Eating Pineapple | పైనాపిల్ పండ్లను తిన్నప్పుడు నాలుక పగిలినట్లు అయి మంటగా అనిపిస్తుంది.. ఎందుకని..?
Eating Pineapple | పైనాపిల్ పండ్లకు మనకు దాదాపుగా ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. ఈ పండ్లతో చాలా మంది జ్యూస్ తయారు చేసి తాగుతుంటారు. పైనాపిల్ పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
Eating Pineapple | పైనాపిల్ పండ్లకు మనకు దాదాపుగా ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. ఈ పండ్లతో చాలా మంది జ్యూస్ తయారు చేసి తాగుతుంటారు. పైనాపిల్ పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పైనాపిల్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులకు చెక్ పెడుతుంది. అలాగే ఈ పండ్లను తింటే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. జీర్ణవ్యవస్థలో ఉండే పురుగులు నశిస్తాయి. అయితే పైనాపిల్ పండ్లను తిన్నప్పుడు సాధారణంగా చాలా మందికి నాలుక పగులుతుంది. దీంతో ఈ పండ్లను నేరుగా తినడం కన్నా జ్యూస్ రూపంలోనే ఎక్కువగా తీసుకుంటారు. అయితే పైనాపిల్ పండ్లను తిన్నప్పుడు నాలుక అలా పగిలేందుకు పలు కారణాలు ఉన్నాయి.
కారణాలు ఇవే..
పైనాపిల్ పండ్లలో బ్రొమెలెయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ క్రమంలోనే పైనాపిల్‌ను తిన్నప్పుడు అందులో నుంచి ఈ ఎంజైమ్ విడుదల అవుతుంది. అప్పుడు అది నేరుగా నాలుకను తాకుతుంది. నాలుక అంటే ప్రోటీన్లకు మరో రూపమే. కనుక సహజంగానే అది పగిలినట్లు అవుతుంది. పైనాపిల్ పండ్లలో ఉండే ఆ ఎంజైమ్ కారణంగా నాలుకపై ఉండే ప్రోటీన్లు, సురక్షితమైన మ్యూకస్ పొర విచ్ఛిన్నం అవుతాయి. ఈ క్రమంలోనే నాలుక పగిలినట్లు అవుతుంది. ఇక ఈ విధంగా జరిగేందుకు మరో కారణం కూడా ఉంది. పైనాపిల్ పండ్లలో రాఫైడ్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి క్యాల్షియం ఆగ్జలేట్‌ను కలిగి ఉంటాయి. ఇవి ఆకారంలో చిన్నపాటి సూదుల్లా ఉంటాయి. కానీ మనకు కళ్లకు కనిపించవు. ఈ క్రమంలో పైనాపిల్ పండ్లను తింటే ఇవి కూడా నాలుక మీదకు చేరుకుంటాయి. అవి నాలుకను పొడిచినట్లు చేస్తాయి. దీంతో మనకు పైనాపిల్‌ను తిన్నప్పుడు కొన్ని సార్లు సూదుల్తో గుచ్చినట్లు కూడా అనిపిస్తుంది. దీని వల్ల కూడా నాలుక పగిలి మండుతుంది. ఇలా పైనాపిల్ తిన్నప్పుడు నాలుక పగిలి మండేందుకు రెండు రకాల కారణాలు ఉంటాయి.
ఇలా తినవచ్చు..
అయితే పైనాపిల్ పండ్లను నేరుగా తినాలనుకుంటే వాటిని పలు మార్గాల్లో తినాల్సి ఉంటుంది. పైనాపిల్ పండ్ల ముక్కలను పెనంపై వేసి కాస్త వేడి చేయాలి. లేదా గ్రిల్ చేయాలి. దీంతో బ్రొమెలెయిన్ ఎంజైమ్ ప్రభావం తగ్గుతుంది. ఆ తరువాత ఆ ముక్కలను తినవచ్చు. అలాగే పైనాపిల్ ముక్కలను కట్ చేసిన అనంతరం వాటిపై ఉప్పు చల్లి కూడా తినవచ్చు. లేదా ఉప్పు నీటిలో ఆ ముక్కలను ఒక నిమిషం పాటు ఉంచి ఆ తరువాత తీసి కడిగి అనంతరం వాటిని తినాలి. ఇలా చేయడం వల్ల కూడా నాలుక పగలకుండా ఉంటుంది. ఇక పైనాపిల్ ముక్కలను అడ్డంగా కోసినప్పుడు మధ్యలో ఉండే భాగాన్ని తినకూడదు. అందులో ఎక్కువ మొత్తంలో బ్రొమెలెయిన్ ఉంటుంది. అది నాలుకను మరింత పగిలేలా చేసి మంట వచ్చేలా చేస్తుంది. కనుక ఆ భాగాన్ని తినకుండా వదిలేయాలి. అదేవిధంగా పైనాపిల్ ముక్కలను సేఫ్ గా తినాలనుకుంటే వాటిని పెరుగుతో కలిపి తింటే మంచిది. దీంతో నాలుక పగలకుండా చూసుకోవచ్చు. ఈ విధంగా పైనాపిల్‌ను తినవచ్చు.
ఇక పైనాపిల్ ముక్కలను తిన్న తరువాత నాలుక పగిలినట్లు అయి మంట అనిపించినా కాసేపటికి అది తగ్గిపోతుంది. కనుక ఇందులో ఆందోళన చెందాల్సిన పనిలేదు. అయితే ఆ బాధను భరించలేము అనుకుంటే పైన చెప్పిన విధంగా వాటిని తినవచ్చు. అయితే పైనాపిల్ పండ్లను తింటే కొందరికి పడదు. అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారు ఈ పండ్లను తినకపోవడమే మంచిది.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



