Green Apple | గ్రీన్ యాపిల్ రోజూ మన డైట్‌లో ఉండాల్సిందే.. ఎందుకంటే..?
Green Apple | యాపిల్ పండ్లు.. ఈ పేరు చెప్పగానే ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయమైన పండ్లు మనకు గుర్తుకు వస్తాయి. యాపిల్ పండ్లను చూడగానే ఎవరికైనా నోరూరిపోతుంది. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ పండ్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే యాపిల్స్‌లోనూ అనేక రకాలు ఉన్నాయి.
Green Apple | యాపిల్ పండ్లు.. ఈ పేరు చెప్పగానే ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయమైన పండ్లు మనకు గుర్తుకు వస్తాయి. యాపిల్ పండ్లను చూడగానే ఎవరికైనా నోరూరిపోతుంది. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ పండ్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే యాపిల్స్‌లోనూ అనేక రకాలు ఉన్నాయి. వాటిల్లో గ్రీన్ యాపిల్స్ కూడా ఒకటి. ఇవి సాధారణ యాపిల్స్ లాగే మనకు మార్కెట్‌లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. కానీ సాధారణ యాపిల్స్‌ను తిన్నట్లు చాలా మంది గ్రీన్ యాపిల్స్ ను తినడం లేదు. వాస్తవానికి ఈ యాపిల్స్ కూడా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. గ్రీన్ యాపిల్స్‌లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. కనుక గ్రీన్ యాపిల్స్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే మనకు ఎంతో మేలు జరుగుతుంది. అయితే గ్రీన్ యాపిల్స్ ను తినడం వల్ల కలిగే లాభాల గురించి నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ఇటీవలే వివరాలను వెల్లడించారు.
జీర్ణ వ్యవస్థకు..
గ్రీన్ యాపిల్స్ మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ యాపిల్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగుల్లో ఆహారం కదలికలను సులభతరం చేస్తుంది. దీని వల్ల మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఫైబర్ వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే పిండి పదార్థాలను శరీరం నెమ్మదిగా శోషించుకుంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగకుండా చూసుకోవచ్చు. దీని వల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. గ్రీన్ యాపిల్స్‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక ఈ యాపిల్స్ ను తింటే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. ఫ్రీ ర్యాడికల్స్ తొలగించబడతాయి. శరీరం సహజసిద్ధంగా బ్యాక్టీరియా, వైరస్, ఇతర సూక్ష్మ క్రిములను ఎదుర్కొంటుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే శరీరంలోని వాపులు సైతం తగ్గుతాయి.

బరువు తగ్గేందుకు..
గ్రీన్ యాపిల్స్ లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కనుక ఈ పండ్లను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇలా బరువును తగ్గించడం తేలికవుతుంది. అధికంగా బరువు ఉన్నవారు రోజూ గ్రీన్ యాపిల్స్‌ను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. ఈ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) స్థాయిలను పెంచుతుంది. దీని వల్ల రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
చర్మం, కళ్ల ఆరోగ్యానికి..
గ్రీన్ యాపిల్స్‌లో పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి బీపీని నియంత్రించడంలో సహాయం చేస్తాయి. కనుక హైబీపీ ఉన్నవారు ఈ పండ్లను తింటుంటే ఎంతగానో మేలు జరుగుతుంది. గ్రీన్ యాపిల్స్ చాలా తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి. కనుక ఈ పండ్లను తింటే షుగర్ లెవల్స్ వెంటనే పెరగవు. పైగా వీటిల్లో ఉండే ఫైబర్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్ తగ్గించేందుకు సహాయం చేస్తాయి. కనుక గ్రీన్ యాపిల్స్‌ను తరచూ తినడం వల్ల డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. అలాగే ఈ పండ్లు కళ్లు, చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. గ్రీన్ యాపిల్స్‌లో అధికంగా ఉండే విటమిన్ సి మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయం చేస్తుంది. కొల్లాజెన్ వల్ల చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. చర్మం పగలడం తగ్గుతుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. అలాగే ఈ పండ్లలోని విటమిన్ ఎ, ఫైటో న్యూట్రియెంట్లు కంటి చూపును మెరుగు పరుస్తాయి. కళ్ల సమస్యలను తగ్గిస్తాయి. ఇలా గ్రీన్ యాపిల్స్ మనకు ఎంతో మేలు చేస్తాయి. కనుక వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు సైతం సూచిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



