GLP-1 Weight Loss Medicine | బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులు.. అందరికీ సెట్ కావు.. డైటిషియన్ సూచనలు..
GLP-1 Weight Loss Medicine | బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులు ఇప్పుడు భారత్‌లోనూ అందుబాటులో ఉండడంతో చాలా మంది ఈ మందులను వాడేందుకు ప్రయత్నిస్తున్నారు. టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల కోసం ఈ మందులను కంపెనీలు మార్కెట్లో ప్రవేశపెడుతున్నప్పటికీ వీటిపై ఊబకాయం ఉన్నవారు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు.
GLP-1 Weight Loss Medicine | బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులు ఇప్పుడు భారత్‌లోనూ అందుబాటులో ఉండడంతో చాలా మంది ఈ మందులను వాడేందుకు ప్రయత్నిస్తున్నారు. టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల కోసం ఈ మందులను కంపెనీలు మార్కెట్లో ప్రవేశపెడుతున్నప్పటికీ వీటిపై ఊబకాయం ఉన్నవారు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో సెమాగ్లూటైడ్ వంటి జీఎల్పీ-1 మందుల వాడకం ఎక్కువైంది. వీటిని జీఎల్పీ-1 రిసెప్టర్ ఆగోనిస్ట్స్ అని కూడా పిలుస్తారు. ఈ మందులను వాడడం వల్ల చక్కెర తినాలన్న కోరిక తగ్గుతుంది. అసలు ఆహారంపై యావ ఉండదు. తినే ఆహారం పరిమాణం కూడా గణనీయంగా తగ్గుతుంది. కాస్త తింటేనే పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. దీంతో పోర్షన్ సైజ్ ఆటోమేటిగ్గా కంట్రోల్ అవుతుంది. చాలా సేపు ఉన్నా ఆకలి వేయదు. అలాగే కొవ్వును సైతం కరిగిస్తాయి. దీంతో బరువు తగ్గడంలో జీఎల్పీ-1 మందులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే ఈ మందులను కేవలం డాక్టర్ సూచనతోనే వాడాలని, అందరికీ ఈ మందులు సూట్ కావు అని ప్రముఖ డైటిషియన్ దీప్తా నాగ్‌పాల్ తెలిపారు.
ఆరోగ్యకరమైన జీవనశైలి తప్పనిసరి..
ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టిన డైటిషియన్ దీప్తా నాగ్ పాల్.. జీఎల్పీ-1 మందుల గురించి పలు విషయాలను వివరించారు. జీఎల్పీ-1 చికిత్స కోసం వాడే సెమాగ్లూటైడ్ వంటి మందులు బరువు తగ్గేందుకు షార్ట్ కట్ కావని అన్నారు. ఈ మందులను డాక్టర్ సూచనతోనే వాడాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కేవలం మందులను వాడడం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని, వేళకు భోజనం చేయడం, తగినంత నిద్ర పోవడం, నీళ్లను తాగడం, వ్యాయామం వంటి అలవాట్లను పాటించాలని అన్నారు. దీని వల్లే ఎక్కువ బరువు తగ్గేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. అయితే జీఎల్పీ-1 మందులు (ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు) అందరికీ సూట్ కావని, కేవలం కొందరికి మాత్రమే ఈ మందులను భరించే శక్తి ఆటోమేటిగ్గా వస్తుందని, ఈ మందులను అందరూ వాడలేరని ఆమె తెలిపారు.
సైడ్ ఎఫెక్ట్స్ అధికం..
జీఎల్పీ-1 మందులను వాడడం వల్ల బరువు తగ్గే ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ ఈ మందుల కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయని దీప్తా నాగ్ పాల్ తెలిపారు. ముఖ్యంగా ఎల్లప్పుడూ వికారంగా ఉండడం, వాంతికి వచ్చినట్లు అనిపించడం, కొన్ని రకాల ఆహారాల పట్ల తీవ్ర విముఖత ఏర్పడడం, వాటి వాసనలు అసలు పడకపోవడం, కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, విరేచనాలు లేదా మలబద్దకం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయన్నారు. అయితే జీఎల్పీ-1 మందులను వాడడం ప్రారంభించాక శరీరం ఆ మందులకు అలవాటు పడితే ఆయా సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గుతాయని, కానీ ఇది అందరికీ సాధ్యం అయ్యే పని కాదన్నారు. కొందరు మందులను వాడడం ప్రారంభించాక తలెత్తే సైడ్ ఎఫెక్ట్స్ ను తట్టుకోలేక కొన్ని నెలలకే వాడడం మానేస్తారని తెలిపారు. ఇక ఈ మందుల ఖరీదు కూడా ఎక్కువగానే ఉంటుంది కనుక దీర్ఘకాలంలో వాడగలం అనే ఆర్థిక స్థోమత ఉంటేనే వీటిని ఎంచుకోవాలని, లేదంటే అనవసరంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని, పైగా సైడ్ ఎఫెక్ట్స్ ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.
సొంత వైద్యం వద్దు..
ప్రస్తుతం జీఎల్పీ-1 ఔషధాలను అధిక శాతం మంది వాడేందుకు ఆసక్తిని చూపిస్తున్న నేపథ్యంలో దీప్తా నాగ్ పాల్ మాత్రమే కాదు, చాలా మంది వైద్యులు సైతం సోషల్ మీడియా లేదా టీవీ చానల్స్ వేదికగా ఈ ఔషధాల గురించి ప్రజలకు క్షుణ్ణంగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. జీఎల్పీ-1 మందులను అసలు ఎవరి కోసం ఉద్దేశించి అందుబాటులోకి తెచ్చారు, వీటిని ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు, వీటి వల్ల కలిగే దుష్ర్పభావాలు వంటి అనేక విషయాలను వివరిస్తున్నారు. అయితే సొంత వైద్యం పెరిగిన నేపథ్యంలో చాలా మంది అనేక ఔషధాలను ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే వేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే జీఎల్పీ-1 ఔషధాలపై కూడా వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు డాక్టర్ సూచన లేకుండా వీటిని వాడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వీటిని అందరూ వాడకూడదని, నిపుణుల పర్యవేక్షణలో అది కూడా అవసరం అయితేనే వాడాలని వారు సూచిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



