Blood Sugar Levels | డయాబెటిస్ ఉన్నవారికి 3 అద్భుతమైన ఆహారాలు.. వైద్య నిపుణుల సూచన..
Blood Sugar Levels | డయాబెటిస్ అంటే రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణానికి మించి పెరగడం. ఈ వ్యాధికి పలు రకాలు ఉన్నప్పటికీ, ఎక్కువగా కనిపించేవి టైప్-1, టైప్-2 డయాబెటిస్‌లు. టైప్-1 డయాబెటిస్ ఆటోఇమ్యూన్ సమస్య కాగా, టైప్-2 డయాబెటిస్‌కు వంశపారంపర్యత, అధిక బరువు, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా నిలుస్తాయి.
Blood Sugar Levels | డయాబెటిస్ అంటే రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణానికి మించి పెరగడం. ఈ వ్యాధికి పలు రకాలు ఉన్నప్పటికీ, ఎక్కువగా కనిపించేవి టైప్-1, టైప్-2 డయాబెటిస్‌లు. టైప్-1 డయాబెటిస్ ఆటోఇమ్యూన్ సమస్య కాగా, టైప్-2 డయాబెటిస్‌కు వంశపారంపర్యత, అధిక బరువు, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా నిలుస్తాయి. ఈ రెండు పరిస్థితుల్లోనూ క్లోమగ్రంథి (ప్యాంక్రియాస్) సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడం లేదా శరీరం ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను సరిగా వినియోగించుకోలేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం, 2022 నాటికి 18 ఏళ్లు పైబడిన పెద్దల్లో సుమారు 14 శాతం మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారని తేలింది.
పండ్లు, కూరగాయలు ముఖ్యం..
జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధులను నివారించడంలో ఆరోగ్యకరమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజువారీ భోజనంలో కొన్ని రకాల పండ్లు, కూరగాయలను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతూ, గ్లూకోజ్ స్థాయిలని నియంత్రించేందుకు రోజువారి ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన మూడు ముఖ్యమైన ఆహార పదార్థాలను ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రక్తంలో చక్కెర నియంత్రణకు ఉపయోగపడే 3 ముఖ్యమైన ఆహారాలలో పర్పుల్ క్యాబేజీ, బ్లూబెర్రీలు, ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ముందు వరుసలో నిలుస్తాయని వైద్యులు చెబుతున్నారు.

పర్పుల్ క్యాబేజీ..
పర్పుల్ క్యాబేజీలను ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. సాధారణ క్యాబేజీతో పోలిస్తే ఈ క్యాబేజీలో ప్రత్యేక సమ్మేళనాలు, ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మెటబాలిజంను పెంచుతాయి. దీని వల్ల జీవక్రియలు మెరుగు పడుతాయి. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అలాగే పర్పుల్ క్యాబేజీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. ఈ క్యాబేజీలో అధికంగా ఉండే పాలిఫినాల్స్ కారణంగా చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకోవచ్చు. ఇలా డయాబెటిస్ ఉన్నవారికి పర్పుల్ క్యాబేజీ మేలు చేస్తుంది.
బ్లూబెర్రీలు, ఆలివ్ ఆయిల్..
డయాబెటిస్ ఉన్నవారికి బ్లూబెర్రీలు కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో యాంథో సయనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శక్తివంతమైన సమ్మేళనాలుగా పరిగణించబడుతున్నాయి. అందువల్ల ఇవి ఇన్సులిన్ సెన్సిటీవిటీని పెంచుతాయి. శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ పండ్లను రోజూ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకోవచ్చు. కనుక డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లను కూడా రోజూ తింటుండాలి. అలాగే ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు ఇన్సులిన్ ను సరిగ్గా వినియోగించుకునేలా చేస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఈ పండ్లను తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా ఆయా ఆహారాలు డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేస్తాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



