ల దీనికి మరింత లోతైన మరియు సంక్లిష్టమైన రుచి వస్తుంది.

పినో నార్ (Pinot Noir): ఇది చాలా సున్నితమైన మరియు నాణ్యమైన రెడ్ వైన్ ద్రాక్ష. ఫ్రాన్స్, అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాలలో దీని సాగు ఎక్కువగా ఉంటుంది. చెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్ప్‌బెర్రీ వంటి ఫలాల రుచులతో తేలికగా ఉంటుంది. టానిన్లు తక్కువగా ఉండటం వల్ల ఇది తాగడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

సోవిన్యాన్ బ్లాంక్ (Sauvignon Blanc): ఇది అత్యంత క్రిస్పీగా మరియు రీఫ్రెషింగ్‌గా ఉండే వైట్ వైన్ ద్రాక్ష. ఫ్రాన్స్, న్యూజిలాండ్, చిలీ, దక్షాఫ్రికా వంటి దేశాలలో ఇది సాగవుతుంది. పచ్చి గడ్డి, సిట్రస్ ఫలాలు, బెల్ పెప్పర్ వంటి రుచులతో ఉంటుంది. దీనితో తయారు చేసిన వైన్ యువతలో చాలా ప్రజాదరణ పొందింది.

మర్లో (Merlot): ఇది తాగడానికి చాలా సాఫ్ట్‌గా మరియు తీయగా ఉండే రెడ్ వైన్ ద్రాక్ష. ఫ్రాన్స్, అమెరికా, చిలీ, ఇటలీ వంటి దేశాలలో ఇది సాగవుతుంది. ప్లమ్ పండ్లు, బ్లాక్ చెర్రీ, చాక్లేట్, వనిల్లా వంటి రుచులతో ఉంటుంది. టానిన్లు తక్కువగా ఉండటం వల్ల ఇది వైన్ కొత్తగా ట్రై చేసే బిగినర్స్‌కు బెస్ట్ ఆప్షన్.

సిరా / షిరాజ్ (Syrah / Shiraz): ఇది ఫ్రాన్స్ మరియు ఆస్ట్రేలియాలో అత్యంత ప్రజాదరణ పొందిన రెడ్ వైన్ ద్రాక్ష. దీనితో తయారు చేసిన వైన్ స్మోకీ, బ్లాక్ పెప్పర్, బెర్రీల రుచులతో ఉంటుంది. ఇది చాలా గాఢమైన మరియు సంక్లిష్టమైన రుచితో ఉంటుంది.

ఈ ఆరు ద్రాక్ష రకాలు ప్రపంచవ్యాప్తంగా వైన్ మార్కెట్‌ను ఏలుతున్నాయి. ప్రతి రకానికి దానికంటూ ఒక ప్రత్యేకమైన రుచి మరియు వాసన ఉండటం వల్ల, వైన్ ప్రియులు తమ ఇష్టానికి అనుగుణంగా వైన్‌ను ఎంచుకోవచ్చు. త్వరలోనే మన వికారాబాద్‌లో వికసించే ద్రాక్ష తోటలు, వైన్ యార్డ్స్ మధ్య వీకెండ్ చిల్ అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నమాట! వైన్ ప్రియులు ఇంకెందుకు ఆలస్యం, లోకల్ ఫ్లేవర్ తెలంగాణ వైన్ కోసం ఎదురు చూస్తూనే ఉండండి!

Advertisement
Advertisement