Fiber Requirement | వయస్సును బట్టి రోజుకు ఎవరు ఎంత ఫైబర్ తీసుకోవాలి..?
Fiber Requirement | డయాబెటిస్, అధిక బరువు, కొలెస్ట్రాల్.. ఈ మూడు సమస్యలకు చెక్ పెట్టాలంటే ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోవాలని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ఫైబర్ ఆహారం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆహారం తక్కువగా తింటారు.
Fiber Requirement | డయాబెటిస్, అధిక బరువు, కొలెస్ట్రాల్.. ఈ మూడు సమస్యలకు చెక్ పెట్టాలంటే ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోవాలని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ఫైబర్ ఆహారం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆహారం తక్కువగా తింటారు. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. ఫైబర్ ఆహారాలను తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అయితే రోజుకు ఎవరు ఎంత మేర ఫైబర్‌ను తీసుకోవాలి, వయస్సును బట్టి అది ఎలా మారుతుంది..? అనే విషయాన్ని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. వారు సూచించిన ప్రకారం ఫైబర్ ఉండే ఆహారాలను రోజూ తినాల్సి ఉంటుంది.
వయస్సును బట్టి మోతాదు..
1 ఏడాది నుంచి 3 ఏళ్ల వయస్సు ఉన్న చిన్నారులకు రోజుకు 19 గ్రాముల మేర ఫైబర్ అవసరం ఉంటుంది. 4 నుంచి 8 ఏళ్ల వారికి అయితే 25 గ్రాములు, 9 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి అయితే రోజుకు 30 గ్రాముల మేర ఫైబర్ అవసరం అవుతుంది. 19 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీలకు 25 గ్రాములు, పురుషులకు 38 గ్రాముల మేర ఫైబర్ కావాలి. 51 ఏళ్లు లేదా ఆ పైన వయస్సు ఉన్న మహిళలు రోజుకు 21 గ్రాములు, పురుషులు 30 గ్రాముల మేర ఫైబర్ అందేలా చూసుకోవాలి.
ఫైబర్‌తో లాభాలు..
ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఫైబర్ వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. ఫైబర్ రోజూ కచ్చితంగా లభించేలా చూసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
వీటిని తినవచ్చు..
1 కప్పు మోతాదులో నేవీ బీన్స్‌ను తింటే సుమారుగా 19 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. పచ్చి బఠానీల్లో 16 గ్రాములు, పప్పు దినుసుల ద్వారా 15.5 గ్రాములు, బ్లాక్ బీన్స్ అయితే 15 గ్రాముల ఫైబర్‌ను పొందవచ్చు. చియా విత్తనాలను 2 టేబుల్ స్పూన్ల మోతాదులో తింటే 10 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఒక అవకాడోను తింటే 10 గ్రాములు, 1 కప్పు ఉడకబెట్టిన శనగల ద్వారా 12.5 గ్రాములు, 1 కప్పు రాస్ప్ బెర్రీలతో 8 గ్రాముల మేర ఫైబర్‌ను పొందవచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



