Khapli Wheat | ఈ గోధుమలు చాలా కాస్ట్లీ.. ఇవి అందించే లాభాలు అలాంటివి మరి..!
Khapli Wheat | ప్రస్తుతం చాలా మందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో నివాసం ఉంటున్నవారు తమ ఆరోగ్యం పట్ల అనేక జాగ్రత్తలను తీసుకుంటున్నారు. రోజూ వ్యాయామం చేయడంతోపాటు వేళకు నిద్రించడం, సరైన పౌష్టికాహారం తీసుకోవడం చేస్తున్నారు.
Khapli Wheat | ప్రస్తుతం చాలా మందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో నివాసం ఉంటున్నవారు తమ ఆరోగ్యం పట్ల అనేక జాగ్రత్తలను తీసుకుంటున్నారు. రోజూ వ్యాయామం చేయడంతోపాటు వేళకు నిద్రించడం, సరైన పౌష్టికాహారం తీసుకోవడం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజల ఆహారపు అలవాట్లలోనూ గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు మన పూర్వీకులు తిన్న చిరు ధాన్యాలను ప్రస్తుతం అధికంగా తింటున్నారు. అందులో భాగంగానే రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు, అరికెలు వంటి చిరుధాన్యాలకు డిమాండ్ బాగా పెరిగింది. అలాగే ఒకప్పుడు ప్రజలు తిన్న సంప్రదాయ పంటలకు చెందిన ఆహారాలను కూడా ఇప్పుడు నగరవాసులు అధికంగా తింటున్నారు. వాటిల్లో ఖఫ్లీ గోధుమలు కూడా ఒకటి. ప్రస్తుతం ఈ గోధుమలతో తయారు చేసిన పిండిని నగరవాసులు అధికంగా ఉపయోగిస్తున్నారు.
పట్టణాలు, నగరాల్లో..
ఖప్లీ గోధుమలనే ఎమ్మర్ గోధుమలు లేదా పురాతన గోధుమలు అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇవి సాధారణ గోధుమల కన్నా చాలా భిన్నంగా ఉంటాయి. అలాగే పోషకాలను కూడా అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. ఒకప్పుడు ప్రజలు ఈ గోధుమలను అధికంగా తినేవారు. వీటితో తయారు చేసే పిండిని అధికంగా ఉపయోగించేవారు. కానీ ఆ తరువాత వీటిని వాడడం చాలా వరకు తగ్గించారు. కానీ ప్రస్తుతం మళ్లీ ఈ గోధుమలకు డిమాండ్ పెరుగుతోంది. నగరాలు, పట్టణాల్లో నివాసం ఉండేవారు ప్రస్తుతం ఈ గోధుమలను అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అధిక పోషక విలువలను కలిగి ఉంటాయి. కనుకనే చాలా మంది ప్రజలు వీటిని తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.

అనేక లాభాలు..
ఖప్లీ గోధుమలతో పిండిని తయారు చేసి అనేక కంపెనీలు కూడా విక్రయిస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్కెట్‌లో మనకు ఖప్లీ గోధుమ పిండి కూడా అందుబాటులో ఉంది. అయితే సాధారణ గోధుమల కన్నా ఖప్లీ గోధుమలలో గ్లూటెన్ తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల జీవనశైలి సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రస్తుతం సాధారణ గోధుమల కన్నా ఖప్లీ గోధుమలనే ఎక్కువగా వాడుతున్నారు. ఖప్లీ గోధుమ పిండితో తయారు చేసే చపాతీలనే అధికంగా తింటున్నారు. వీటిని తినడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అధిక బరువును తగ్గించుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి. కనుకనే ఖప్లీ గోధుమలను తినేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ ఫుడ్ కంపెనీలు కూడా ఈ గోధుమలతో తయారు చేసిన పిండిని అధికంగా విక్రయిస్తున్నాయి.
ధర ఎక్కువే..
అయితే సాధారణ గోధుమ పిండి కన్నా ఖప్లీ గోధుమ పిండి ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణ గోధుమ పిండి ఖరీదు కేజీకి రూ.50 ఉంటే, ఖప్లీ గోధుమ పిండి ధర కేజీకి రూ.160 నుంచి రూ.250 మధ్య ఉంది. కొన్ని కంపెనీలు ఆర్గానిక్ ఖప్లీ గోధుమ పిండిని ఇంకా ఎక్కువ ధరకే విక్రయిస్తున్నాయి. అందువల్ల కేవలం కాస్త స్థోమత ఉన్నవారు మాత్రమే ప్రస్తుతం ఈ పిండిని వాడుతున్నారు. కానీ ధరలను తగ్గించి ప్రజలందరికీ ఈ పిండి అందుబాటులోకి వచ్చేలా చూస్తే ఇంకా ఎక్కువ మంది ఈ పిండిని వాడగలుగుతారు. ఇక గత కొన్నేళ్లుగా సాధారణ గోధుమ పిండి కన్నా ఖప్లీ గోధుమ పిండి అమ్మకాలు 38 నుంచి 40 శాతం వరకు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ గోధుమలను ఎంత ఎక్కువగా వాడుతున్నారనే విషయం స్పష్టమవుతోంది. కనుకనే ప్రజలందరికీ ఈ గోధుమలు తక్కువ ధరలో అందుబాటులో ఉండేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Mushroom Business | రూ. 2500తో పుట్టగొడుగుల వ్యాపారం.. ఏడాదికి రూ. 3 కోట్లు గడిస్తున్న అన్నదమ్ముళ్లు..!
మే 18, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



