Bad Breath | మీ నోరు తరచూ దుర్వాసన వస్తుందా..? జాగ్రత్త.. అది క్యాన్సర్ కావచ్చు..!
Bad Breath | నోటి దుర్వాసన సమస్యను చాలా మంది ఎదుర్కొంటుంటారు. ఈ సమస్య ఉంటే నలుగురిలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నోరు తెరిచి మాట్లాడడం లేదా నవ్వడం కష్టంగా ఉంటుంది. నోట్లో నుంచి వచ్చే దుర్వాసన ఇతరులకు తెలిస్తే వారు మన గురించి ఏమనుకుంటారో అని చాలా మంది భావిస్తుంటారు.
Bad Breath | నోటి దుర్వాసన సమస్యను చాలా మంది ఎదుర్కొంటుంటారు. ఈ సమస్య ఉంటే నలుగురిలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నోరు తెరిచి మాట్లాడడం లేదా నవ్వడం కష్టంగా ఉంటుంది. నోట్లో నుంచి వచ్చే దుర్వాసన ఇతరులకు తెలిస్తే వారు మన గురించి ఏమనుకుంటారో అని చాలా మంది భావిస్తుంటారు. కనుకనే నోటి దుర్వాసన ఉన్నవారు నలుగురిలో మాట్లాడలేకపోతుంటారు. అలాగే నలుగురిలో కలిసేందుకు కూడా ఇష్టపడరు. అయితే నోటి దుర్వాసన వచ్చేందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ ఇది శాశ్వత సమస్య కాదు. తాత్కాలిక సమస్యే. పలు రకాల జాగ్రత్తలను తీసుకుంటే ఈ సమస్య సులభంగా తగ్గిపోతుంది. కానీ నోటి దుర్వాసన తరచూ వస్తుందంటే అది క్యాన్సర్ అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పెద్ద పేగు క్యాన్సర్‌గా..
నోటి దుర్వాసన ఉన్నవారి నోట్లో ఫ్యుసోబాక్టీరియం న్యూక్లియాటమ్ అనే బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. ఇది దీర్ఘకాలంలో నోట్లో పాచి, దంతాలు, చిగుళ్ల ఇన్‌ఫెక్షన్‌లను కలిగిస్తుంది. అంతేకాకుండా ఈ బ్యాక్టీరియా శరీరంలో కింది భాగం వైపు కూడా చేరుతుంది. జీర్ణాశయం నుంచి పెద్దపేగు వరకు ప్రయాణిస్తుంది. అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకుని ఆ బ్యాక్టీరియా ఆ భాగంలో వృద్ధి చెందుతుంది. దీంతో దీర్ఘకాలంలో క్యాన్సర్ కణాలు ఏర్పడి అది క్యాన్సర్‌గా మారుతుంది. ఈ క్రమంలోనే అది పెద్దపేగు క్యాన్సర్‌గా బయట పడుతుంది. ఇలా నోట్లో ఉండే దుర్వాసన వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగే పెద్ద పేగు క్యాన్సర్ ఉన్నవారిలోనూ నోటి దుర్వాసన తరచూ వస్తుందని అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ జోసెఫ్ సాల్‌హబ్ వెల్లడించారు. కనుక తరచూ నోటి దుర్వాసన సమస్య వస్తుందంటే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, వెంటనే ఆ సమస్యను తగ్గించుకునే ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు.
ఇలా చేయాలి..
నోటి దుర్వాసన సమస్య వచ్చేందుకు పలు కారణాలు ఉంటాయి. దంతాలు లేదా చిగుళ్లు, నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, నాలుకపై బ్యాక్టీరియా అధికంగా చేరడం, జీర్ణ సమస్యలు ఉండడం, పలు రకాల మందులను వాడడం వంటి కారణాల వల్ల నోటి దుర్వాసన వస్తుంది. నోటి దుర్వాసన ఉన్నవారు దంతాలు, చిగుళ్లను సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. నాలుకపై ఉండే పాచి తొలగిపోయేలా టంగ్ క్లీనర్ వాడాలి. తరచూ ఫ్లాసింగ్ చేసుకోవాలి. రాత్రి పూట కూడా దంతాలను తోముకోవాలి. అలాగే చక్కెర, శీతలపానీయాలు, డ్రింక్స్ ను తీసుకోకూడదు. పుదీనా, సోంపు గింజలు, లవంగాలు, యాలకులు, పైనాపిల్, యాపిల్ పండ్లు, కివి, బొప్పాయి, దానిమ్మ వంటి పండ్లను తీసుకోవాలి. గ్రీన్ టీ సేవించాలి. ఇలా జాగ్రత్తలను పాటిస్తే నోటి దుర్వాసన నుంచి బయట పడవచ్చని, దీంతో క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చని డాక్టర్ జోసెఫ్ తెలిపారు.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



