Ground Walking vs Treadmill | బయట నడవాలా లేక ట్రెడ్‌మిల్ మీదనా?: గుండె ఆరోగ్యానికి, వెయిట్ లాస్‌కు ఏది బెస్ట్?
బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి బయట నడవడం మంచిదా లేక ట్రెడ్‌మిల్ బెస్ట్ ఆప్షనా? ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ ఏమంటున్నారో తెలుసుకుందాం రండి.
- గుండె ఆరోగ్యానికి క్రమం తప్పకుండా (Consistency) నడవడం అత్యంత ముఖ్యం
- గ్రౌండ్ వాకింగ్ (బయట నడవడం) వల్ల శరీరానికి బ్యాలెన్స్, కోఆర్డినేషన్ పెరిగి తగ్గనున్న మానసిక ఒత్తిడి
- వాతావరణంతో పనిలేకుండా, సురక్షితంగా నడవడానికి వృద్ధులకు ట్రెడ్‌మిల్ బెస్ట్ ఆప్షన్
- ట్రెడ్‌మిల్‌పై నడిచేటప్పుడు 1% ఇంక్లైన్ (Incline) పెట్టుకుంటే బయట నడిచినంత ఫలితం
Ground Walking vs Treadmill | త్రినేత్ర.న్యూస్ : మారుతున్న జీవనశైలిలో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వాకింగ్ (నడక) అనేది అత్యుత్తమ వ్యాయామం. అయితే ఫిట్‌నెస్ జర్నీ ప్రారంభించే చాలామందికి 'బయట నడవాలా లేక ట్రెడ్‌మిల్ మీద నడవాలా?' అనే కామన్ డౌట్ ఉంటుంది. ఈ ప్రశ్నకు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఎవిడెన్స్-బేస్డ్ హెల్త్ ఇన్ఫర్మేషన్‌ను అందించే ఆయన.. ఈ రెండు పద్ధతుల మధ్య ఉన్న లాభాలను, చిన్న చిన్న తేడాలను క్లియర్‌గా వివరించారు. ఆ వివరాలు డాక్టర్ మాటల్లోనే...
"రోజు 5 కిలోమీటర్లు గ్రౌండ్ మీద నడవాలా లేక ట్రెడ్‌మిల్ మీద నడవాలా? ఏది హార్ట్‌కి ఎక్కువ ఉపయోగం? ఏది వెయిట్ లాస్‌కి బెస్ట్? అనే ప్రశ్నలకు సమాధానం ఒక్కటి కాదు. రెండూ చాలా మంచి వ్యాయామాలే. అసలు నడవకపోవడం కంటే రెగ్యులర్‌గా ఏదో ఒక విధంగా నడవడం వేల రెట్లు మంచిది. అయితే, ఈ రెండింటి మధ్య కొన్ని చిన్న తేడాలు ఉన్నాయి.
గ్రౌండ్ వాకింగ్ (బయట నడవడం) లాభాలు
బయట నడిచేటప్పుడు గాలి తగులుతుంది. రోడ్డుపై చిన్న చిన్న స్లోప్స్, టర్న్స్, ఎగుడుదిగుడులు (అన్‌ఈవెన్ సర్ఫేస్) ఉంటాయి. దీనివల్ల శరీరానికి బ్యాలెన్స్, కోఆర్డినేషన్ మెరుగుపడటంతో పాటు కాళ్లలోని చిన్న కండరాలు కూడా చురుగ్గా పనిచేస్తాయి. అవుట్‌డోర్‌లో (ప్రకృతి మధ్యలో) నడవడం వల్ల చాలామందిలో స్ట్రెస్ తగ్గుతుంది, మూడ్ ఎలివేట్ అవుతుందని అనేక స్టడీస్ నిరూపించాయి.
ట్రెడ్‌మిల్ వాకింగ్ లాభాలు
ట్రెడ్‌మిల్ పై నడిచేటప్పుడు స్పీడ్ పూర్తిగా మీ కంట్రోల్‌లో ఉంటుంది. వాన పడినా, ఎండ తీవ్రంగా ఉన్నా, కాలుష్యం ఉన్నా, రాత్రి సమయమైనా.. మీ ఎక్సర్‌సైజ్ మాత్రం మిస్ అవ్వదు. తూలి కింద పడే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి వృద్ధులకు, కార్డియాక్ రిహాబిలిటేషన్ పేషెంట్లకు ట్రెడ్‌మిల్ బాగా ఉపయోగపడుతుంది.
క్యాలరీలు దేనిలో ఎక్కువ ఖర్చవుతాయి?
ఒకే స్పీడ్, ఒకే టైమ్‌తో నడిస్తే రెండింటి మధ్య క్యాలరీల ఖర్చులో తేడా చాలా చిన్నది. ట్రెడ్‌మిల్ బెల్ట్ మన కాలుని ఆటోమెటిక్‌గా ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి, బయట నడిచినంత రెసిస్టెన్స్ ట్రెడ్‌మిల్ మీద ఉండదు. బయట ఫ్లాట్ రోడ్ మీద నడిచిన దానితో సమానమైన ఫలితం రావాలంటే.. ట్రెడ్‌మిల్ పైన 1% ఇంక్లైన్ (Incline) పెట్టుకుని నడవాలని నిపుణులు సూచిస్తున్నారు.
హార్ట్‌కి ఏది మంచిది? ఫైనల్ రిజల్ట్ ఏంటి?
గుండె ఆరోగ్యానికి మీరు ఎక్కడ నడిచారు అన్నదానికంటే.. ఎంత రెగ్యులర్‌గా నడిచారు? ఎంత వేగంగా (Brisk) నడిచారు? వారానికి ఎంత సమయం కేటాయించారు? అన్నదే ముఖ్యం. సైంటిఫిక్ గైడ్‌లైన్స్ కూడా స్థలం కంటే, కన్సిస్టెన్సీ (క్రమం తప్పకుండా చేయడం) కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి.
మీరు బయట సేఫ్‌గా నడవగలిగితే గ్రౌండ్ వాకింగ్ చాలా మంచిది. ఒకవేళ బయటికి వెళ్లడం కుదరకపోతే ట్రెడ్‌మిల్ వాడటం కూడా అద్భుతమైన ఆప్షనే. అసలైన బెస్ట్ వాకింగ్ ఏంటంటే.. మీరు మిస్ అవ్వకుండా "ప్రతిరోజూ చేసే వాకింగ్"."
View this post on Instagram
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..



