Pistachios | రాత్రి పూట పిస్తా పప్పు తింటే.. షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు..!
Pistachios | ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాలా మంది టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న విషయం విదితమే. ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే ఈ వ్యాధి వచ్చేది. కానీ ప్రస్తుతం యుక్త వయస్సులో ఉన్నవారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీంతో జీవితాంతం మందులను మింగాల్సి వస్తోంది.
Pistachios | ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాలా మంది టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న విషయం విదితమే. ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే ఈ వ్యాధి వచ్చేది. కానీ ప్రస్తుతం యుక్త వయస్సులో ఉన్నవారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీంతో జీవితాంతం మందులను మింగాల్సి వస్తోంది. యుక్త వయస్సులో ఉన్నవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. వాటిల్లో ఒత్తిడిని ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అలాగే రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం, ఎక్కువ సేపు మేల్కొని ఉండడం, వ్యాయామం చేయకపోవడం, గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేయడం వల్ల కూడా టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. టైప్ 2 డయాబెటిస్‌లో ప్రధానంగా రోగులు ఇన్సులిన్ నిరోధకతను ఎదుర్కొంటారు. అంటే క్లోమగ్రంథి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసినప్పటికీ శరీరం దాన్ని స్వీకరించలేకపోతుంది. ఇందుకు కొవ్వు అడ్డంకిగా మారుతుంది. దీన్నే ఇన్సులిన్ నిరోధకత అంటారు.
ఇన్సులిన్ నిరోధకతకు చెక్..
అయితే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించేందుకు కూడా మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ సహజసిద్ధంగా దీన్ని తగ్గించాలని వైద్యులు సూచిస్తుంటారు. అప్పుడే టైప్ 2 డయాబెటిస్‌ను కూడా వెనక్కి మళ్లించడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. అయితే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించేందుకు పిస్తా పప్పు అద్భుతంగా పనిచేస్తుందని సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది. ఈ మేరకు అమెరికాలోని పెన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తమ పరిశోధన వివరాలను వెల్లడించారు. ఈ వివరాలను కరెంట్ డెవలప్‌మెంట్స్ ఇన్ న్యూట్రిషన్ అనే అధ్యయనంలో ప్రచురించారు.
మంచి బ్యాక్టీరియా వృద్ధి..
ఈ వివరాల ప్రకారం పిస్తా పప్పును రోజూ 50 గ్రాముల మేర రాత్రి పూట నిద్రకు ముందు తినాల్సి ఉంటుంది. దీంతో 12 వారాల్లో జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది బ్యుటైరేట్ అనే ఓ షార్ట్ చెయిన్ ఫ్యాటీ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఈ క్రమంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఇలా క్రమంగా పిస్తా పప్పును రోజూ రాత్రి పూట తినడం వల్ల షుగర్ లెవల్స్ గణనీయంగా తగ్గుతాయని తేల్చారు. ఈ మేరకు పెన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు 51 మంది ప్రీ డయాబెటిస్ ఉన్నవారిపై పరిశోధనలు చేశారు. వారికి రోజూ రాత్రి 2 ఔన్సుల (దాదాపు 50 గ్రాములు) పిస్తాపప్పును తినమని ఇచ్చారు. 12 వారాల పాటు వారు అలా పిస్తాపప్పును తిన్నారు. అనంతరం వారి మలాన్ని పరీక్షించగా అందులో మంచి బ్యాక్టీరియాకు చెందిన అవశేషాలు పెరిగినట్లు నిర్దారించారు. కనుక పిస్తాపప్పును రాత్రి పూట తింటే షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుందని వారు సూచిస్తున్నారు. ప్రీ డయాబెటిస్ ఉన్నవారు ఈ పని చేస్తే అసలు డయాబెటిస్ రాకుండా చూసుకోవచ్చని అంటున్నారు. దీంతో జీవితాంతం మందులను వాడే బాధ తప్పుతుందని తేల్చారు.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



