Jaggery | చక్కెరకు బదులుగా బెల్లంను తినవచ్చా..? దీన్ని ఎవరు తినకూడదు..?
చక్కెర తిననివారు చాలా మంది దానికి ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని (Jaggery) వాడుతుంటారు. బెల్లంతో అనేక తీపి వంటకాలను కూడా చేసి తింటుంటారు. చక్కెరను రిఫైన్డ్ పద్ధతిలో తయారు చేస్తారు. కనుక అది మన ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని చాలా మంది విశ్వసిస్తారు.
Jaggery | చక్కెర తిననివారు చాలా మంది దానికి ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని వాడుతుంటారు. బెల్లంతో అనేక తీపి వంటకాలను కూడా చేసి తింటుంటారు. చక్కెరను రిఫైన్డ్ పద్ధతిలో తయారు చేస్తారు. కనుక అది మన ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని చాలా మంది విశ్వసిస్తారు. ఇక బెల్లాన్ని సహజసిద్ధంగా తయారు చేస్తారు కనుక ఇది ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని విశ్వసిస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది బెల్లాన్ని తరచూ నేరుగా తింటూనే ఉంటారు. ఇక చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడం కోసం, దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గించడం కోసం కూడా కొందరు బెల్లాన్ని తింటుంటారు. బెల్లాన్ని తినడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఇందులో పోషకాలు కూడా ఉంటాయి. దీన్ని పల్లీలు, నువ్వులు వంటి ఆహారాలతోనూ కలిపి తింటారు. దీని వల్ల మరిన్ని పోషకాలతోపాటు శక్తి కూడా లభిస్తుంది.
అనేక పోషకాలు..
బెల్లంలో అనేక పోషకాలు ఉంటాయి. చక్కెరను రీఫైన్డ్ పద్ధతిలో తయారు చేస్తారు కనుక అందులో పోషకాలు ఉండవు. కానీ బెల్లాన్ని సహజసిద్ధంగా తయారు చేస్తారు కనుక ఇందులో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. బెల్లంలో అనేక రకాల బి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్లు బి1, బి2, బి6లతోపాటు విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. అలాగే ఇందులో ఐరన్, మెగ్నిషియం, పొటాషియం, క్యాల్షియం వంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇక 100 గ్రాముల బెల్లాన్ని తినడం వల్ల 383 క్యాలరీల శక్తి లభిస్తుంది. అయితే బెల్లం వల్ల మనకు శక్తి అధికంగా లభించినప్పటికీ చక్కెర కన్నా దీన్ని కాస్త తక్కువ ప్రాసెస్ చేస్తారు. కనుక బెల్లం ఆరోగ్యకరమైందని చెప్పవచ్చు. బెల్లంలో పోషకాలు కూడా ఉంటాయి. కాబట్టి చక్కెరకు బదులుగా దీన్ని వాడుకోవచ్చు. అయితే ఎంత బెల్లం అయినా సరే అది కూడా తీపి పదార్థమే కనుక దాన్ని కూడా మోతాదులోనే వాడాలని, పరిమితికి మించి తినకూడదని నోయిడాకు చెందిన మేదాంత హాస్పిటల్ డైటెటిక్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ నిధి సహాయ్ తెలిపారు.
జీర్ణ వ్యవస్థకు..
మన దేశంలో చలికాలంలో బెల్లాన్ని అధికంగా తింటారని సహాయ్ అన్నారు. బెల్లంలో మన శరీరంలో వేడిని పెంచే సహజసిద్ధమైన గుణాలు ఉంటాయి. కనుక చలికాలంలో బెల్లాన్ని తింటే వెచ్చగా ఉండవచ్చు. చలి నుంచి రక్షణ లభిస్తుంది. దీన్ని తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. హిమోగ్లోబిన్ లెవల్స్ కూడా పెరుగుతాయి. దీంతో రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. అలసట, నీరసం తగ్గిపోతాయి. బెల్లం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. దగ్గు నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. గొంతు నొప్పి, జలుబు కూడా తగ్గిపోతాయి.. అని ఆమె తెలిపారు. బెల్లాన్ని తినడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు అనేకం లభిస్తాయి. ఇది జీర్ణాశయ ఎంజైమ్‌లు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి బాడీని డిటాక్స్ చేయడంలోనూ బెల్లం సహాయం చేస్తుందని సహాయ్ తెలిపారు.
రోగ నిరోధక శక్తికి..
బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల దీన్ని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. అలాగే బెల్లం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. దీని వల్ల శారీరక అలసట తగ్గిపోతుంది. మళ్లీ చురుగ్గా పనిచేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. అయితే బెల్లం వల్ల అనేక లాభాలు ఉన్నప్పటికీ దీన్ని మోతాదులోనే తినాలి, అతిగా తినకూడదు. అలాగే డయాబెటిస్ ఉన్నవారు, అధికంగా బరువు ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు బెల్లంను తినాల్సి ఉంటుంది. బెల్లాన్ని రోజూ చిన్న ముక్కలాగా తినవచ్చని, దీంతో ఎంతో మేలు కలుగుతుందని నిధి సహాయ్ స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



