త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Brown Rice | బ్రౌన్ రైస్‌ను తింటే ఏమేం లాభాలు క‌లుగుతాయి..? ఇందులో ఏయే పోష‌కాలు ఉంటాయి..?

Brown Rice | కేవ‌లం భార‌త్ మాత్ర‌మే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌కు బియ్యం ప్ర‌ధాన ఆహారంగా ఉంది. ద‌క్షిణ భార‌త దేశంలో బియ్యాన్ని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. ప‌లు ఆసియా దేశాల వాసులు కూడా రైస్‌తో చేసిన వంట‌కాల‌ను ఎక్కువ‌గా తింటుంటారు. దీన్ని వండడం చాలా తేలిక‌. సుల‌భంగా జీర్ణ‌మ‌వుతుంది.

S

Lifestyle | Published On Dec 24, 2025, 3.46 pm IST

Brown Rice | బ్రౌన్ రైస్‌ను తింటే ఏమేం లాభాలు క‌లుగుతాయి..? ఇందులో ఏయే పోష‌కాలు ఉంటాయి..?
Advertisement

Brown Rice | కేవ‌లం భార‌త్ మాత్ర‌మే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌కు బియ్యం ప్ర‌ధాన ఆహారంగా ఉంది. ద‌క్షిణ భార‌త దేశంలో బియ్యాన్ని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. ప‌లు ఆసియా దేశాల వాసులు కూడా రైస్‌తో చేసిన వంట‌కాల‌ను ఎక్కువ‌గా తింటుంటారు. దీన్ని వండడం చాలా తేలిక‌. సుల‌భంగా జీర్ణ‌మ‌వుతుంది. శ‌రీరానికి తక్ష‌ణ శ‌క్తిని అందిస్తుంది. క‌నుక పేద‌, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు కూడా బియ్యాన్ని ఎక్కువ‌గా తింటుంటారు. అయితే రైస్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం ఆరోగ్యం ప‌ట్ల చాలా మందికి శ్ర‌ద్ధ పెర‌గ‌డంతో బ్రౌన్ రైస్ తినాల‌ని చూస్తున్నారు. బ్రౌన్ రైస్‌ను తిన‌డం వ‌ల్ల ఎంతో మేలు క‌లుగుతుంద‌ని, అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని చాలా మంది బ్రౌన్ రైస్‌ను తినేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. అయితే బ్రౌన్ రైస్ మ‌న శ‌రీరానికి ఎలా మేలు చేస్తుంది..? దీంట్లో అస‌లు ఏమేం పోష‌కాలు ఉంటాయి..? అన్న వివ‌రాల‌ను న్యూయార్క్‌కు చెందిన ప్ర‌ముఖ డైటిషియ‌న్ ఆర్‌డీ నాట‌లి రిజ్జో వెల్ల‌డించారు.

బ్రౌన్ రైస్‌లో ఉండే పోష‌కాలు..

సాధార‌ణ రైస్ క‌న్నా బ్రౌన్ రైస్‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. బ్రౌన్ రైస్‌లో కార్బొహైడ్రేట్ల‌తోపాటు ప్రోటీన్లు, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్లు, 15 ర‌కాల‌కు పైగా విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఇవి మ‌న‌కు కావ‌ల్సిన రోజువారి పోష‌ణ‌ను అందిస్తాయి. మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. ఒక క‌ప్పు ఉడ‌క‌బెట్టిన బ్రౌన్ రైస్‌లో సుమారుగా 248 క్యాల‌రీల శ‌క్తి ఉంటుంది. 5.5 గ్రాముల ప్రోటీన్లు, 2 గ్రాముల కొవ్వులు, 52 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 3 గ్రాముల ఫైబ‌ర్ ఉంటాయి. ఒక క‌ప్పు బ్రౌన్ రైస్‌ను తింటే మ‌న‌కు రోజుకు కావ‌ల్సిన ఫైబ‌ర్‌లో దాదాపుగా 11 శాతం వ‌ర‌కు ల‌భిస్తుంది. ఇలా అన్ని ర‌కాల పోష‌కాలు ఉంటాయి క‌నుక సాధార‌ణ రైస్ క‌న్నా మ‌న‌కు బ్రౌన్ రైస్ ఎక్కువ మేలు చేస్తుంది.

డ‌యాబెటిస్‌కు, జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి..

బ్రౌన్ రైస్‌లో ఉండే ఫైబ‌ర్ కార‌ణంగా జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగుప‌డి ఆరోగ్యంగా ఉంటుంది. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అధికంగా ఆహారం తిన‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. దీంతో బ‌రువు త‌గ్గ‌డం తేలిక‌వుతుంది. బ్రౌన్ రైస్‌లో ఉండే ప్రోటీన్లు కండ‌రాల నిర్మాణానికి స‌హాయం చేస్తాయి. శ‌రీరానికి శ‌క్తి ల‌భించేలా చూస్తాయి. దీంతో యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా ప‌నిచేస్తారు. శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. నీర‌సం, అల‌స‌ట త‌గ్గుతాయి. బ‌ద్ద‌కం పోతుంది. టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారికి బ్రౌన్ రైస్ ఎంతో మేలు చేస్తుంది. దీని వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. బ్రౌన్ రైస్‌లో ఉండే ఫైటో కెమిక‌ల్స్‌, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గేలా చేస్తాయి. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

ఎప్పుడు తినాలి..?

బ్రౌన్ రైస్‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది. ఇది మ‌న‌ల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఈ రైస్‌ను రాత్రి పూట తిన‌కూడ‌దు. ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది క‌నుక జీర్ణం అయ్యేందుకు స‌మ‌యం ప‌డుతుంది. దీని వ‌ల్ల గ్యాస్‌, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు ఉంటాయి. రాత్రి పూట నిద్ర‌కు ఆటంకం కూడా ఏర్ప‌డ‌వ‌చ్చు. క‌నుక బ్రౌన్ రైస్‌ను మ‌ధ్యాహ్నం తినాలి. బ్రౌన్ రైస్‌ను ఇలా తింటే ఎన్నో విధాలుగా ప్రయోజ‌నాలు ఉంటాయ‌ని డైటిషియ‌న్ నాట‌లి తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement