త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mangoes | కార్బైడ్‌తో మ‌గ్గించిన మామిడి పండ్ల‌ను తింటే ప్ర‌మాద‌మే.. వాటిని ఇలా గుర్తించండి..

Mangoes | వేస‌వి కాలం కావ‌డంతో ఈ సీజ‌న్‌లో మామిడి పండ్లు ల‌భిస్తాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. నోరూరించే వివిధ ర‌కాల మామిడి పండ్లు ఈ సీజ‌న్‌లో అధికంగా అందుబాటులో ఉంటాయి. ఎవ‌రికి తోచిన విధంగా వారు త‌మ అభిరుచుల‌ను బ‌ట్టి వివిధ ర‌కాల మామిడి పండ్ల‌ను తింటుంటారు.

S

Lifestyle | Published On Apr 7, 2026, 1.01 pm IST

Mangoes | కార్బైడ్‌తో మ‌గ్గించిన మామిడి పండ్ల‌ను తింటే ప్ర‌మాద‌మే.. వాటిని ఇలా గుర్తించండి..
Advertisement

Mangoes | వేస‌వి కాలం కావ‌డంతో ఈ సీజ‌న్‌లో మామిడి పండ్లు ల‌భిస్తాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. నోరూరించే వివిధ ర‌కాల మామిడి పండ్లు ఈ సీజ‌న్‌లో అధికంగా అందుబాటులో ఉంటాయి. ఎవ‌రికి తోచిన విధంగా వారు త‌మ అభిరుచుల‌ను బ‌ట్టి వివిధ ర‌కాల మామిడి పండ్ల‌ను తింటుంటారు. అయితే మార్కెట్‌లో చూపుల‌కు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించే పండ్ల‌ను చాలా మంది వెంట‌నే కొనుగోలు చేస్తుంటారు. కానీ అవి కొనేముందు ఒక‌సారి ఆలోచించాలి. ఆ మామిడి పండ్ల‌ను స‌హ‌జ‌సిద్ధంగానే పండించారా, రసాయ‌నాలు వాడి పండించారా.. అన్న విష‌యాన్ని నిర్దార‌ణ చేసుకోవాలి. లేదంటే ఆరోగ్యానికి ప్ర‌మాదాన్ని కొని తెచ్చుకున్న వారవుతారు. కొంద‌రు వ్యాపారులు లాభాల కోసం మామిడి పండ్ల‌ను కార్బైడ్ ఉప‌యోగించి కృత్రిమంగా పండించి వాటిని విక్ర‌యిస్తుంటారు. అలాంటి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్ర‌భావం ప‌డుతుంది. మామిడి పండ్ల‌ను కృత్రిమంగా పండించారా, స‌హ‌జ‌సిద్ధంగా పండించారా.. అన్న విష‌యాన్ని తెలుసుకునేందుకు ప‌లు సూచ‌న‌లు ప‌నిచేస్తాయి.

తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం..

స‌హ‌జ‌సిద్ధంగా పండిన మామిడి పండ్లు ప‌సుపు, ఆకుప‌చ్చ రంగులు క‌లిసిన మిశ్ర‌మంలో ఉంటాయి. పండ్ల‌పై ప‌సుపు ప‌చ్చ‌, ఆకుప‌చ్చ రంగుల్లో మ‌చ్చ‌లుగా ఉంటాయి. ర‌సాయ‌నాల‌తో మ‌గ్గబెట్టిన‌వి ప‌సుపు పచ్చ‌గా ఒకే రంగులో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి. ర‌సాయ‌నాల‌తో పండిస్తే పండు లోప‌లి భాగం ప‌చ్చిగానే ఉంటుంది. అలాంటి పండ్ల‌ను తింటే శ‌రీరం విష‌తుల్యంగా మారుతుంది. ఇలాంటి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల గొంతులో నొప్పి, క‌డుపులో మంట‌, వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం, విరేచ‌నాలు వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. దీర్ఘ‌కాలంలో నాడీ వ్య‌వ‌స్థ దెబ్బ తిన‌డం, శ్వాస‌కోశ ఇబ్బందులు తలెత్తే ప్ర‌మాదం ఉంటుంది. అర‌టి, మామిడి, దానిమ్మ వంటి పండ్ల‌ను స‌హ‌జంగా పండిస్తే రుచితోపాటు శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు స‌మ‌పాళ్ల‌లో అందుతాయి. క్రృతిమంగా మ‌గ్గించిన మామిడి పండ్ల‌ను తింటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. పోష‌కాలు కూడా స‌రిగ్గా ల‌భించ‌వు.

బ‌కెట్ నీటిలో వేస్తే..

వేస‌వి సీజ‌న్ దాదాపుగా 3 నెల‌ల పాటు ఉంటుంది. అయితే ఇంత త‌క్కువ స‌మ‌యంలో భారీ ఎత్తున మామిడి పండ్ల‌ను విక్ర‌యించాలంటే వాటిని స‌హ‌జ‌సిద్ధంగా పండించ‌డం కుద‌ర‌దు. అలా పండిస్తే స‌మ‌యం ప‌డుతుంది క‌నుక పండ్ల‌ను త్వ‌ర‌గా విక్ర‌యించ‌లేరు. అందువ‌ల్ల వ్యాపారులు వాటిని కార్బైడ్ వంటి ర‌సాయ‌నాల‌తో మ‌గ్గించి త్వ‌ర‌గా మార్కెట్ల‌కు త‌ర‌లించి విక్ర‌యిస్తుంటారు. ఇక మామిడి పండ్ల‌ను కార్బైడ్‌తో పండిస్తే వాటిని బ‌కెట్ నీటిలో వేసిన‌ప్పుడు పైకి తేలుతాయి. అదే స‌హ‌జ‌సిద్ధంగా పండిన పండ్లు అయితే బ‌కెట్ నీళ్ల‌లో వేస్తే వెంట‌నే మునిగిపోతాయి. ర‌సాయ‌నాలు వాడి మ‌గ్గించిన మామిడి పండ్ల‌లో లోప‌లి భాగంలో ఎక్కువ‌గా వాయువులు ఉత్ప‌న్న‌మ‌వుతాయి. అందుక‌నే ఆ పండ్ల‌ను నీళ్ల‌లో వేస్తే తేలుతాయి. అలాగే స‌హ‌జంగా పండిన పండ్ల‌ను ముక్కు ద‌గ్గ‌ర పెట్టుకుంటే క‌మ్మ‌ని వాస‌న వ‌స్తాయి. ర‌సాయ‌నాలు వాడితే పండు వాస‌న స‌రిగ్గా రాదు. ఇలా ఆ పండ్ల‌ను గుర్తించ‌వ‌చ్చు.

Advertisement
Advertisement