Oats | రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్‌ను తినాల్సిందే.. ఇవి అందించే లాభాలు అన్నీ ఇన్నీ కావు..
Oats | ప్రతి ఒక్కరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కచ్చితంగా తీసుకోవాలని అందరికీ తెలిసిందే. ఎందుకంటే.. క్రితం రోజు రాత్రి ఆహారం తీసుకున్న తరువాత చాలా సమయం పొట్ట ఖాళీగా ఉంటుంది. కనుక ఆ స్థితిలో ఉన్న శరీరానికి శక్తి కావాలంటే ఎవరైనా కచ్చితంగా ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి.
Oats | ప్రతి ఒక్కరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కచ్చితంగా తీసుకోవాలని అందరికీ తెలిసిందే. ఎందుకంటే.. క్రితం రోజు రాత్రి ఆహారం తీసుకున్న తరువాత చాలా సమయం పొట్ట ఖాళీగా ఉంటుంది. కనుక ఆ స్థితిలో ఉన్న శరీరానికి శక్తి కావాలంటే ఎవరైనా కచ్చితంగా ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. అయితే నేటి తరుణంలో చాలా మంది ఉదయం పూట కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు, ఆయిల్ ఫుడ్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటున్నారు. కానీ అవి గుండెకు కీడు చేస్తాయని గ్రహించలేకపోతున్నారు. దీంతో గుండె జబ్బుల బారిన పడుతున్నారు. కనుక ఉదయం తీసుకునే ఆహారం మన గుండెకు మేలు చేసే విధంగా ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రోజూ ఉదయం ఓట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు మ్యాక్స్ హెల్త్ కేర్ హాస్పిటల్‌కు చెందిన న్యూట్రిషనల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మంజరి చంద్ర ఓట్స్ ప్రాముఖ్యత గురించి వివరించారు.
రక్త సరఫరాకు..
రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్ మీల్ తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎగ్జిమా, దద్దుర్లు తగ్గుతాయి. ఓట్స్‌లో ఉండే పలు ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ చర్మానికి మేలు చేస్తాయి. వాటిల్లో ఉండే జింక్ చర్మాన్ని క్లీన్ చేస్తుంది. అందులో ఉండే టాక్సిన్లను, ఇతర విష పదార్థాలను బయటకు పంపుతుంది. అలాగే చర్మానికి కొత్త కాంతిని అందిస్తుంది. ఓట్స్‌లో ఉండే ఐరన్ చర్మ కణాలను మృదువుగా మారుస్తుంది. వాపులను తగ్గిస్తుంది. గాయాలు, పుండ్లు మానిపోతాయి. ఓట్స్‌లో ఉండే మెగ్నిషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. చనిపోయిన చర్మ కణాల స్థానంలో కొత్త కణాలు ఏర్పడేలా చేస్తుంది. అలాగే ఓట్స్‌లో ఉండే ప్రోటీన్లు కండరాలకు బలాన్నిస్తాయి. కేవలం 8 టేబుల్ స్పూన్ల ఓట్స్‌ను తింటే చాలు మనకు రోజు మొత్తంలో కావల్సిన ప్రోటీన్‌లో 15 శాతం వరకు అందుతుంది. అలాగే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, గ్లూటమైన్ వంటి పోషకాలు ఓట్స్‌లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి కండరాలకు మరమ్మత్తులు చేస్తాయి. కండరాలు నిర్మాణం అయ్యేలా చేస్తాయి.

బరువు తగ్గేందుకు..
ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి దురదలు, వాపులు, హైబీపీని తగ్గిస్తాయి. ఓట్స్‌లో ఉండే బీటా గ్లూకాన్ రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో మధుమేహం అదుపులో ఉంటుంది. ఓట్ మీల్‌లో ఆరెంజ్ జ్యూస్ కలుపుకుని తింటే ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఓట్స్‌లో పిండి పదార్థాలు కూడా పుష్కలంగానే ఉంటాయి. ఇవి శరీరానికి కావల్సినంత శక్తిని అందిస్తాయి. దీంతో రోజంతా చురుగ్గా పనిచేయవచ్చు. త్వరగా అలసిపోకుండా ఉంటారు. ఓట్స్‌ను రోజూ తింటూ ఉంటే శరీర మెటబాలిజం ప్రక్రియ మెరుగు పడుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఓట్స్ కొన్ని తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ క్యాలరీలను ఇచ్చే ఆహారాన్ని తీసుకోకుండా ఉంటారు. తద్వారా బరువు తగ్గుతారు. ఓట్స్‌లో బీటా గ్లూకాన్ అనే ఓ రకమైన ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఓట్స్‌లో ఉండే లినోలీక్ యాసిడ్, ఫైబర్‌లు రక్తంలో ఉండే ట్రై గ్లిజరిడ్స్, చెడు కొలెస్ట్రాల్‌లను తగ్గిస్తాయి. రక్తనాళాలను శుద్ధి చేస్తాయి. వాటిల్లో కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి. హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తాయి.
గుండె ఆరోగ్యానికి..
ఓట్స్‌లో మన శరీరానికి పనికొచ్చే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె కణాలను, రక్త సరఫరా వ్యవస్థను రక్షిస్తాయి. అలాగే ఓట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త నాళాల గోడలను డ్యామేజ్ కాకుండా చూస్తాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. నిత్యం మనం 25 నుంచి 35 గ్రాముల మోతాదులో ఫైబర్ తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. అది మనకు ఓట్ మీల్ ద్వారా లభిస్తుంది. కనుక రోజూ ఓట్స్‌ను తింటే దాంతో శరీరానికి ఫైబర్ పుష్కలంగా అందుతుంది. అది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరిచి జీర్ణ సమస్యలైన గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తదితర సమస్యలను పోగొడుతుంది. ఈ క్రమంలోనే రోజూ ఓట్స్‌ను తినాలని డాక్టర్ మంజరి చంద్ర తెలిపారు.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



